ఏపీ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల కడప పార్లమెంట్ నుండి బరిలో దిగుతున్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో ఈరోజు వెలువడుతున్న ఎన్నికల ఫలితాల్లో కడప పార్లమెంట్ స్థానంలో వైసీపీ అభ్యర్థి అవినాశ్ రెడ్డి 22,674 ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయనకు 1,04,227 ఓట్లు పోలయ్యాయి. టీడీపీ అభ్యర్థి భూపేశ్ రెడ్డికి 81,553 ఓట్లు వచ్చాయి.. మరోవైపు షర్మిల కేవలం 14,532 ఓట్లతో డిపాజిట్ కోల్పోయే దిశగా సాగుతున్నారు.Read More
Tags :live updates of parliament elections results
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 17స్థానాల్లో జరిగిన లోక్ సభ ఎన్నికల ఫలితాలు ఈరోజు వెలువడుతున్నాయి.. ఇందులో భాగంగా మల్కాజిగిరి పార్లమెంట్ ఓట్ల మూడో రౌండ్ కౌంటింగ్ పూర్తయింది. భారత రాష్ట్ర సమితి పార్టీకి 79,756, భారతీయ జనతా పార్టీకి 2,50,252, కాంగ్రెస్ పార్టీకి 1,57,810 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 92,442 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. ప్రస్తుతం ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది.Read More
ఇటీవల తెలంగాణ వ్యాప్తంగా జరిగిన 17పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు ఈరోజు వెలువడుతున్నాయి..ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు బీజేపీ ఏడు స్థానాల్లో నిజామాబాద్ నుండి ధర్మపురి అర్వింద్,చేవెళ్ల నుండి విశ్వేశ్వర్ రెడ్డి, కరీంనగర్ నుండి బండి సంజయ్, మహబూబ్ నగర్ నుండి డీకే అరుణ), సికింద్రాబాద్ నుండి కిషన్ రెడ్డి,ఆదిలాబాద్ నుండి జి నగేశ్, మల్కాజిగిరి నుండి ఈటల ఆధిక్యంలో ఉన్నారు. కాంగ్రెస్ ఎనిమిది స్థానాల్లో జహీరాబాద్ నుండి షెట్కార్, మహబూబాబాద్ నుండి బలరాం నాయక్, వరంగల్ నుండికావ్య, […]Read More
తెలంగాణలో ఉన్న మొత్తం 17లోక్ సభ స్థానాలకు ఇటీవల పోలింగ్ జరిగిన సంగతి తెల్సిందే. ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలకు మొదలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుతో ప్రారంభమైన ఎన్నికల ఫలితాలు పోస్టల్ బ్యాలెట్ లో బీజేపీ ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో కరీంనగర్ పార్లమెంట్ నుండి బరిలోకి దిగిన బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్,ఆదిలాబాద్ నుండి బీజేపీ అభ్యర్థి నగేష్ ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తుందిన్Read More