ఏడు నెలల కాంగ్రెస్ హయాంలో గ్రామ పంచాయతీలు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయని, పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో పారిశుద్ధ్య నిర్వహణ సైతం కష్టంగా మారిందని మేం చెబుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఉలిక్కి పడుతున్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. మేం పదేపదే అబద్ధం చెబుతున్నామని మంత్రి సీతక్క అంటున్నారు..ఏది అబద్ధం అంటూ మాజీ మంత్రి హారీష్ రావు మంత్రి సీతక్కకు కౌంటర్ ఇస్తూ ప్రభుత్వం 9వ నెలలోకి అడుగుపెడుతున్నపటికీ గ్రామ పంచాయతీలకు 9 పైసలు కూడా చెల్లించలేదు అనేది […]Read More
Tags :KCR
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తన సోదరులకు చెందిన బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చడానికే అమెరికా పర్యటన చేస్తున్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ “ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరులు కొద్ది రోజుల క్రితం కొన్ని కొత్త కంపెనీలు ఓపెన్ చేసి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. అక్రమంగా సంపాదించిన డబ్బులు ఈ […]Read More
తెలంగాణలో బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్,కడియం శ్రీహారి,తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలని హైకోర్టులో బీఆర్ఎస్ పార్టీ పిటిషన్ వేసిన సంగతి తెల్సిందే. ఈ రోజు పిటిషన్ పై హైకోర్టు విచారణను నిర్వహించింది. ఇరువైపులా వాదనలను హైకోర్టు విన్నది. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు గురించి ఇన్ని రోజుల్లో చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ ను ఆదేశించలేము అని ఏజీ హైకోర్టుకు తెలిపారు. ఇప్పటికే ఈ పిటిషన్ పై వాదనలను […]Read More
తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవు… పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్తాం.పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత విషయంలో న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ మేరకు ఢిల్లీలోని పలువురు ప్రముఖ న్యాయ కోవిదులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకుల బృందం చర్చలు జరిపింది. అటు రాజ్యాంగ నిపుణులతోనూ ఈ రోజు పార్టీ ప్రతినిధి బృందం సమావేశమైంది. ఇప్పటికే పార్టీ ఫిరాయింపుల విషయంలో మణిపూర్‌కు సంబంధించి ఎమ్మెల్యే సహా […]Read More
BRS కు ప్రతీది బ్యాక్ ఫైర్ అవుతుందా..?-ఎడిటరియల్ కాలమ్.
తెలంగాణ రాష్ట్రం తెచ్చిన పార్టీ అంటే బీ(టీ)ఆర్ఎస్.. తెచ్చిన రాష్ట్రాన్ని పది ఏండ్లలోనే దేశానికి దిక్సూచిగా అన్ని రంగాల్లో అభివృద్ధిలో నెంబర్ వన్ చేసిన పార్టీ అంటే బీఆర్ఎస్.. సాగునీటి రంగం నుండి కరెంటు వరకు.. సంక్షేమం నుండి అభివృద్ధి వరకు ఇలా ఏ రంగం తీసుకున్న కానీ ప్రతి రంగంలో అభివృద్ధి అంటే ఇలా చేయాలని చేసి చూపించిన పార్టీ బీఆర్ఎస్. అంతటి మహోన్నత చరిత్ర ఉన్న బీఆర్ఎస్ ప్రతిపక్షంగా గత ఎనిమిది నెలలుగా ఏమి […]Read More
ఎమ్మెల్యే దానం నాగేందర్ నిండు శాసనసభలో వీధి రౌడీలా వ్యవహరించిన తీరు జుగుప్సాకరమని మాజి మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయ అవగాహన లేక వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారనీ,సభా మర్యాదలను, సభా గౌరవాన్ని కాంగ్రెస్ పార్టీ మంట గలిపిందనీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. యథా రాజా తథా ప్రజా అన్నట్టు ముఖ్యమంత్రి ప్రవర్తనకు ఏ మాత్రం తగ్గకుండా వారి ఎమ్మెల్యేలు ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు. నిన్న బిఆర్ఎస్ పార్టీ మహిళ శాసన […]Read More
తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ” సభలో మాజీ మంత్రి పటోళ్ళ సబితా ఇంద్రారెడ్డిని చూసి వణికిపోతున్న ఈ లిల్లిఫుట్స్ గాళ్లకు కేసీఆర్ అవసరమా..?. పట్టుమని పది నిమిషాలు సబితక్కను తట్టుకోలేని వీళ్ళు కేసీఆర్ గారు వస్తే తట్టుకుంటరా.?. దమ్ముంటే బీఆర్ఎస్ కు చెందిన మహిళ ఎమ్మెల్యేలకు సభలో మైకు ఇచ్చి చూడాలి […]Read More
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల అనంతరం మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. అందులో ముఖ్యమంత్రి మాట్లాడుతూ” నన్ను కాంగ్రెస్ పార్టీలోకి రమ్మన్నారు.. తీరా పార్టీలోకి చేరాక సబితక్క కేసీఆర్ మాయమాటలు నమ్మి పార్టీ మారారు. నాకు అక్క తోడుగా ఉండాలి కదా.. నేను సభలో అక్క అనే అన్నాను.. వేరే భాష ఏమి ప్రయోగించలేదు.. నేను ఎవరి పేర్లను ప్రస్తావించలేదు.. మరి వాళ్లకు ఉలుకు ఎందుకు.. ? సభలో మాజీ మంత్రి హారీష్ రావు కు […]Read More
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు చాలా గందరగోళంగా మారాయి.. సభలో మంత్రి సీతక్క వర్సెస్ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నట్లుగా మారాయి.. సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై మంత్రులు తీవ్ర స్థాయిలో అగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ ” తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ కాంగ్రెస్ కు చెందిన ఎమ్మెల్యేలను రాజీనామా చేయించకుండా తమ పార్టీలోకి చేర్చుకున్న సంగతి అందరికి తెలవదా..?. ఇప్పుడు మేము చేర్చుకుంటే అదేదో తప్పు అన్నట్లు […]Read More
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఈ రోజు ఉదయం డిప్యూటీ సీఎం.. ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు ద్రవ్య వినిమయ బిల్లును ఈ రోజు ఉదయం ప్రవేశపెట్టారు..ఈ బిల్లుపై చర్చలో భాగంగా మాజీ మంత్రి.. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడుతూ ” అధికారంలోకి వచ్చిన ముప్పై రోజుల్లోనే ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చామని కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నారు. తాము చేసిన పని గురించి చెప్పుకోవడంలో తప్పు లేదు కానీ మేము నోటిఫికేషన్లు […]Read More