కర్ణాటక ఉపఎన్నికలో కాంగ్రెస్ రెండు చోట్ల విజయం సాధించింది. శిగ్గావ్లో బీజేపీ అభ్యర్థి భరత్ బొమ్మైపై కాంగ్రెస్ అభ్యర్థి యాసిర్ పఠాన్ గెలుపొందారు. మరోవైపు సందూర్లో కాంగ్రెస్ క్యాండిడేట్ అన్నపూర్ణ ఘన విజయం సాధించారు. దీనిపై ఈసీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మొత్తం మూడుచోట్ల ఉపఎన్నిక జరగ్గా చన్నపట్నలోనూ కాంగ్రెస్ అభ్యర్థి యోగీశ్వర ముందంజలో ఉన్నారు.Read More
Tags :jds
ప్రధానమంత్రి నరేందర్ మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి షాకిచ్చారు కేంద్ర మంత్రి హెచ్ డీ కుమారస్వామి..కర్ణాటకలో బీజేపీ, జేడీఎస్ ల మధ్య విభేదాలు తాజాగా భగ్గుమన్నాయి. ముడా, వాల్మీకి స్కామ్లపై కాంగ్రెస్ సర్కార్కు వ్యతిరేకంగా బీజేపీ చేపట్టిన పాదయాత్రపై నీలినీడలు అలుముకున్నాయి.మాజీ పీఎం దేవెగౌడ కుటుంబాన్ని దెబ్బతీసేందుకు హసన్ మాజీ ఎమ్మెల్యే ప్రీతంప్రయత్నించిన సంగతి అందరికి తెల్సిందే.. అలాంటి ప్రీతం తో కల్సి మేం ఎలా వేదిక పంచుకుంటాం? అని కేంద్ర మంత్రి కుమారస్వామి ప్రశ్నించారు. […]Read More
పార్లమెంట్ సమావేశాల్లో విపక్షాలు బాధ్యతగా వ్యవహరించాలని 18వ లోక్ సభ తొలిరోజు సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి నరేందర్ మోదీ వ్యాఖ్యానించారు. సభలోని సభ్యులందరినీ కలుపుకొని ‘2047 వికసిత్ భారత్’ లక్ష్యం దిశగా సాగుతాము..దేశంలోని ప్రజలందరీ ఆకాంక్షను నెరవేర్చేందుకు విపక్షాలూ సహకరించాలని ఆయన కోరారు. దేశ చరిత్రలో ఎమర్జెన్సీ ఒక మచ్చ.. అటువంటి పొరపాటు పునరావృతం కాకూడదని ప్రధానమంత్రి నరేందర్ మోదీ అన్నారు. రాజ్యాంగానికి గౌరవం ఇచ్చి నిర్ణయాలు తీసుకుంటామని మోదీ పేర్కోన్నారు.Read More