Tags :KCR

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డి కంటే కేసీఆరే బెటర్..?

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం సాధించినదేమిటి? చేయలేకపోయినదేమిటి? ముఖ్యమంత్రి పనితీరు ఎలా ఉన్నది? వంటి పలు అంశాలపై వాయిస్‌ ఆఫ్‌ తెలంగాణ అండ్‌ ఆంధ్రా (వోటా) సంస్థ 2024 నవంబర్‌ 25 నుంచి డిసెంబర్‌ 4 వరకు తెలంగాణ వ్యాప్తంగా సర్వే చేసింది. సింపుల్‌ రాండమ్‌ విధానంలో చేసిన ఈ సర్వే కోసం 1677 శాంపిల్స్‌ సేకరించినట్టు వోటా సీఈవో కంబాలపల్లి కృష్ట మీడియాకు […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్ కు రంగం సిద్ధం..!

సోమవారం ఉదయం ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల మొదటి సెషన్ నుండి ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు చెందిన సభ్యులు నిరసనలు వ్యక్తం చేస్తున్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో ముందుగా లగచర్ల లో రైతులకు బేడీలు వేయడం దగ్గర నుండి బీఏసీలో మాట్లాడటానికి సమయం ఇవ్వకపోవడం వరకు తమదైన శైలీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసనలు వాకౌటులు చేస్తున్నారు. తాజాగా అసెంబ్లీలో అప్పులపై.. లగచర్లపై చర్చ చేపట్టాలని పట్టుబడుతూ అసెంబ్లీ ప్రాంగాణంలో నిరసనకు దిగారు. అంతేకాకుండా […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

దేవుళ్లపై ఒట్లు వేస్తేనే దిక్కు లేదు.?. సంక్రాంతికిస్తామంటే ఎలా నమ్ముతారు..?

తెలంగాణ శాసనసభలో పరిమితుల విధింపుపై మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్నేండ్లలో ఎప్పుడూ లేనివిధంగా మాజీ ఎమ్మెల్యేలను శాసనసభవైపునకు రాకుండా చేసిన తీరుపై మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యేలు వచ్చి మంత్రులు, ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఉండేదని ఆయన గుర్తుచేశారు. కానీ ఈ ప్రభుత్వం అసెంబ్లీలోకి ప్లకార్డులను సైతం తీసుకురాకుండా అడ్డుకుంటుందని మండిపడ్డారు. గతంలో ఇదే శాసన సభలోకి ఉరితాళ్లను, ఎండిన పంటలను, నూనె దీపాలు వంటి […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసనలు..!

సోమవారం ఉదయం ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో నిరసనలు చేపట్టారు. ఇటీవల కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలో గిరిజన రైతులకు భేడీలు వేయడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్రంగా ఖండిస్తూ అసెంబ్లీ ప్రాంగణంలో నిరసనలు చేపట్టారు. రైతులకు బేడీలు సిగ్గు సిగ్గు అంటూ నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసనలు చేస్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. రైతులపై ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ […]Read More

Sticky
Breaking News Editorial Slider Telangana Top News Of Today

కేసీఆర్‌ పదేండ్ల పాలనలో అసలు అప్పు  ఎంత..?

కేసీఆర్‌ 3.17 లక్షలకోట్ల అప్పు చేసి తెలంగాణను పునర్నిర్మించారన్నది వాస్తవం. జీఎస్డీపీలో దేశంలోనే అగ్రభాగాన నిలిపిందీ వాస్తవం. సంపద పెంచి ప్రజలకు పంచిందీ వాస్తవం. కాళేశ్వరం నుంచి యాదాద్రి దాకా.. సెక్రటేరియట్‌ నుంచి కలెక్టరేట్ల దాకా.. అడుగడుగునా రుణ సద్వినియోగం కనపడుతున్నది. 3 లక్షల కోట్లతో 30 లక్షల కోట్ల సంపదను సృష్టించి, అప్పును తెలంగాణ ఆస్తిగా మార్చిన కేసీఆర్‌ కౌశలం కండ్లకు కడుతున్నది.మరి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది. ఈ పన్నెండు నెలల్లో రేవంత్‌ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

KCR అధ్యక్షతన కీలక భేటీ..?

