తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, మోడల్, కేజీబీవీ, గురుకులాలు, ఎయిడెడ్, గిరిజన స్కూళ్లలో చదివే 6, 7వ తరగతి బాలురకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి నిక్కర్లకు బదులుగా ప్యాంట్లు ఇవ్వాలని నిర్ణయించింది. 8, 9, 10 తరగతుల విద్యార్థులతోపాటు తమకూ ప్యాంట్లు కావాలని వారు కోరారు.. దీంతో వీరికి ఏటా 2 జతలు అందించాలని నిర్ణయించింది. దాదాపు 2 లక్షలమందికిపైగా విద్యార్థులకు ప్యాంట్తో కూడిన యూనిఫామ్ను అందించనుంది.Read More
Tags :good news
తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికీ వచ్చే ఏఫ్రిల్ మాసం నుండి ఆరు కిలోల సన్నబియ్యం అందిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలోని 84% మందికి ఈ బియ్యం సరఫరా చేస్తామని ఆయన తెలిపారు. ఈ నెల 30న హుజూర్ నగర్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. దొడ్డు బియ్యం ఇవ్వడం వల్ల పేదలు తినకుండా అమ్ముకుంటున్నారని పేర్కొన్నారు.ప్రాజెక్టుల కింద వరి సాగుకు నీరు అందించేందుకు […]Read More
తెలంగాణలోని మద్యం ప్రియులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ఓ శుభవార్తను తెలపనున్నది. అందులో భాగంగా రాష్ట్రంలో నూతన మద్యం బ్రాండ్ల దరఖాస్తులకు గడువు పెంచుతూ ఉత్తర్వులను జారీ చేసింది. అంతేకాకుండా తెలంగాణలో కొత్త మద్యం బ్రాండ్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి మద్యం, బీరు కంపెనీలు కొత్త ఉత్పత్తులను సప్లయి చేయడానికి మార్చి 15 వరకు ఎక్సైజ్ శాఖ గడువు ఇచ్చింది. ఇప్పటి వరకు టీజీబీసీఎల్‌కు కొత్త కంపెనీల నుంచి 39 దరఖాస్తులు వచ్చాయి.. ఏప్రిల్ […]Read More
గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు శుభవార్త..!
గల్ఫ్ లో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియా చెల్లించింది. 113 బాధిత కుటుంబాలకు వెంటనే నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామక్రిష్ణా రావును ఆదేశించినట్లు తెలంగాణ ఖనిజాభివృద్ది కార్పోరేషన్ చైర్మన్ అనిల్ ఈరవత్రి ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఖనిజాభివృద్ధి శాఖ సమీక్ష సందర్బంగా అనిల్ ఈరవత్రి గల్ఫ్ ఎక్స్ గ్రేషియా విషయాన్ని […]Read More
తెలంగాణ నుండి ఏపీకి..రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తమ సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం ఆర్టీసీ నిలయంలోని సంక్రాంతి పర్వదినం సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే వారి కోసం TGSRTC ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ నెల జనవరి 9 నుంచి జనవరి 15 వరకు ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు 6432 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. అందులో 557 సర్వీస్ లకు ముందస్తు రిజర్వేషన్లకు వీలు కల్పించింది. www.tgrtcbus.in వెబ్ […]Read More
ఏపీ ప్రజలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సకల తెలుగు ప్రజలందరూ సుఖసంతోషాలతో.. అష్ట ఐశ్వర్యాలతో కుటుంబ సభ్యులందరూ 2025 సంవత్సరం గడపాలని ఆయన కోరుకున్నారు. ఈక్రమంలో ఏపీ ప్రజలకు న్యూఇయర్ కానుకను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం గత ఆరు నెలలుగా ఇప్పటికే పలు సంక్షేమాభివృద్ధి పథకాలను అమలు చేశాము.. కొత్తవి చేస్తున్నాము. 2025 కొత్త ఏడాది కొత్త సంక్షేమ.. అభివృద్ధి […]Read More
తెలంగాణలోని రైతులకు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో శుభవార్తను తెలిపింది. ఈరోజు ఆదివారం మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుభరోసా పై కీలక ప్రకటన చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ” త్వరలోనే రైతుభరోసా పథకాన్ని అమలు చేస్తాము.. సంక్రాంతి పండుగ తర్వాత రైతుల ఖాతాల్లో ఆ పథకం డబ్బులు జమ అవుతాయని తెలిపారు. రైతుభరోసా విధివిధానాల గురించి రానున్న అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తామని ప్రకటించారు. బీఆర్ఎస్ నేతలు చేసే […]Read More
టెట్ అభ్యర్థులకు తెలంగాణ సర్కారు ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకున్నది. గత మేలో నిర్వహించిన టెట్‌కు దరఖాస్తు చేసుకున్నోళ్లందరూ వచ్చే జనవరిలో నిర్వహించనున్న టెట్ పరీక్షకు ఎలాంటి ఫీజు లేకుండానే ఫ్రీగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.మరోవైపు గత మేలో పెంచిన టెట్ ఫీజులను ఈసారి భారీగా తగ్గించింది. గతంలో ఒక పేపర్‌కు రూ.వెయ్యి, రెండు పేపర్లు రాస్తే రూ.2 వేల ఫీజు ఉండగా.. ప్రస్తుతం దాన్ని ఒక పేపర్‌కు రూ.750, రెండు పేపర్లు రాస్తే రూ.వెయ్యిగా […]Read More
ఏపీలో పెన్షన్లు తీసుకునే లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది..ఇందులో భాగంగా పెన్షన్ మొత్తాన్ని 3 నెలలకోసారి తీసుకోవచ్చని సీఎం చంద్రబాబు వెల్లడించారు. అయితే పెన్షన్ ఎవరు ఆపినా నిలదీయాలని లబ్ధిదారులకు పిలుపునిచ్చారు. పెన్షన్ తీసుకోవడం ప్రజల హక్కని, పింఛను డబ్బును ఇంటి వద్దే గౌరవంగా ఇస్తాము.. ఇందుకు తగ్గట్లు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. 64 లక్షల మందికి ప్రభుత్వం పెన్షన్లు అందిస్తోందని శ్రీకాకుళం పర్యటనలో ఆయన వివరించారు.Read More
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ రోజు శనివారం సచివాలయంలో క్యాబినెట్ సమావేశమయింది.. దాదాపు నాలుగు గంటల పాటు జరిగిన సుధీర్ఘ భేటీలో పలు కీలక నిర్ణయాలను తీసుకుంది.. ఈ నిర్ణయాల్లో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులకు తక్షణమే ఒక డీఏ విడుదలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మరోవైపు దీపావళి పండుగకు కానుకగా ఇందిరమ్మ ఇండ్లను నిర్మించాలని నిర్ణయం తీసుకుంది.. ప్రతి నియోజకవర్గానికి 3500ఇందిరమ్మ ఇండ్లను నిర్మించనున్నది..సన్న వడ్లకు రూ.500బోనస్ ఇవ్వాలని నిర్ణయం..నవంబర్ ముప్పై తారీఖులోపు కులగణనను […]Read More