కల్వకుంట్ల కవిత కు పోటీగా అధికార కాంగ్రెస్ పార్టీ గత కొన్నాళ్లుగా మీడియాలో కానీ ప్రజల్లో కానీ లేని మహిళ నేతను రంగంలోకి దించారా..?. ఇప్పటికే మండలిలో అధికార పక్షాన్ని ముప్పై తిప్పలు పెడుతూ మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అడ్డుకోవాలంటే ఆమెనే కరెక్ట్ అని భావిస్తుందా..?. అంటే అవుననే అంటున్నారు రాజకీ విశ్లేషకులు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత మండలిలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చెడుగుడు ఆడుకుంటున్నారు. బీసీ కుల గణన దగ్గర […]Read More
Tags :congress
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ భూమి కబ్జా చేసిన కాంగ్రెస్ నేత..!
తెలంగాణ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నేత.. ఎమ్మెల్సీ నవీన్ రావుకు చెందిన భూములను అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత ఒకరూ కబ్జా చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. రాజధాని మహానగరం హైదరాబాద్ లోని మాదాపూర్ లో తనకు చెందిన భూమిలోని ప్రహారీ గోడలను కూల్చివేసి కాంగ్రెస్ నేతలు కబ్జా చేశారని ఎమ్మెల్సీ నవీన్ రావు ఆరోపణలు చేశారు. ఈ సంఘటనపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ ఎమ్మెల్సీ […]Read More
ఈనెల 12 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. మరి ఈ సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు అవుతారా.. ?. లేదా అని మిలియన్ డాలర్ల ప్రశ్న.. అయితే కేసీఆర్ అసెంబ్లీకి రాకపై మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల పన్నెండో తారీఖున జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతారని ఆయన స్పష్టం చేశారు. ‘బడ్జెట్ ప్రసంగంలో మాజీ సీఎం […]Read More
తాను త్వరలో సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ప్రకటించారు. ఓ ప్రేమ కథా చిత్రంలో కీలక పాత్ర పోషించనున్నట్లు తెలిపారు. ‘మాఫియాను ఎదిరించి ఓ ఆడపిల్లకు పెళ్లి చేసే క్యారెక్టర్లో కనిపిస్తా. ఈ ఉగాదికి మూవీ స్క్రిప్ట్ వింటా. వచ్చే ఉగాదికి సినిమాను పూర్తి చేస్తాము. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిల అనుమతి తీసుకొని నటిస్తాను. ‘జగ్గారెడ్డి.. వార్ ఆఫ్ లవ్’ అనే టైటిల్ను ఖరారు […]Read More
తెలంగాణ రాష్ట్ర అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పై జనగామ జిల్లా కలెక్టర్ కు పిర్యాదు అందింది. గత సార్వత్రిక ఎన్నికల్లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై గెలుపొందిన యశస్విని రెడ్డి అధికారక నివాసమైన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాజకీయ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రజలకు ఎలాంటి మౌలిక వసతులు కానీ అధికారక కార్యక్రమాలు కానీ జరగడం లేదని స్థానికులు.. ప్రజలు జిల్లా కలెక్టర్ కు పిర్యాదు చేశారు. ప్రజలకు అందుబాటులో […]Read More
తెలంగాణ మండలిలో ఈనెలలో ఎమ్మెల్యే కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల అంశం కొలిక్కి వస్తున్నది.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్, మంత్రి ఉత్తమ్ తో ఏఐసీసీ పెద్దలు మంతనాలు జరిపారు. రాష్ట్ర ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో తెలంగాణ కాంగ్రెస్ నేతల జూమ్ మీటింగ్ లో సమావేశమై చర్చించారు.. ఈరోజు హైకమాండ్ కు నివేదిక ఇవ్వనున్నరు మీనాక్షి నటరాజన్.. ఎమ్మెల్సీ […]Read More
తెలంగాణలో ఖాళీ అయిన ఐదు ఎమ్మెల్సీ స్థానాలపై ఇటు అధికార పార్టీ అయిన కాంగ్రెస్, అటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ లు వ్యూహప్రతివ్యూహాలతో సిద్ధమవుతున్నాయి. ఇందు లో కాంగ్రెస్కి నాలుగు, బీఆర్ఎస్కి ఒకటి దక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక అధికార కాంగ్రెస్ లో సామాజిక వర్గాల వారీగా ఈ ఎమ్మెల్సీ పోస్టులు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెడ్డి సామాజిక వర్గం నుంచి సీనియర్ నేతలైన వేం నరేందర్రెడ్డి, కుమార్ రావు, జీవన్ రెడ్డి, […]Read More
పఠాన్ చెరు మార్చి 7 (సింగిడి) కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ కు చెందిన పఠాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ను గురువారం నియోజకవర్గంలోని ప్యారా నగర్ డంప్ యార్డ్ బాధితులు కలిశారు.ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ ఇన్నాళ్లు మీరు అధికార కాంగ్రెస్ పార్టీ అని కలవలేదు. మా సమస్యను మీకు చెప్పుకోలేదని తమ గోడును వెల్లబుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో బాధితులతో మాట్లాడుతూ నేను అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాదు. పక్కగా నేను […]Read More
తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ఉద్దేశించిన ముసాయిదా బిల్లుకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అలాగే, విద్యా, ఉద్యోగ రంగాల్లో కూడా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని మంత్రిమండలి తీర్మానించింది. వచ్చే శాసనసభ సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ సిఫారసులను మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. దీనిపై శాసనసభలో బిల్లును ప్రవేశపెట్టాలని తీర్మానం చేశారు. డా. బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర […]Read More
గత సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పఠాన్ చెరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి బరిలోకి దిగి గెలుపొందిన గూడెం మహిపాల్ రెడ్డి ఇటీవల అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెల్సిందే. మహిపాల్ పార్టీలో చేరిన దగ్గర నుండి ఆ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాటం శ్రీనివాస్ రెడ్డి ఇతనికి వర్గపోరు నడుస్తుంది. ఈ అంశం గురించి ఏఐసీసీ నుండి టీపీసీసీ వరకూ అందరూ నేతలు పిలిచి మరి వీరిద్దరి మధ్యలో సయోధ్య కుదిరిచ్చే […]Read More