ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇటీవల అనారోగ్యానికి గురైన సంగతి తెల్సిందే. అయితే తాజాగా కవిత వైద్య పరీక్షలకు ట్రయల్ కోర్టు అనుమతి ఇచ్చింది. ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో కవిత వైద్య పరీక్షలకు అనుమతిచ్చింది. వైద్య పరీక్షలు అనంతరం నివేదికను తమకు సమర్పించాలని ఈ సందర్భంగా ఆదేశించింది. అయితే కవిత జ్యుడిషీయల్ కస్టడిని ఈ నెల ఇరవై రెండో తారీఖు వరకు విధించింది.Read More
Tags :kalvakuntla kavitha
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.. జ్వరం రావడంతో కవితను జైలు నుంచి దీన్‌దయాల్ ఆస్పత్రికి పోలీసు అధికారులు తరలించారు..ప్రస్తుతం కవితకు వైద్య బృందం సేవలను అందిస్తుంది..Read More
తెలంగాణలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఇప్పటివరకు ఎనిమిది స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న సంగతి తెల్సిందే. అయితే దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ బీజేపీ కలిసి వచ్చిందా? అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కవిత అరెస్టుతో బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒకటి కాదని సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయి. దీనికితోడు ప్రధానమంత్రి నరేందర్ మోదీ ప్రచారం ఆ పార్టీకి బూస్ట్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో […]Read More
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఊరట దక్కలేదు. ఈరోజు సోమవారం కోర్టుకు హాజరైన కవితను విచారించి ఈడీ, సీబీఐ కేసుల్లో ఆమెకు జులై 3 వరకు జుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలిచ్చింది. ఇవాల్టితో ఆమె కస్టడీ ముగియడంతో అధికారులు కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు తాజాగా నెల రోజుల కస్టడీ విధించడం గమనార్హం.Read More