అధికారం ఎవరికి శాశ్వతం కాదు. పదేండ్లు మేము అధికారంలో ఉన్నాము.. ఈ ఐదేళ్ళు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని మాజీ మంత్రి .. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సంగారెడ్డి జైల్లో ఉన్న లగచర్ల రైతులను పరామర్శించిన మాజీ మంత్రి కేటీఆర్ అనంతరం మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ ” రేవంత్ రెడ్డి అధికారం కేవలం ఐదేళ్ళే.. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. లగచర్ల ఘటనలో అన్ని పార్టీల వాళ్లున్నారు. […]Read More
Tags :farmers
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది ధాన్యం కొనుగోళ్ళు మరి తక్కువయ్యాయి. ఈ ఖరీఫ్ సీజన్ లో రైతులు పండించిన ధాన్యాన్ని సీఎంఆర్ కింద మిల్లింగ్ చేసేందుకు రైస్ మిల్లర్లు అనాసక్తిని చూపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత నెల ఇరవై తొమ్మిదో తారీఖున ప్రకటించిన ఖరీఫ్ ధాన్యం సేకరణ పాలసీ తమకు నష్టాలను చూపిస్తుందని మిల్లర్ల అసోషియేషన్ చెబుతుంది. కొనుగోలు కేంద్రాల నుండి వస్తున్న ధాన్యాన్ని తీసుకోవడానికి మిల్లర్లు ఆసక్తి చూపకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ళు […]Read More
తెలంగాణ రైతాంగానికి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మరో శుభవార్తను తెలిపారు. ఈరోజు గురువారం గోల్కోండ కోటలో జరిగిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గోన్నారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ” కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం.. ప్రజల చేత.. ప్రజల కోరకు ఏర్పాటైన ప్రభుత్వం.. గత ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హమీని నెరవేరుస్తాము.. ఆరు గ్యారంటీలను అమలు జేసి తీరుతాము. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన కానీ రైతాంగం […]Read More
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న రైతు రుణమాఫీ కాని రైతులకు మరో శుభవార్తని తెలిపారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ “ఎన్నికష్టాలున్నా రైతు రుణమాఫీ చేస్తున్నామని తెలిపారు. ‘ఇప్పటికే 2 విడతలు అమలు చేశాము..ఈ నెల 15న రెండు లక్షల వరకు రుణమాఫీ కార్యక్రమాన్ని వైరాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తారు. పాస్ బుక్ లేకపోయినా తెల్లకార్డు ద్వారా మాఫీ చేస్తున్నాము […]Read More
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల లక్షన్నర లోపు ఉన్న రైతు రుణాలను మాఫీ చేసిన సంగతి తెల్సిందే.. ఇప్పటివరకు మొత్తం పన్నెండు వేల కోట్ల రూపాయలను రుణమాఫీ చేసినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతుంది.. తాజాగా డిప్యూటీ ముఖ్యమంత్రి.. ఆర్ధిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క రుణమాఫీ అయిన రైతులకు మరో శుభవార్తను తెలిపారు.. ఖమ్మం మధిర నియోజకవర్గంలో పర్యటించిన ఉప ముఖ్యమంత్రి భట్టి పలు సంక్షేమ కార్యక్రమాల ప్రారంభోత్సవ శంకుస్థాపనల్లో […]Read More
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ భూముల్లో సాగు చేస్కుంటున్నా రైతులకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్తను తెలిపింది.. రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ భూముల్లో సాగు చేసుకుంటున్న రైతులకు రాబోయే రెండు నెలల్లోనే పట్టాలను అందజేయాలనీ సంబంధిత అధికారులను తక్షణమే ఆదేశిస్తున్నట్లు తెలిపారు. ఆయా భూములపై అధికారులు సర్వే చేసి రైతులకు పట్టాలను ఇవ్వాలని ఆయన కోరారు.. మొదటి విడతగా […]Read More
వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మరో చట్టాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రద్ధు చేసింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కౌలు రైతు చట్టాన్ని రద్ధు చేయనున్నట్లు టీడీపీ సీనియర్ నేత.. మంత్రి కింజరాపు అచ్చెన్నయుడు ప్రకటించారు.. కౌలు రైతులకు మేలు చేసేలా త్వరలోనే మరో కొత్త చట్టాన్ని తీసుకొస్తామని వారు తెలిపారు.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సహకార సంఘాల్లో కౌలు రైతులను సభ్యులుగా […]Read More
ఏపీలో రైతాంగానికి పగటిపూటే 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈరోజు శుక్రవారం వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు రాష్ట్ర విద్యుత్ శాఖపై సమీక్షించారు. రాష్ట్రంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి అధిక ప్రాధాన్యతను ఇవ్వాలని అధికారులకు ఈ సమావేశంలో సీఎం సూచించారు.Read More
తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్తను తెలిపింది.. ఈనెల పద్దెనిమిది తారీఖు వరకు లక్ష వరకు ఉన్న రైతు రుణాలను మాఫీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు .ఈ రోజు సచివాలయంలో జరిగిన కలెక్టర్లతో సమావేశంలో ఆయన పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రుణమాఫీ కి రేషన్ కార్డు తప్పనిసరి కాదు అని తెలిపారు. పాస్ బుక్ ఆధారంగా రెండు లక్షల రుణాలను మాఫీ చేయనున్నామని తెలియజేశారు.ఆయితే ఆ నిధులను పక్కదారికి పోకుండా […]Read More
ఖమ్మం జిల్లాలో ఖరీఫ్ సాగు సమయం వచ్చినప్పటికీ విత్తనాలు అందుబాటులో లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతీ ఏడాది ఖరీఫ్ సాగు ప్రారంభానికి ముందే వ్యవసాయశాఖ ద్వారా ప్రభుత్వం రైతులకు విత్తనాలను పంపిణీ చేసేది. కాగా ఈ ఏడాది రైతులు సాగుకు శ్రీకారం చుట్టి నెలరోజులు కావస్తున్నా ఇప్పటి వరకు విత్తనాలు పంపిణీ చేయకపోవడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.Read More