తెలంగాణ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ అధినేత..మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఇవాళ బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. గజ్వేల్ నియోజకవర్గంలోని  ఎర్రవల్లి నివాసంలో ఉదయం 10.30గంటలకు జరిగే ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. జాతీయ, రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలపైనా ఆయన సూచనలు చేస్తారని సమాచారం. అటు, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై మాజీమంత్రి హరీశ్ రావు ఈరోజు తెలంగాణ భవన్ లో  ఛార్జిషీట్ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

కేసీఆర్ కు ఆహ్వానం..!

  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీన జరిగే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారిని రాష్ట్ర బీసీ సంక్షేమం మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఆహ్వానించారు. ఇదే అంశంపై కేసీఆర్‌ను ఆహ్వానించడానికి ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి చేరుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ బృందానికి మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే జీవన్ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

కేసీఆర్‌.. కిష‌న్ రెడ్డి, బండి సంజ‌య్‌ల‌కు ఆహ్వానం…

డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన స‌చివాల‌యంలో డిసెంబ‌రు 9న తెలంగాణ త‌ల్లి విగ్ర‌హాన్ని ఆవిష్క‌రిస్తున్నామ‌ని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ సంద‌ర్భంగా 7, 8, 9 తేదీల్లో సచివాలయ ప్రాంగణం.. నెక్లెస్ రోడ్డు, ట్యాంక్ బండ్‌ ప‌రిస‌ర ప్రాంతాల్లో తెలంగాణ సంబరాలు అద్భుతంగా నిర్వ‌హించ‌నున్న‌ట్లు సీఎం చెప్పారు. తెలంగాణ  సంస్కృతికి ప‌ట్టం క‌ట్టే కార్య‌క్రమాలు, పిండి వంట‌లు, మ‌హిళా సంఘాల స్టాళ్ల‌తో ఒక పండ‌గ వాతావార‌ణం నెలకొంటుంద‌ని సీఎం చెప్పారు. బోనాలు, వినాయ‌క […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

పదేళ్ళ పాలనలో బిఆర్ఎస్ ప్రజలకు చేసింది శూన్యం

కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం విజయవంతంగా సంవత్సర పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజా పాలన విజయోత్సవాలను నిర్వహిస్తున్నట్లు మంత్రి సురేఖ తెలిపారు. ప్రజల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమానికి అహరహం శ్రమిస్తుంటే ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంత చేస్తూ ప్రజల ముందు మరింత చులకనవుతున్నాయని విమర్శించారు.  కేసీఆర్ ఫామ్ హౌస్ లో విశ్రాంతి తీసుకుంటూ కెటిఆర్ ను ప్రభుత్వం పైకి ఉసిగొల్పుతూ రాక్షసానందం పొందుతున్నాడని అన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని విమర్శిండమే ధ్యేయంగా అర్థంలేని ఆరోపణలు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

మీ తల్లి మీదే.!. మా తల్లి మాదే.! అని కాంగ్రెస్ చెబుతుందా..?

సమైక్య రాష్ట్రంలో తెలుగు మాట్లాడే ప్రజలందరికీ ఒకటే తల్లి ‘తెలుగు తల్లి’ ఉండేది. భాష ప్రాతిపదికన ఏర్పడిన రాష్ట్రంలో తెలుగువారందరూ ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ అని చాలా అభిమానంగా, గర్వంగా పాడుకునేవాళ్ళం.  ఆంధ్రా, తెలంగాణ విడిపోయిన తర్వాత కేసీఆర్‌ ‘మీ తల్లి మీదే.. మా తల్లి మాదే,’ అంటూ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తెలంగాణ ప్రజలు ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు కనుక తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు […]Read More