Tags :good news

Slider Telangana Top News Of Today

అంగన్ వాడీలకు శుభవార్త

తెలంగాణ రాష్ట్రంలోని అంగన్ వాడీలకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్తను తెలిపింది… బడ్జెట్ సమావేశాల సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ” రిటైర్మెంట్ అయినాక అంగన్ వాడీలకు ఇచ్చే మొత్తాన్ని పెంచుతున్నట్లు ప్రకటించారు.. ఇప్పటివరకు అంగన్ వాడీ టీచర్లకు లక్ష రూపాయలు.. హెల్పర్లకు యాబై వేలు మాత్రమే ఇచ్చేవారు.. కానీ ఇక ముందు టీచర్లకు రెండు లక్షలు ఇస్తాము.. హెల్పర్లకు లక్ష రూపాయలు ఇస్తామని ” ప్రకటించారు.. దీని గురించి ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపాము.. ఒకటి రెండు […]Read More

Slider Telangana

రుణమాఫీ పై శుభవార్త

తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్తను తెలిపింది.. ఈనెల పద్దెనిమిది తారీఖు వరకు లక్ష వరకు ఉన్న రైతు రుణాలను మాఫీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు .ఈ రోజు సచివాలయంలో జరిగిన కలెక్టర్లతో సమావేశంలో ఆయన పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రుణమాఫీ కి రేషన్ కార్డు తప్పనిసరి కాదు అని తెలిపారు. పాస్ బుక్ ఆధారంగా రెండు లక్షల రుణాలను మాఫీ చేయనున్నామని తెలియజేశారు.ఆయితే ఆ నిధులను పక్కదారికి పోకుండా […]Read More

Jobs National Slider

నిరుద్యోగ యువతకు శుభవార్త

ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఇది నిజంగా శుభవార్తనే..రైల్వే శాఖలో అసిస్టెంట్ లోకో పైలట్ల పోస్టుల సంఖ్యను భారీగా పెంచుతున్నట్లు ఆర్ఆర్బీ ప్రకటించింది. ముందుగా మొత్తం 5,696 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది ఆర్ఆర్బీ..  తాజాగా 18,799 పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. అత్యధికంగా సౌత్ సెంట్రల్ రైల్వే (సికింద్రాబాద్)లో 1,364 పోస్టులు పెరిగాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే అప్లికేషన్ ప్రక్రియ పూర్తి అయింది.. అయితే జులై-ఆగస్టులో CBT-1 పరీక్ష ఉండనుంది. పూర్తి వివరాలకు https://www.rrbcdg.gov.in/ .Read More

National Slider

రైతుల ఖాతాల్లో డబ్బులు జమ

దేశ వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లో రైతుల సంక్షేమమే లక్ష్యంగా తీసుకొచ్చిన ‘పీఎం కిసాన్’  నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం  విడుదల చేశారు. ఏడాదిలో ప్రతి నాలుగు నెలలకు రూ.2 వేలు చొప్పున  రూ.6 వేలు జమ చేస్తున్న కేంద్ర సర్కారు ఈసారి 17వ విడత నిధుల్ని నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేసింది. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 9.26 కోట్ల రైతులకు రూ.2 వేలు చొప్పున రూ.20 వేల కోట్లకు పైగా […]Read More

Andhra Pradesh Slider Videos

మద్యం ప్రియులకు శుభవార్త

మద్యం ప్రియులకు ఇది నిజంగా శుభవార్తనే. ఏపీ రాష్ట్రానికి కింగ్ ఫిషర్ బీర్ల స్టాక్ తీసుకొచ్చి గోదాముల్లో నిల్వ ఉంచినట్లు తెలుస్తోంది. ఈమేరకు ప్రస్తుత అధికార పార్టీ టీడీపీకి చెందిన  సీనియర్ నేత ఆనం వెంకటరమణారెడ్డి ఓ వీడియో ట్వీట్ చేశారు. ‘ఇట్స్ బ్యాక్ ఆల్ ఓవర్ ఏపీ. కింగ్ ది ఫిషర్ చీర్స్’ అని రాసుకొచ్చారు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం నాణ్యతలేని మద్యం అమ్ముతోందని అప్పటి ప్రతిపక్ష టీడీపీ […]Read More

Slider Telangana

తెలంగాణ రైతాంగానికి శుభవార్త

తెలంగాణ రైతాంగానికి ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్తను తెలిపింది.ఇందులో భాగంగా రానున్న వానాకాలం సీజన్ నుంచే పంట సాగు చేస్తున్న రైతులకు ‘రైతు భరోసా’ అమలు చేస్తామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు తెలిపారు. జులైలో ఎకరానికి ₹7,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామన్నారు.అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న  రైతుల నుంచి అఫిడవిట్ తీసుకుంటేనే కౌలుదార్లకు భరోసా సాయం అందుతుందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ […]Read More

Slider Telangana

బీఈడీ, డీఈడీ విద్యార్థులకు శుభవార్త

తెలంగాణ రాష్ట్రంలో శిక్షణ పొందిన బీఈడీ, డీఈడీ విద్యార్థులకు శుభవార్త. డీఎస్సీకి అర్హత సాధించే విధంగా సాధ్యమైనంత తొందరగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌ను ఆదేశించింది. రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి గత నెల 29 వ తేదీన నోటిఫికేషన్‌ విడుదల చేసింది. డీఎస్సీ రాయడానికి టెట్‌ తప్పనిసరి కావడంతో మరోసారి పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాజా నిర్ణయంతో […]Read More

Slider Telangana

రేషన్ కార్డులున్న వారికి శుభవార్త

తెలంగాణ వ్యాప్తంగా రేషన్ కార్డులున్న వారికి ఇది ఖచ్చితంగా శుభవార్త. ఈరోజు సోమవారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా సరుకులు పంపిణీ చేయనున్నారు. అయితే గత నెలా తొలి వారం అఖరులో రెండో వారంలో రేషన్ షాపులు ప్రారంభమయ్యేవి. దీనిపై రేషన్ లబ్ధిదారుల నుండి వచ్చిన ఫిర్యాదులతో పౌరసరఫరాల శాఖ చర్యలు తీసుకుంది. అందులో భాగంగానే ఈరోజు నుండి బియ్యం ,గోధుమలు,చక్కెర పంపిణీకి తగిన ఏర్పాట్లు చేసింది.Read More