తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాలు, గురుకుల విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్ధినీ విద్యార్థులను సొంత బిడ్డల్లా చూడాలని, వారికి పరిశుభ్రమైన వాతావరణంలో పౌష్టికాహారం అందించే విషయంలో ఎటువంటి అలక్ష్యానికి తావు ఇయ్యరాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లకు సూచించారు. బడి పిల్లలకు అందించే ఆహారానికి సంబంధించి ఘటనలు పునరావృతం కావడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో ఉదాసీనంగా వ్యవహరించే అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిర్లక్ష్యంగా […]Read More
Tags :food poision
మహబూబ్ నగర్ జిల్లా మాగనూర్ జడ్పీ హైస్కూల్‌లో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనపై హైకోర్టు సీరియస్ గా స్పందించింది. సర్కారు బడుల్లో పిల్లలు చనిపోతే కాని.. స్పందించరా.? అంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారుల నిర్లక్ష్యానికి ఇది నిదర్శనం.. అధికారులు ప్రభుత్వం ఎలా పని చేస్తుందో ఇది తెలియజేస్తుంది. ఉన్నతాధికారుల నుండి ఆదేశాలు ఇస్తేనే అధికారులు పనిచేస్తారా అని హైకోర్టు ప్రశ్నించింది.వారంలో మూడుసార్లు ఫుడ్ పాయిజనింగ్ జరిగితే అధికారులు ఏం చేస్తున్నారని నిలదీసింది. ప్రభుత్వం ఈ అంశాన్ని […]Read More
తెలంగాణ రాష్ట్రంలోని కొమురం భీమ్ జిల్లా వాంకిడి గిరిజన గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు గురై దాదాపు అరవై మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థత పాలైన సంగతి తెల్సిందే. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, కొండా సురేఖ నిన్న మంగళవారం నిమ్స్ ఆసుపత్రికెళ్లి పరామర్శించారు. అనంతరం వారికి అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. మెరుగైన వైద్య సేవలను […]Read More