ఏపీలో మహిళలపై పెరుగుతున్న దాడులను అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారనే ప్రశ్నకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర సమాధానమిచ్చారు. మన కళ్ల ముందు ఏదైనా ఘటన జరుగుతున్నప్పుడు స్పందించాల్సిందిపోయి వీడియోలు తీయడం సమంజసం కాదని అన్నారు. పోలీసులు వచ్చే లోపు బాధితులకు సాయం చేయాలనే కనీస స్పృహ ఉండాలని హితవు పలికారు. ఈ వీడియోను ఆయన ఫ్యాన్స్ షేర్ చేస్తూ నాయకుడంటే ఇలానే ఉండాలని ప్రశంసిస్తున్నారు.Read More
Tags :Deputy CM Pawan Kalyan
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వైసీపీ శ్రేణులను అక్రమంగా నిర్బంధిస్తే వదిలేది లేదన్న వైసీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి పరోక్షంగా స్పందించారు. రాష్ట్రంలో ఐపీఎస్, ఐఏఎస్ లకు వార్నింగ్ ఇస్తే సుమోటోగా కేసులు పెడతామని ఆయన జగన్ ను హెచ్చరించారు. అధికారులపై చిన్నగాటు పడినా ఊరుకునేది లేదు .. తమది మంచి ప్రభుత్వమే కానీ మెతక ప్రభుత్వం కాదని స్పష్టం చేశారు. […]Read More
డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిని మెచ్చుకున్నారు. గత ఐదేండ్ల వైసీపీ ప్రభుత్వ పాలనపై ప్రశంసల వర్షం కురిపించారు అని వైసీపీ పార్టీ తమ అధికారక ట్విట్టర్ హ్యాండిల్ లో ఓ వీడియోను పోస్టు చేసింది. ఓ ప్రభుత్వ స్కూల్ ను సందర్శించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ” కార్పోరేట్ స్కూళ్ల కంటే ప్రభుత్వ స్కూళ్లు ఇప్పుడు బాగున్నాయి. ఈ బల్లాలు బాగున్నాయి. […]Read More
ఏపీ అధికార పార్టీ లైన టీడీపీ జనసేన కూటమిలో లకలుకలు మరోసారి బయటపడ్డాయి. రాష్ట్రంలో ఏలూరు జిల్లాలో టీడీపీ, జనసేన శ్రేణులు ఘోరంగా కొట్టుకున్నాయి. దెందులూరు నియోజకవర్గంలోని పైడిచింతపాడులో ఇరు వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ క్రమంలో పెన్షన్ల పంపిణీ విషయమై టీడీపీ, జనసేన శ్రేణుల మధ్య వివాదం చెలరేగింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.Read More
ఏపీ మాజీ మంత్రి..వైసీపీ సీనియర్ మహిళ నాయకురాలు ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు .. బద్వేల్ ఉన్మాది దాడిలో చనిపోయిన యువతి తల్లి మీడియాతో మాట్లాడుతూ ఆవేదన చెందిన వీడియోని మాజీ మంత్రి ఆర్కే రోజా తన ట్విట్టర్ అకౌంట్లో పోస్టు చేశారు.. రోధిస్తున్న కన్నతల్లి గర్భశోకం మీకు విన్పిస్తుందా చంద్రబాబు..అనిత.. పవన్ కళ్యాణ్ అని ప్రశ్నించారు.. వరుస మానభంగాలు..హత్యలు.. మహిళలపై దాడులతో ఆంధ్రప్రదేశ్ ను అత్యాచారాంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మార్చారని సంచలన వ్యాఖ్యలు చేశారుRead More
ప్రముఖ విలక్షణ నటుడు.. సీనియర్ నటుడు… ఏడు జాతీయ అవార్డుల గ్రహీత అయిన ప్రకాష్ రాజ్ ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఉద్ధేశించి మరోసారి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. తన అధికారక ట్విట్టర్ అకౌంటులో ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ ను ఉద్ధేశిస్తూ ” పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో ఫుట్ బాల్ లాంటోడు.. రాజకీయం అనే ఆటలో ఆ ఫుట్ బాల్ ను ఎవరైన ఉపయోగించుకోవచ్చు.. మనకు కరీ బాగుండటానికి […]Read More
డిప్యూటీ సీఎం.. జనసేనాని పవన్ కళ్యాణ్ తిరుమల తిరుపతి పర్యటన సాక్షిగా టీడీపీ జనసేనల మధ్య ఉన్న విబేధాలు మళ్ళోక్కసారి బయటపడినట్లు తెలుస్తుంది. తిరుమలకు వస్తాను.. అక్కడ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తానను రెండు రోజులకు ముందే జనసేనాని ప్రకటించాడు. అయిన కానీ తిరుపతి నియోజకవర్గ టీడీపీ శ్రేణులు తమకు సంబంధం లేదన్నట్లే అంటిముట్టని విధంగా ఉన్నారు. మొన్న సోమవారం సాయంత్రం తిరుమలకు చేరుకున్న పవన్ కళ్యాణ్ కు స్థానిక జనసేన ఎమ్మెల్యే అరణి శ్రీనివాసుల […]Read More
ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేనాని పవన్ కళ్యాణ్ కు విలక్షణ నటుడు.. ఏడు జాతీయ అవార్డుల గ్రహీత ప్రకాష్ రాజ్ మరోసారి కౌంటరిచ్చారు.. ఇప్పటికే పవన్ కళ్యాణ్ నిర్వహించిన మీడియా సమావేశంలో ఇండియాకు వచ్చిన తర్వాత ప్రతి లైన్ కు సమాధానం చెప్తాను.. అప్పటివరకు నేను చేసిన ట్వీట్ ఆర్ధం చేస్కోమని సలహా ఇస్తూ ఓ వీడియో విడుదల చేశారు ప్రకాష్ రాజ్..లడ్డూ వివాదంలో హీరో కార్తీ పవన్ కళ్యాణ్ సూచనలకు స్పందించి సారీ చెప్పారు. దీనిగురించి […]Read More
ఎదురుమొండి – గొల్లమంద రహదారి నిర్మాణానికి రూ.13.45 కోట్లు
ఏపీ లో కృష్ణా జిల్లా నాగాయలంక మండలంలో ఎదురుమొండి నుండి గొల్లమంద రోడ్డు ఇటీవలి భారీ వరదలతో ఛిద్రమైంది. ఈ రోడ్డు పునర్నిర్మాణానికి రూ.13.45 కోట్లు వ్యయంతో అంచనాలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ముందు ఉంచారు. ఈ రోడ్డు పరిస్థితిపై కృష్ణా జిల్లా కలెక్టర్ శ్రీ బాలాజీ, పంచాయతీరాజ్ ఈ.ఎన్.సి. శ్రీ బాలు నాయక్ వివరించారు. ఎదురుమొండి నుంచి గొల్లమంద వయా బ్రహ్మయ్యగారి మూల రోడ్డు […]Read More
ఏపీలో విద్యారంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేస్తున్న మంత్రి నారా లోకేశ్ నాయుడును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందించారు. ఇదేవిధంగా ముందుకు సాగాలి. విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలి.. ప్రతి పేద విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించేలా ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. మరోవైపు మంత్రి లోకేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలను ప్రక్షాళన చేయాలని నిర్ణయించారు.. ఈ నిర్ణయంలో భాగంగా విద్యారంగ నిపుణులను వీసీలుగా నియమించాలని ఆయన భావించారు. జాతీయ అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థలుగా మార్చేందుకు […]Read More