తెలంగాణ రాష్ట్ర వార్షిక లక్ష్యాలకు అనుగుణంగా ఆదాయం పెంచడానికి అధికారులు పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అందుకోసం శాఖల మధ్య సమన్వయం ఉండాలని, పన్నుల ఎగవేత విషయంలో ఎలాంటి లొసుగులు లేకుండా కఠిన చర్యలు చేపట్టాలని హెచ్చరించారు. రాష్ట్రానికి ప్రధానంగా ఆదాయం తెచ్చిపెట్టే వాణిజ్య పన్నులు, స్టాంపులు రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్, మైనింగ్ విభాగాల అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. బడ్జెట్‌లో నిర్ధేశించిన మేరకు రాబడి సాధించడానికి నెలవారి టార్గెట్‌తో పనిచేయాలన్నారు. […]Read More
Tags :congress governament
తెలంగాణ రాష్ట్రంలో శిక్షణ పొందిన బీఈడీ, డీఈడీ విద్యార్థులకు శుభవార్త. డీఎస్సీకి అర్హత సాధించే విధంగా సాధ్యమైనంత తొందరగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌ను ఆదేశించింది. రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి గత నెల 29 వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసింది. డీఎస్సీ రాయడానికి టెట్ తప్పనిసరి కావడంతో మరోసారి పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాజా నిర్ణయంతో […]Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి..టీపీసీసీ అధినేత అనుముల రేవంత్ రెడ్డి సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్ హఠాన్మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సుదీర్ఘ కాలంగా రాష్ట్రంలో పోలీసు విభాగానికి ఆయన అందించిన విశిష్టమైన సేవలను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. సమర్థవంతంగా, నిజాయితీగా విధులు నిర్వహించిన అధికారులను తెలంగాణ సమాజం ఎన్నటికీ మరిచిపోదని అన్నారు. రాజీవ్ రతన్ మృతి పట్ల ముఖ్యమంత్రి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. […]Read More
తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ శ్రీ క్రోధి నామ తెలుగు సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆరు గ్యారంటీల అమలుతో తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాయి.. ఈ ఏడాది కూడా ప్రజలందరి జీవితాల్లో సకల సిరిసంపదలు రావాలని కోరుకుంటున్నట్లు ఆయన అన్నారు.Read More
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ స్తాయికి ఎదిగిందని, ఇప్పుడు సాగునీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని, అనతి కాలంలోనే రాష్ట్రంలో ఈ దుస్థితి ఎందుకొచ్చిందని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రశ్నించారు.ఇవాళ జనగామ, సూర్యాపేట జిల్లాల్లోని వివిధ మండలాల్లో పర్యటించిన ఆయన.. సూర్యాపేట ప్రెస్‌మీట్ నిర్వహించి మీడియాతో మాట్లాడారు. ఈ రోజు జనగామ జిల్లాలో, కొంతమేరకు బస్సులో ప్రయాణిస్తూ యాదాద్రి జిల్లాలో, అదేవిధంగా సూర్యాపేట జిల్లాలో ఎండిపోయిన పంట పొలాలను మా […]Read More