క్రిస్మస్ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెదక్ కేథడ్రల్ చర్చిలో జరిగిన వేడుకలకు హాజరై ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 29 కోట్ల రూపాయల వ్యయంతో చర్చి వద్ద చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.మెదక్ చర్చి శతాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో హాజరైన ముఖ్యమంత్రి ఏసు భక్తులందరికీ క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. వందేళ్లు పూర్తి చేసుకున్న ఈ చర్చి ఒక గొప్ప దేవాలయంగా గుర్తింపు పొందిందని అన్నారు. […]Read More
Tags :medak
తెలంగాణ రాజధాని మహానగరం హైదరాబాద్ లోని అక్రమ కట్టడాలపై దూకుడు ను పెంచిన “హైడ్రా” రాజకీయ సామాన్యుల నుండి మద్ధతును చురగొంటుంది.. హైడ్రా కు మద్ధతుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మధ్ధతు తెలపగా తాజాగా తెలంగాణ బీజేపీ కి చెందిన ఎంపీ మద్ధతు తెలిపారు.. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ BJP Mp మాధవనేని రఘునందన్ రావు హైడ్రాకు మద్ధతుగా నిలిచారు.. ఆయన మీడియాతో మాట్లాడుతూ నగరంలో అక్రమణలను అరికట్టి ప్రభుత్వ భూములను పరిరక్షించడానికి తీసుకొచ్చిన హైడ్రా […]Read More
జన్వాడ ఫామ్ హౌస్ తనది కాదని తెలంగాణ మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పడంపై మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. ఆయన మాట్లాడుతూ ‘గతంలో జన్వాడ ఫామ్ హౌస్ పై డ్రోన్లు ఎగరవేశారని ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేసులు పెట్టారు. మరి ఫామ్ హౌస్ నీది కాదని అప్పుడే ఎందుకు చెప్పలేదు కేటీఆర్. ఇప్పుడెందుకీ సన్నాయి నొక్కులు?’ అని ఎంపీ రఘునందన్ ప్రశ్నించారు.Read More
మెదక్ జిల్లా రామాయంపేటలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో ఎలుకల స్వైర విహారం చేస్తున్నాయి. 9 వతరగతికి చెందిన 12 మంది విద్యార్థులను ఎలుకలు కరిచాయి… ఇద్దరు విద్యార్థినిలు అర్ధరాత్రి దాటాక ఉలిక్కిపడి లేచి చూడగానే కాళ్లు, పాదాలకు గాయాలై నెత్తురు కారుతుండటాన్ని చూసుకొని భయాందోళనలకు గురయ్యారు. ఎలుకలతో తాము ఇబ్బందిపడుతున్నామంటూ ఎన్నోసార్లు హాస్టల్స్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆస్పత్రికి చేరుకున్న విద్యార్థుల తల్లి దండ్రులు ఆందోళన చేశారు..Read More