Tags :farmers

Slider Telangana Top News Of Today

మంత్రి తుమ్మలకు షాక్

రైతు భరోసా పథకం పై అభిప్రాయ సేకరణ పేరిట తెలంగాణలోని అన్ని జిల్లాల నుండి రైతులతో వీడియో కాన్ఫరెన్స్ లో ఈరోజు మంగళవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, కిసాన్ కాంగ్రెస్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ కోదండ రెడ్డి, చిన్నారెడ్డి లు ఈ రోజు మాట్లాడారు. మొదటగా గతంలో తుమ్మల ప్రాతినిధ్యం వహించిన పాలేరు నుండి రైతులు మాట్లాడుతూ అయితే 5 ఎకరాల వరకే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం తీసుకోనున్న నిర్ణయాన్ని  […]Read More

Andhra Pradesh Sports Top News Of Today

కేసులన్నీ ఎత్తివేస్తాం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి కి చెందిన  రైతులపై గత వైసీపీ ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసులు ఎత్తివేయాలని హోం మంత్రి అనితకు రాజధాని ప్రాంత మహిళలు విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వ నిరంకుశతత్వానికి వ్యతిరేకంగా రాజధాని కోసం చేసిన ఉద్యమంలో తమపై అక్రమ కేసులు బనాయించారని మహిళలు ఈ సందర్భంగా దుయ్యబట్టారు. రైతులంతా ఐదేండ్లు ఓ నేరస్థుల్లా ప్రతినెలా కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోందని వారు  ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ కేసులన్నింటిపై సమీక్షిస్తామని తెలిపిన […]Read More

National Slider

రైతుల ఖాతాల్లో డబ్బులు జమ

దేశ వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లో రైతుల సంక్షేమమే లక్ష్యంగా తీసుకొచ్చిన ‘పీఎం కిసాన్’  నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం  విడుదల చేశారు. ఏడాదిలో ప్రతి నాలుగు నెలలకు రూ.2 వేలు చొప్పున  రూ.6 వేలు జమ చేస్తున్న కేంద్ర సర్కారు ఈసారి 17వ విడత నిధుల్ని నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేసింది. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 9.26 కోట్ల రైతులకు రూ.2 వేలు చొప్పున రూ.20 వేల కోట్లకు పైగా […]Read More

Slider Telangana Videos

మంత్రి ఇలాఖాలో రైతు ఇక్కట్లు

తెలంగాణ రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సొంత అసెంబ్లీ నియోజకవర్గమైన మంథని నియోజకవర్గం మల్హర్రావు మండలం ఎడ్లపల్లి గ్రామంలో నెలన్నర రోజులు అయినా ప్రభుత్వం వడ్లు కొనట్లెదని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఆ వీడియోలో రైతులు మాట్లాడుతూ మళ్ళీ పంటలు వేసుకునే కాలం వచ్చింది.. ప్రభుత్వం ఇంకా వడ్లు కొనలేదు.. ఈ పంట డబ్బులు ఎప్పుడు రావాలి, మేము ఎలా పెట్టుబడి పెట్టి పంట వేసుకోవాలని బాధలు […]Read More

Slider Telangana

ఆదిలాబాద్ జిల్లాలో అటవీ అధికారులకు, రైతులకు మధ్య ఘర్షణ-వీడియో

తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం దానపూర్ గ్రామంలో దశాబ్దాలుగా సాగు చేస్తున్న భూమిని అటవీ అధికారులు ఆక్రమించుకుంటున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. భూమిని ఆక్రమించుకోవడానికి గ్రామంలోకి వచ్చిన అధికారులకు, రైతులకు మధ్య ఘర్షణ జరిగింది.. తాము సాగు చేసుకుంటున్న భూమిని అధికారులు లాక్కుంటున్నారు. తమకు న్యాయం చేయాలని రైతులు రహదారిపై నిరసన వ్యక్తం చేశారు.Read More

Slider Telangana

తెలంగాణ రైతాంగానికి శుభవార్త

తెలంగాణ రైతాంగానికి ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్తను తెలిపింది.ఇందులో భాగంగా రానున్న వానాకాలం సీజన్ నుంచే పంట సాగు చేస్తున్న రైతులకు ‘రైతు భరోసా’ అమలు చేస్తామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు తెలిపారు. జులైలో ఎకరానికి ₹7,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామన్నారు.అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న  రైతుల నుంచి అఫిడవిట్ తీసుకుంటేనే కౌలుదార్లకు భరోసా సాయం అందుతుందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ […]Read More

Slider Telangana

రూ.500లు బోనస్ ఇవ్వాల్సిందే

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు నల్లగొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు..ఈ పర్యటనలో భాగంగా మాజీ మంత్రి హారీష్ రావు ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం తల్లాడ మండలం నూతన్ కల్ గ్రామంలో క్రాప్ హాలిడే ప్రకటించిన రైతులను కలిశారు.మాజీ మంత్రి హారీష్ రావు తోపంటకు సరిపడా సాగునీరు విద్యుత్ సరఫరా లేకపోవడంతో పంట విరామం ప్రకటించినట్లు ఆవేదన వ్యక్తం చేసిన […]Read More

Slider Telangana

కాంగ్రెస్ బోనస్ పెద్ద బోగస్.

తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో ఎన్నికల హామీని తుంగలో తొక్కింది. నిరుద్యోగులకు నెలకు 4,000 రూపాయల భృతి ఇస్తామని హామీ ఇచ్చి, మేమా మాట అనలేదని అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, నేడు వడ్లకు బోనస్ ఇచ్చే విషయంలో కూడా పచ్చి అబద్ధం ఆడి, రైతులను మోసం చేశారు. రైతులు పండించిన వరి పంటకు క్వింటాకు రూ.500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల్లో భాగంగా హామీ ఇచ్చింది. […]Read More

Slider Telangana

తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ సర్కారు బ్యాడ్ న్యూస్

తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర రైతాంగానికి బ్యాడ్ న్యూస్ చెప్పింది.. ఈ రోజు సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ మీటింగ్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా రైతన్నలు పండించే సన్నవడ్లకు మాత్రమే ఐదువందల రూపాయలు బోనస్ ఇవ్వాలని నిర్ణయించింది. మంత్రి పొంగులేటి  మాటల్లో మీరే వినండి.Read More

Slider Telangana

కాంగ్రెస్ పాలనపై రైతన్నలు కన్నెర్ర

తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రైతులకు మద్దతుగా గురువారం బీఆర్‌ఎస్‌ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలపాలని ఆ పార్టీ శ్రేణులకు అధినేత కేసీఆర్‌ పిలుపునిచ్చిన సంగతి తెల్సిందే… వ్యవసాయానికి కరెంటు, నీళ్లు ఇవ్వకుండా అన్నదాతను ఏడిపించిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పుడు పండించిన వడ్లు కొనకుండా గోస పెడుతున్నది. కొనుగోలు కేంద్రాల్లో వడ్ల బస్తాలు పేరుకుపోయి, వానకు తడుస్తుంటే పట్టించుకోని సర్కారు తీరు చూసి గుండెమండిన అన్నదాతలు బుధవారం రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. ధాన్యం కొనాలంటూ రాష్ట్రవ్యాప్తంగా రైతులు నిరసనలకు దిగారు. […]Read More