తెలంగాణ రాష్ట్రంలోని కొమురం భీమ్ జిల్లా వాంకిడి గిరిజన గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు గురై దాదాపు అరవై మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థత పాలైన సంగతి తెల్సిందే. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, కొండా సురేఖ నిన్న మంగళవారం నిమ్స్ ఆసుపత్రికెళ్లి పరామర్శించారు. అనంతరం వారికి అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. మెరుగైన వైద్య సేవలను […]Read More
Tags :minister of telangana
తెలంగాణ లో వచ్చే ఏడాది సంక్రాంతిలోపు పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియా చిట్ చాట్ లో వెల్లడించారు. రాబోయే నాలుగేళ్లు ఎనుముల రేవంత్ రెడ్డే సీఎంగా ఉంటారు..సీఎం మార్పుపై ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యల్లో నిజం లేదని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. రాష్ట్రంలోని కొందరు ప్రముఖ నాయకులు త్వరలో అవినీతి కేసుల్లో అరెస్ట్ అవుతారని మరొకసారి ఆయన చెప్పారు.Read More
తెలంగాణ వ్యాప్తంగా నియోజకవర్గానికి 3500ఇందిరమ్మ ఇండ్లను ఇవ్వాలని ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెల్సిందే. తాజాగా ఇందిరమ్మ ఇండ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక అప్డేట్ ఇచ్చారు. ఈ నెల ఐదో తారీఖు నుండి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని ఆయన తెలిపారు. దాదాపు పదిహేను రోజుల్లో గ్రామ కమిటీల ద్వారా ఈ ఎంపికను పూర్తి చేస్తామన్నారు. ఇండ్ల నిర్మాణంలో ఎలాంటి డిజైన్లు ఉండవు.. లబ్ధిదారుల […]Read More
తెలంగాణ ప్రజలకు మంత్రి కోమటిరెడ్డి దీపావళి శుభాకాంక్షలు
“చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దీపావళి పండగ” సందర్భంగా రాష్ట్ర ప్రజలకు రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో పదేండ్ల చీకటిని పారద్రోలి ప్రజలు వెలుగుల రేఖలను సృష్టించారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ప్రజాపాలనపై విషం చిమ్ముతున్న అజ్ఞానులకు.. జ్ఞానదీపం వెలగేలా లక్ష్మీదేవి ఆశీర్వదించాలని ఈ సందర్భంగా మంత్రి కోరుకున్నారు. ఈ దీపావళి పండగ ప్రజల జీవితాల్లో వెలుగురేఖలను ఇనుమడింపచేయాలని ఆ భగవంతుడిని కోరుకున్నారు. […]Read More
ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చెందిన అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ లాయర్ అవతారమెత్తారు. ఏకంగా మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంత్రి కొండా సురేఖపై పరువు నష్ట దావా కేసు వేసిన సంగతి తెల్సిందే. ఈ కేసు విచారణలో భాగంగా మాజీ మంత్రి కేటీఆర్, సాక్షులైన బీఆర్ఎస్ నేతలు దాసోజ్ శ్రవణ్, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, బాల్క సుమన్ నాంపల్లి కోర్టుకు హాజరై తమ వాంగుల్మాన్ని విన్పించారు. ఈ సందర్భంగా నాంపల్లి […]Read More
రేషన్ కార్డు లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. వచ్చే ఏడాది జనవరి నెల నుండి రేషన్ కార్డు ఉన్న వాళ్లకు సన్నబియ్యం పంపిణీ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. జనవరి నుండి రేషన్ షాపుల ద్వారా ప్రస్తుతం ఉన్న విధానం మాదిరిగా ఒక్కొక్కర్కి ఆరు కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేస్తాము. మరోవైపు త్వరలోనే కొత్తగా జారీ చేసే డిజిటల్ కార్డుల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని పేర్కొన్నారు. […]Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఈరోజు శుక్రవారం నాంపల్లి కోర్టులో హాజరు కానున్నారు. ఇటీవల మంత్రి కొండా సురేఖ చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ పరువునష్ట దావా కేసు వేసిన సంగతి తెల్సిందే. దీనిపై నేడూ నాంపల్లి కోర్టు విచారణ చేయనున్నది. ఇందులో భాగంగా కేటీఆర్ జడ్జి ముందు తన వాంగ్మూలం ఇవ్వనున్నారు. మరోవైపు నటుడు అక్కినేని నాగార్జున కూడా కొండా సురేఖపై పరువు నష్ట దావా […]Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు గురువారం తెలంగాణ భవన్ లో జరిగిన బీఆర్ఎస్వీ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ ” ఇటీవల నేను ఢిల్లీ పర్యటనకు వెళ్లాను. ఆ పర్యటనలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేత.. మంత్రి నాకు ఒకరూ తారసపడ్డారు. నార్మల్ గా నేను కుశల ప్రశ్నలు అడిగాను.. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై అడిగాను. అందుకు ఊకో రామన్న .. మేము […]Read More
నా త్యాగంతోనే రేవంత్ కు సీఎం పదవి..?-మంత్రి సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత… మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సచివాలయంలో జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ ” హెలికాప్టర్ వినియోగంలో నేను సీఎం కన్నా తక్కువ ఏమి కాదు. నేను త్యాగం చేస్తేనే రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి వచ్చింది .. నాకే హెలికాప్టర్ లేదంటరా అని సదరు ఉన్నతాధికారులను ప్రశ్నించారు. అత్యవసర సమయాల్లో తప్పా మంత్రులు ఎవరూ హెలికాప్టర్లను వాడోద్దని ఉన్నతాధికారులు సూచించారు. […]Read More
తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. మంత్రిగా ఉంటూ చేస్తున్న వ్యాఖ్యలు…నిర్ణయాలు ముఖ్యమంత్రి రేవంత్ కు సమస్యలు తెచ్చి పెడుతోంది.సురేఖ శైలి ప్రతిపక్షాలకు అస్త్రంగా మారుతోంది. ఇప్పటికే నాగార్జున కుటుంబం పైన చేసిన వ్యాఖ్యలతో జాతీయ స్థాయిలో సురేఖ విమర్శలు ఎదుర్కొన్నారు. తాజాగా మంత్రిగా ఉండి పోలీసు స్టేషన్ కు వెళ్లి సీఐ సీట్లో కూర్చోవటం వివాదాస్పదంగా మారింది. సురేఖ వ్యవహారం పైన ఏఐసీసీ సైతం ఇప్పటికే రేవంత్ కు స్పష్టత ఇచ్చినట్లు […]Read More