తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జ్.. గత ప్రభుత్వంలో సర్కార్ డిజిటల్ హెడ్ గా పనిచేసిన కొణతం దిలీప్ ను హైదరాబాద్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆసిఫాబాద్ జిల్లాలో జైనూర్ లో జరిగిన ఆదివాసీ మహిళపై అత్యాచార హత్య సంఘటనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని దిలీప్ కొణతం ను అరెస్టు చేసినట్లు క్రైమ్ పోలీసులు తెలిపారు. అయితే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టి […]Read More
Tags :congress
ఏపీ ఉపముఖ్యమంత్రి.. జనసేన అధినేత.. ప్రముఖ సినీ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రంలోని వరద బాధితులకు తనవంతు సాయం ప్రకటించారు. ఇప్పటికే తన రాష్ట్రమైన ఏపీకి కోటి రూపాయలను తన సొంత డబ్బులను విరాళంగా ప్రకటించారు పవన్ కళ్యాణ్. తాజాగా తెలంగాణలోని వరద బాధితులను ఆదుకోవడానికి తనతరపున కోటి రూపాయలు ఇవ్వనున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి స్వయంగా ఆ మొత్తాన్ని అందజేయనున్నట్లు చెప్పారు. కష్టాలు […]Read More
మాజీ మంత్రులు హారీష్ ,పువ్వాడ ,సబితా వాహానాలపై దాడి
ఖమ్మం పర్యటనలో ఉన్న మాజీ మంత్రులు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తన్నీరు హారీష్ రావు,సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్,సండ్ర వెంకట వీరయ్య,కందాల ఉపేందర్ రెడ్డి వాహనాలపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాళ్ల దాడి చేశారు. వరద బాధితులను పరామర్శించడానికెళ్లిన మాజీ మంత్రుల బృందం కరుణగిరి,కాల్వఒడ్డు తదితర ప్రాంతాల్లోని బాధితులను పరామర్శించారు. రాజ్యసభ ఎంపీ గాయత్రి రవిచంద్ర సాయంతో బాధితులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. అనంతర కాల్వఒడ్డు దగ్గర వీరి వాహనాలపై కాంగ్రెస్ శ్రేణులు […]Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి,మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క మహబూబాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా వరద బాధితులను పరామర్శిస్తూ సీతారాం తాండలో యువ శాస్త్రవేత్త అశ్విని కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ” అశ్విని మృతి చాలా బాధాకరం.. ఆశ్విని కుటుంబానికి అండగా ఉంటాము.. సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తాము. వరదల్లో నష్టపోయిన ప్రతి ఎకరాకు పదివేల రూపాయలు ఆర్థిక సాయం అందజేస్తాము.. ప్రతి […]Read More
తెలంగాణ ఏపీ రాష్ట్రాల సరిహద్దు జిల్లా అయిన ఖమ్మం పట్టణం వరదలతో అతలాకుతలమైన సంగతి తెల్సిందే.. వరదలకు ఖమ్మం నగరమంతా మునిగిపోయి కొన్ని వేల కోట్ల నష్టం వాటిల్లింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా జిల్లా స్థానిక మంత్రులైన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,తుమ్మల నాగేశ్వరరావు,భట్టి విక్రమార్క మల్లు జిల్లాలోనే ఉండి వరద బాధిత ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. బాధితులకు అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసానిచ్చారు. అయితే గతంలో ముప్పై ఆరు అడుగుల వరద వచ్చిన కానీ […]Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. రాష్ట్రంలో వర్షాలు వరద పరిస్థితులను, జరిగిన నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. పలు జిల్లాల్లో భారీ వర్షం.. వరదతో వాటిల్లిన నష్టం ప్రాథమిక వివరాలను సీఎం రేవంత్ ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా, ప్రాణ నష్టం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది.. తక్షణ సహాయక చర్యలు చేపట్టాము.. ఖమ్మం జిల్లాలో ఎక్కువ నష్టం సంభవించిందని ప్రధానమంత్రికి […]Read More
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చి.. చెరువులను ..విలువైన ప్రభుత్వ భూములను పరిరక్షించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోచ్చిన వ్యవస్థ “హైడ్రా”. గత కొన్ని రోజులుగా నగరంలో ఎక్కడ అక్రమ నిర్మాణాలు..కట్టడాలు కన్పించిన అక్కడ హైడ్రా ప్రత్యేక్షమై వాటిని కూల్చివేసే పనిలో బిజీబిజీగా ఉంది. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మెగా హీరో.. జనసేన నాయకుడు కొణిదెల నాగబాబు ట్విట్టర్ వేదికగా మద్ధతుగా నిలిచిన సంగతి […]Read More
ప్రకాష్ నగర్ వద్ద వరదల్లో చిక్కుకున్న 9మందిని ఇప్పటి వరకు రక్షించకపోవడంతో తుమ్మలను చూసి ప్రజలు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ తుమ్మల డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసిన ప్రజలు. అనంతరం ఆ 9 మందిని కాపాడకుండా ఇంటికి పోనియ్యం అంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీద తిరగబడ్డ ఖమ్మం ప్రజలు..Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి మద్ధతుగా నిలిచారు మెగా హీరో.. జనసేన నేత కొణిదెల నాగబాబు. రాష్ట్ర రాజధాని మహానగరంలో హైడ్రా కూల్చివేస్తున్న అక్రమ కట్టడాలు. నిర్మాణాలవల్ల ప్రభుత్వ భూములు.. చెరువులు పరిరక్షించబడతాయని నాగబాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు. వర్షాలకు వరదలకు తూములు తెగిపోయి చెరువులు నాలాలు ఉప్పోంగిపోయి అపార్ట్మెంట్లల్లోకి కూడా నీళ్ళు రావడం మనం చూస్తున్నాము. దీనికి ప్రజలు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం.. వీటికి ముఖ్య కారణం చెరువులను నాలాలను అక్రమించి […]Read More
తెలంగాణలో గత రెండు రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాల నేపథ్యంలో రేపు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలకు సెలవు మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది.. వర్షాలు.. వరదల నేపథ్యంలో స్కూళ్లలో విద్యార్థులకు ఎదురై సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నది.. ఈ నిర్ణయాన్ని తూచ తప్పకుండా అన్ని ప్రైవేట్ ప్రభుత్వ విద్యాసంస్థలు పాటించాలని ఆదేశించింది.మరోవైపు అన్ని ప్రభుత్వ విభాగాల ఉద్యోగులకు రేపు సెలవులు రద్ధు చేసింది.Read More