తెలంగాణ రాష్ట్రంలో అర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డిపై హైదరాబాద్ లో కేసు నమోదైంది. ఈ నెల పద్నాలుగో తారీఖున ముత్యాలమ్మ ఆలయం వద్ద ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పోలీసు సిబ్బందిని కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారు. దీంతో పోలీసులు సుమోట్ గా కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే తో పాటు మతపరమైన ద్వేషపూరితమైన కంటెంట్ ను వ్యాప్తి చేసిన రైట్ వింగ్ సోషల్ మీడియా నిర్వాహకులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.Read More
Tags :fir
సహచర కోరియోగ్రాఫర్ పై అత్యాచార… లైంగిక వేధింపుల కేసులో పోలీసుల కస్టడీలో ఉన్న ప్రముఖ కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పలు కీలక విషయాలను వెల్లడించినట్లు తెలుస్తుంది. నేను ఎలాంటి తప్పు చేయలేదు.. మైనర్ గా ఉన్నసమయంలోనే తనపై లైంగిక అత్యాచారం చేశారనడంలో ఎలాంటి నిజం లేదు.. తనే నన్ను పెళ్ళి చేసుకోవాలని బెదిరింపులకు దిగింది. యువతి ఆరోపిస్తున్న ఆరోపణలన్నీ వాస్తవదూరమైనవి.. తనపై కావాలనే కుట్రలు చేశారని పోలీసు విచారణలో జానీ మాస్టర్ వెల్లడించినట్లు తెలుస్తుంది.Read More
గాంధీపై హత్యయత్నంతో పాటు 11 సెక్షన్ల కింద కేసు నమోదు
శేరిలింగంపల్లి శాసన సభ్యులు.. పీఏసీ చైర్మన్ అరికెలపూడి గాంధీపై పోలీసులు హత్యాయత్నం కేసును నమోదు చేశారు. తనను హతమార్చేందుకు ప్రయత్నించారు. తన అనుచరులతో కల్సి తన ఇంటిపై.. నాపై దాడి చేశారు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గచ్చిబౌలి పీఎస్ లో పిర్యాదు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి ఇచ్చిన పిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎమ్మెల్యేతో పాటు అతని అనుచరులు ఆయన సోదరుడు సురేష్ బాబు, కుమారుడు పృథ్వీ, మియాపూర్ , […]Read More
ఏపీ మాజీ మంత్రి..వైసీపీ సీనియర్ నేత కొడాలి నానికి బిగ్ షాక్ తగిలింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు వాలంటీర్లను బలవంతంగా బెదిరించి రాజీనామా చేయించారని మాజీ మంత్రి కొడాలి నానిపై పోలీసులకు పిర్యాదు చేశారు వాలంటీర్లు. ఎన్నికల సమయంలో తమను వేధించి బలవంతంగా రాజీనామాలు చేయించారంటూ మాజీ వాలంటీర్లు ఫిర్యాదు చేయడంతో మాజీ మంత్రి కొడాలి నానితో పాటు ఆయన సన్నిహితుడు దుక్కిపాటి శశిభూషణ్, గుడివాడ పట్టణ వైసీపీ అధ్యక్షుడు గొర్ల శ్రీను మరో ఇద్దరు నేతలపై […]Read More
తెలంగాణ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చెందిన ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై కేసు నమోదైంది. చేవేళ్లలో తనకు సంబంధించిన ఓ స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కబ్జా చేసినట్లు స్థానిక పీఎస్ లో దామోదర్ రెడ్డి అనే వ్యక్తి ఇచ్చిన పిర్యాదు మేరకు జీవన్ రెడ్డి,ఆయన కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు.Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి…. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై వరంగల్ జిల్లాలో హనుమకొండలో పిర్యాదు నమోదైంది. ముఖ్యమంత్రి… టీపీసీసీ అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డి గురించి మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడూతూ” ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి రూ.2500కోట్లు కాంట్రాక్టర్ల దగ్గర నుండి వసూలు చేసి ఢిల్లీకి పంపారు అని ” అసత్య ప్రచారం చేశారు. ఆ వ్యాఖ్యలు ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్తాయని మాజీమంత్రి కేటీఆర్ పై తగిన చర్యలు తీసుకోవాలని హనుమకొండ […]Read More