తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ మరో వివాదంలో చిక్కుకున్నారు.. హనుమకొండ జిల్లాలో జరిగిన అంబేద్కర్ విగ్రహాం ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గోన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ కూడా పాల్గోన్నారు.. అయితే వేదికపై జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ మాట్లాడుతుండగా మధ్యలోనే మంత్రి రాజకీయాలు మాట్లాడకూడదని మైక్ ను లాక్కున్నారు. దీంతో తనకు మాట్లాడే హక్కులేదా.. ఒక ప్రజాప్రతినిధిగా నా హక్కులను మంత్రిగా ఉన్న పొన్నం […]Read More
Tags :minister of telangana
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.. ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం పర్యటనలో ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం చాలా మంది అనర్హులు ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారు.. ఇకపై అనర్హులను గుర్తించి వారందరికీ రేషన్ కార్డులు, ఆసరా పెన్షన్లు తొలగిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.Read More
తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం జిల్లా మణుగూరు మండలం బావి కూనవరం గ్రామానికి చెందిన పద్మ శ్రీ అవార్డు గ్రహీత సకిని రాంచంద్రయ్య కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో స్వగ్రామంలోనే ఆయన ప్రాణాలు వదిలినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కంచుమేళం- కంచుతాళం వాయిస్తూ ఆదివాసీ తెగల కథలకు ఆయన దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చారు. మేడారం జాతర ప్రధాన ఘట్టం చిలకలగుట్ట నుంచి సమ్మక్కను గద్దెలపైకి తీసుకువెళ్లే సమయంలోనూ రాంచంద్రయ్య కీలక పాత్ర పోషించేవారు. ఈ కథలు చెప్పే కళాకారుల్లో చిట్టచివరి […]Read More
తెలంగాణ ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు చెందిన హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ లీగల్ నోటీసులు పంపారు.. ఇటీవల తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఎన్టీపీసీ లో ప్లైయాష్ కుంభకోణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పాత్ర ఉంది.. కుంభకోణాలకు పెట్టిన పేరు మంత్రి పొన్నం..పార్టీ కాంగ్రెస్ అని ఆరోపించారు.. ఈవార్తలను వీడియోలను కొన్ని మీడియా సంస్థలు […]Read More
తెలంగాణ రాష్ట్రంలో ఈ సారి నెలరోజులపాటు బోనాల పండుగ నిర్వహించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అంతేకాకుండా బోనాల పండుగ సందర్భంగా ఆలయాలకు ఇచ్చే నిధులు పెంచనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. రాజధాని మహానగరం ‘హైదరాబాద్ పరిధిలో 2400కుపైగా ఆలయాలు ఉన్నాయి. వాటన్నింటికీ నిధుల సహాయం చేస్తాము. అలాగే 28 ప్రముఖ ఆలయాలకు స్థానిక ప్రజాప్రతినిధులే పట్టు వస్త్రాలు సమర్పిస్తారు’ అని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు.Read More
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం కొల్చారం మండలంలో రాష్ట్ర దేవాదాయ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ పర్యటనలో ప్రోటోకాల్ వివాదం చోటు చేసుకుంది. కొల్చారం మండల కేంద్రంలో నూతన ఎంపీడీవో కార్యాలయాన్ని గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి ఆవుల రాజి రెడ్డితో ప్రారంభం చేయించాలని చూసిన మంత్రి కొండా సురేఖ.. స్థానిక ఎమ్మెల్యే తాను ఉండగా ప్రోటోకాల్ పాటించలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అడ్డుపడ్డారు.Read More
తెలంగాణ రాష్ట్ర కొండా సురేఖ, నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత రెడ్డి మధ్య ప్రోటోకాల్ వివాదం చోటు చేసుకుంది. మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత రెడ్డి పాల్గోన్నారు.. అయితే ప్రోటోకాల్ విషయంలో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అనుచరుల మధ్య తీవ్ర తోపులాట జరిగింది.Read More
భూపాలపల్లి జిల్లా కాటారం సబ్ డివిజన్ పరిధిలోని కాళేశ్వరం పోలీస్ స్టేషన్ ఎస్సై భవాని సేన్ గౌడ్ తన ఇంటి దగ్గరలో ఉండే ఓ మహిళా కానిస్టేబుల్‌కు ఫోన్ చేసి “ఇంట్లో జారి పడి కాలు విరిగింది లేవలేకపోతున్నాను.. వచ్చి సాయం చేయమని” ప్రాధేయపడ్డాడు. ఇంటికి వచ్చిన ఆమెని సర్వీస్ రివాల్వర్ చూపించి బెదిరించి రేప్ చేశాడు. ఎవరికైనా చెప్తే ఇదే నీ చివరి రోజు అని బెదిరించాడు. రెండు రోజుల క్రితం ఆ మహిళా కానిస్టేబుల్ […]Read More
తాను ఓ రాష్ట్రానికి మంత్రి…నియోజకవర్గానికి ఓ ఎమ్మెల్యే అయిన కానీ తాను ఇంకా విద్యార్థినే అని అంటున్నారు మంత్రి అనసూయ దనసరి ఆలియాస్ సీతక్క. మహబూబాబాద్ జిల్లా కురవిలోని గిరిజన ఏకలవ్య గురుకులాన్ని ఆమె సందర్శించిన సందర్భంగా మాట్లాడుతూవ్యవస్థలో మార్పు కోసం గతంలో గన్ను పట్టి, తర్వాత సమాజ సేవ కోసం తిరిగి వచ్చానని మంత్రి సీతక్క చెప్పారు. తాను ప్రస్తుతం ఎల్ఎల్ఎం రెండో సంవత్సరం చదువుతున్నానని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య […]Read More
తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సచివాలయం లోని తన కార్యాలయంలో రాష్ట్రంలో బ్లడ్ బ్యాంకుల పనితీరు, నిర్వహణపై, బలోపేతంపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో మెరుగైన పనితీరును కలిగిన 14 బ్లడ్ బ్యాంకులను Components Upgrade చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం – వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న బ్లడ్ బ్యాంకుల (63) పనితీరు, నిర్వహణపై అధికారులను […]Read More
