Tags :kishan reddy

Andhra Pradesh Slider

కేంద్ర మంత్రి బీజేపీ వర్మ కీలక వ్యాఖ్యలు

కేంద్ర బొగ్గు భారీ పరిశ్రమల సహాయక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన భూపాతీరాజు శ్రీనివాస వర్మ తొలిసారిగా భీమవరం వచ్చారు. ఈసందర్బంగా అయన మీడియా తో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. నేను ఈ స్థాయికి రావడానికి కారణమైన ఏ ఒక్కర్ని మరిచిపోను. అందర్నీ గుర్తుపెట్టుకుంటాను. రాష్ట్ర దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పని చేస్తాను. నలభై ఏండ్లుగా ఎంతోమంది దగ్గర పని చేశాను. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తను అన్ని విధాలుగా ఆదుకుంటాను. కష్టపడే కార్యకర్తకు […]Read More

Slider Telangana

హైదరాబాద్‌లో బొగ్గు గనుల వేలం

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్‌లో తొలిసారిగా గనులు వేలం వేసేందుకు కేంద్ర గనుల శాఖ రెడీ అయింది. ఈనెల 21న బొగ్గు గనులు వేలం వేసేందుకు  సర్వం సిద్దం చేశారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. అయితే ఈ వేలానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను హాజరు కావాలని  కేంద్ర గనుల శాఖ కోరినట్లు సమాచారం..Read More

Andhra Pradesh Slider Telangana

తెలుగు ఎంపీలకు కేటాయించిన కేంద్రమంత్రుల శాఖలు ఇవే..

ఏపీ లో టీడీపీ నుండి గెలుపొందిన కింజరపు రామ్మోహన్ నాయుడు పౌర విమాన శాఖ మంత్రిత్వ శాఖను ఇవ్వగా..బీజేపీ నుండి నర్సాపురం నుండి గెలుపొందిన భూపతిరాజు శ్రీనివాసవర్మ కు ఉక్కు,భారీ పరిశ్రమల సహాయక శాఖ మంత్రి ఇచ్చారు. మరోవైపు తెలంగాణలో సికింద్రాబాద్ నుండి గెలుపొందిన కిషన్ రెడ్డి బొగ్గు గనుల శాఖ మంత్రిత్వ శాఖను కేటాయించగా..కరీంనగర్ నుండి గెలుపొందిన బండి సంజయ్ కు హోం సహాయక శాఖను కేటాయించారు..మరోవైపు చంద్రశేఖర్ కు ఐఎన్ పీఆర్  సహాయక శాఖ […]Read More

Andhra Pradesh Slider Videos

కేంద్రమంత్రిగా బీజేపీ వర్మ ప్రమాణ స్వీకారం

ఇటీవల విడుదలైన పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో ఏపీలోని నరసాపురం పార్లమెంట్ నుండి గెలుపొందిన బీజేపీ ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కేంద్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. దేశ రాజధాని మహానగరం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము భూపతిరాజు శ్రీనివాస వర్మతో ప్రమాణం చేయించారు. మరోవైపు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తొలిసారిగా ఎంపీగా గెలిచి మంత్రి పదవి దక్కించుకోవడం విశేషం.Read More

National Slider Telangana

కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కిషన్ రెడ్డి మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ “కేంద్రమంత్రి వర్గ కూర్పులో అన్ని రాష్ట్రాలకు సమన్యాయం చేశారు.. రాబోవు వందరోజుల ప్రణాళికల గురించి ప్రధానమంత్రి నరేందర్ మోదీ ఆలోచిస్తున్నారు. వచ్చే ఐదేండ్లలో పేదలకు మూడు కోట్ల ఇండ్లను నిర్మించి తీరుతాము. తెలంగాణలో సంస్థాగత మార్పులుంటాయి..బీజేపీ రాష్ట్ర అధ్యక్ష మార్పులుంటాయి..నన్ను కేంద్రమంత్రిగా నియమించిన ప్రధానమంత్రి నరేందర్ మోదీకి ధన్యవాదాలు” అని అన్నారు.Read More

Slider Telangana Videos

కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకారం

సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఎంపీగా రెండో సారి గెలుపొందిన గంగాపురం కిషన్ రెడ్డి మోదీ క్యాబినెట్ లో కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.Read More

National Slider Telangana

కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి,బండి సంజయ్ లకు మాజీ ఎంపీ వినోద్ కుమార్ శుభాకాంక్షలు

తెలంగాణ నుండి ప్రధానమంత్రి నరేందర్ మోదీ కేంద్రమంత్రివర్గంలో స్థానం దక్కించుకున్న కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకు బీఆర్ఎస్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు గంగపురం కిషన్ రెడ్డి గారు (సికింద్రాబాద్, MP) కేంద్ర మంత్రి, మరియు బండి సంజయ్ కుమార్ గారు (కరీంనగర్,MP) కేంద్ర సహాయమంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ గారు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా […]Read More

National Slider Telangana

ఈటలకు బంఫర్ ఆఫర్

తెలంగాణ రాష్ట్ర బీజేపీకి చెందిన మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు..మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు ఈరోజు కొలువుదీరుతున్న మోదీ కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కుతుందని అందరూ భావించారు. అయితే ఎవరూ ఊహించని విధంగా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి గెలుపొందిన జి కిషన్ రెడ్డి,కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి గెలుపొందిన బండి సంజయ్ లకు కేంద్ర మంత్రులుగా ఆ పార్టీ జాతీయ అధిష్టానం అవకాశం కల్పించింది. అయితే తాజాగా ఓ వార్త మీడియాలో చక్కర్లు కొడుతుంది. తెలంగాణ […]Read More

Slider Telangana

కేంద్ర మంత్రులుగా బండి సంజయ్,కిషన్ రెడ్డి

ఇటీవల విడుదలైన పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి కిషన్ రెడ్డి,కరీంనగర్ నుండి బండి సంజయ్ భారీ మెజార్టీతో గెలుపొందిన సంగతి తెల్సిందే. అయితే తాజాగా వీరిద్దరికి కేంద్ర క్యాబినెట్ లో బెర్తు దొరికింది. కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయాల్సిందిగా పీఎంఓ కార్యాలయం నుండి వీరికి ఫోన్ కాల్స్ వెళ్లాయి. దీంతో వీరిద్దరూ ప్రధానమంత్రి నరేందర్ మోదీ నివాసంకు బయలుదేరి వెళ్లారు.మరోవైపు ఏపీ నుండి టీడీపీకి ఇద్దరు కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు..Read More

Slider Telangana

మల్కాజిగిరిలో ఈటల చరిత్ర

తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 17స్థానాల్లో జరిగిన లోక్ సభ ఎన్నికల ఫలితాలు ఈరోజు వెలువడుతున్నాయి.. ఇందులో భాగంగా మల్కాజిగిరి పార్లమెంట్ ఓట్ల మూడో రౌండ్ కౌంటింగ్ పూర్తయింది. భారత రాష్ట్ర సమితి పార్టీకి 79,756, భారతీయ జనతా పార్టీకి 2,50,252, కాంగ్రెస్ పార్టీకి 1,57,810 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 92,442 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. ప్రస్తుతం ఎన్నికల కౌంటింగ్  ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది.Read More