Tags :congressgovernament

Breaking News Slider Telangana Top News Of Today

యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం జాతికి అంకితం

తెలంగాణ రాష్ట్రంలోని  నల్గొండ జిల్లా దామరచర్లలోని యాదాద్రి థర్మల్ విద్యుత్ (#YTPS)కేంద్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  జాతికి అంకితం చేశారు. నాలుగు వేల మెగావాట్ల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో 800 మెగావాట్ల యూనిట్-2 నుంచి వాణిజ్య ప్రాతిపదికన ఉత్పత్తి, గ్రిడ్‌కు అనుసంధానించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. అంతకుముందు థర్మల్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన పైలాన్‌ను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క గారితో కలిసి ఆవిష్కరించారు. ఈ థర్మల్ స్టేషన్‌లోని 800 మెగావాట్ల యూనిట్-2 […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం..!

మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును పూర్తి చేసి నల్గొండ జిల్లాను అభివృద్ధి పథాన నడిపిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. “ఎంత ఖర్చయినా కానివ్వండి. ఎన్ని కష్టాలైనా రానివ్వండి. కాలుష్యం లేని, కలుషితం లేని నీరు ఇవ్వడం కోసం మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం. మూసీ పునరుజ్జీవం బాధ్యత నాది. కలుషితాల నుంచి నల్గొండ నుంచి విముక్తి చేసే బాధ్యత నాది. అడ్డం వచ్చేవారి సంగతి చూసే బాధ్యత మీది” అని అన్నారు. ప్రజా పాలన – ప్రజా […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

కేసీఆర్ కు ఆహ్వానం..!

  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీన జరిగే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారిని రాష్ట్ర బీసీ సంక్షేమం మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఆహ్వానించారు. ఇదే అంశంపై కేసీఆర్‌ను ఆహ్వానించడానికి ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి చేరుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ బృందానికి మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే జీవన్ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ నియంత పాలనకు నిలువటద్దం..!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్టులు, నిర్బంధాలు చేయడాన్ని సిద్దిపేట ఎమ్మెల్యే..మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు  తీవ్రంగా ఖండించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించేందుకు వెళ్ళనివ్వకుండా ఈ నిర్బంధాలు ఎందుకని సీఎం రేవంత్‌ రెడ్డిని ప్రశ్నించారు. ఇది నీ నిరంకుశ, నియంతృత్వ పాలనకు నిలువుటద్దమని ఆగ్రహం వ్యక్తంచేశారు.ఒకవైపు ప్రజా పాలన విజయోత్సవాలు అని ప్రచారం చేసుకుంటూ, మరోవైపు రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీని ప్రకటించావని ధ్వజమెత్తారు. మీ అప్రజాస్వామిక […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ఆటో డ్రైవర్లకు సీఎం రేవంత్ రెడ్డి షాక్..?

ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని ఆటో డ్రైవర్లకు బిగ్ షాకిచ్చారు..ఇందులో భాగంగా హైదరాబాద్ మహానగరంలో ఢిల్లీ తరహా పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాలని రవాణా శాఖను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ చర్యలకు అనుగుణంగా  మహానగరంలో డీజిల్ ఆటోలను నగరం వెలుపల ఉన్న  ఓఆర్ఆర్ బయటకు పంపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత మంత్రిత్వ,అధికారులకు సూచించారు. అయితే వారు ఎలక్ట్రిక్ ఆటోలు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

మాజీ సీఎం కేసీఆర్ కు ఆహ్వానం..!

ఈ నెల 9 వ తేదీన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం ప్రధాన ముఖద్వారం ముందు భాగంలో ఏర్పాటు చేయనున్న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కె. చంద్రశేఖర్ రావు గారితో పాటు కేంద్ర మంత్రులు జి.కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని ఆహ్వానం అందించాలని ప్రజా ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడుతూ, 7, 8, […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం..

తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి దృఢ సంకల్పాన్ని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అభినందించారు. మహిళా సాధికారత కోసం తెలంగాణలో మంచి ప్రయత్నాలు జరుగుతున్నాయని కొనియాడారు. ఈ స్వయం సహాయక సంఘాలు భవిష్యత్తులో మరింత శక్తివంతం కావాలని ఆకాంక్షించారు.స్వయం సహాయక సంఘాల కోసం నగరం నడిబొడ్డులోని శిల్పారామంలోని 3.5 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి బజార్ ను గవర్నర్ గారు ప్రారంభించారు. ముఖ్యమంత్రి , ఉప […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ప్ర‌జ‌ల‌తో ముఖాముఖి కార్య‌క్ర‌మంలో పాల్గొన్న మంత్రి జూప‌ల్లి

హైదరాబాద్ గాంధీ భవన్‌లో నిర్వహించిన ప్రజలతో మంత్రుల ముఖాముఖి కార్యక్రమంలో టీపీసీసీ అధ్య‌క్షులు మ‌హేష్ కుమార్ గౌడ్ తో క‌లిసి మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్దఎత్తున కార్యక్రమానికి హాజరై మంత్రి జూపల్లికి పలు సమస్యలపై దరఖాస్తులు, ఫిర్యాదులు అందజేశారు. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఫించ‌న్లు, రెవెన్యూ, త‌దిత‌ర‌ సమస్యలపై ప్రజలు దరఖాస్తులు అందజేశారు. దరఖాస్తులకు స్వీకరించినప్పుడు మంత్రి జూపల్లి ప్రజలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. హైద‌రాబాద్ కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టితో […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా మీడియా నిలవాలి

ప్రభుత్వానికి, ప్రజలకు మీడియా వారధిగా నిలవాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. సంచలనం కోసం అవాస్తవాలు ప్రచారం చేయడం ఇప్పుడు కొన్ని మీడియా సంస్థలకు  అలవాటుగా మారిందని, దానివల్ల మొత్తం మీడియా ఇమేజ్ కు బంగం వాటిల్లుతుందన్నారు. గురువారం నల్గొండ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో యశోద హాస్పిటల్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన జర్నలిస్టుల మెడికల్ క్యాంపును గుత్తా  సుఖేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ”  కేవలం వార్తలు, వృత్తే కాకుండా […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

కేసీఆర్‌.. కిష‌న్ రెడ్డి, బండి సంజ‌య్‌ల‌కు ఆహ్వానం…

డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన స‌చివాల‌యంలో డిసెంబ‌రు 9న తెలంగాణ త‌ల్లి విగ్ర‌హాన్ని ఆవిష్క‌రిస్తున్నామ‌ని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ సంద‌ర్భంగా 7, 8, 9 తేదీల్లో సచివాలయ ప్రాంగణం.. నెక్లెస్ రోడ్డు, ట్యాంక్ బండ్‌ ప‌రిస‌ర ప్రాంతాల్లో తెలంగాణ సంబరాలు అద్భుతంగా నిర్వ‌హించ‌నున్న‌ట్లు సీఎం చెప్పారు. తెలంగాణ  సంస్కృతికి ప‌ట్టం క‌ట్టే కార్య‌క్రమాలు, పిండి వంట‌లు, మ‌హిళా సంఘాల స్టాళ్ల‌తో ఒక పండ‌గ వాతావార‌ణం నెలకొంటుంద‌ని సీఎం చెప్పారు. బోనాలు, వినాయ‌క […]Read More