తెలంగాణ రాష్ట్రంలోని జీవో 46 బాధితులు ఈరోజు గురువారం తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి…బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిశారు. ఈసందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ జీవో 46 బాధితుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.Read More
Tags :congress governament
తెలంగాణ సిద్ధాంత కర్త, జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి రేపు జూన్ 21న శుక్రవారం సందర్భంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జయశంకర్ సారూను స్మరించుకున్నారు. తన జీవితాంతం తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా బతికిన మహానుభావుడు జయశంకర్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నాడు సమైక్య పాలనలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటడంతో పాటు జనాన్ని జాగృతం చేయటంలో ఆయన కీలక పాత్ర పోషించారని, తుది శ్వాస వరకు తెలంగాణ కోసమే పరితపించారని ఈసందర్బంగా […]Read More
కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీఅయ్యారు. రాష్ట్ర సచివాలయంలో గంటపాటు జరిగిన చర్చల్లో కొత్తగూడెం నియోజకవర్గానికి సంబందించిన ప్రధాన సమస్యలను కూనంనేని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కూనంనేని ప్రతిపాదించిన పలు అంశాలపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందింస్తూ స్పష్టమైన హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. కొత్తగూడెం, పాల్వంచను కలుపుతూ మున్సిపల్ కార్పొరేషనుగా ఏర్పాటు చేయాలనే కూనంనేని ప్రతిపాదనను ముఖ్యమంత్రి సుముఖత వ్యక్తం చేశారు. ఇందుకు సంబందించిన ప్రక్రియను […]Read More
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం కొల్చారం మండలంలో రాష్ట్ర దేవాదాయ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ పర్యటనలో ప్రోటోకాల్ వివాదం చోటు చేసుకుంది. కొల్చారం మండల కేంద్రంలో నూతన ఎంపీడీవో కార్యాలయాన్ని గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి ఆవుల రాజి రెడ్డితో ప్రారంభం చేయించాలని చూసిన మంత్రి కొండా సురేఖ.. స్థానిక ఎమ్మెల్యే తాను ఉండగా ప్రోటోకాల్ పాటించలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అడ్డుపడ్డారు.Read More
హైదరాబాద్‌ను ప్రపంచంలోనే పేరొందిన నగరాల సరసన నిలబెట్టాలనేది తమ సంకల్పమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఆయన సచివాలయంలో కుష్ మన్ అండ్ వేక్ ఫీల్డ్ సంస్థ ఆసియా పసిఫిక్ సీఈవో మ్యాథ్యూ భౌ ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. హైదరాబాద్ వివిధ రంగాల్లో విస్తరిస్తూ గ్లోబల్ సిటీగా వృద్ధి చెందుతున్న తీరును సమావేశంలో కుష్ మన్ అండ్ వేక్ ఫీల్డ్ సంస్థ తమ అధ్యయన వివరాలను వెల్లడించింది. గడిచిన ఆరు నెలల్లో హైదరాబాద్‌లో లీజింగ్, ఆఫీస్ […]Read More
తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సాయికుంట, శ్రీశ్రీనగర్, రాజరాజేశ్వర కాలనీ, కాకతీయ కాలనీ, తోళ్లవాగు ఏరియా, సున్నంబట్టి వాడ (మంచిర్యాల టౌన్-3)లో మంగళవారం సాయంత్రం 6 గంటలకు కరెంట్ పోయి ఎంత సేపైనా రాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనిపై ఆయా ప్రాంతాల వాసులు ట్రాన్స్‌కో ఏఈ నర్సయ్యకు ఫోన్ చేయగా.. సమస్య ఏంటో తెలియడం లేదని సమాధానం చెప్పినట్టు సమాచారం.. నెల రోజులుగా రోజూ తమ ప్రాంతాల్లో కరెంట్ పోతుందంటూ కాలనీల వాసులు వాపోతున్నారు.Read More
తెలంగాణలో విద్యుత్ కోతలు లేకుండా 24 గంటలు విద్యుత్ అందిస్తున్నాము..రాబోయే రోజుల్లో కూడా ఇండస్ట్రీస్, కంపెనీలకు విద్యుత్ కోతలు లేకుండా 24 గంటల విద్యుత్ ఇస్తామని నాది హామీ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు..Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పనిలో పడి తిండి కూడా తినట్లేదు..సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రోజుకు 20 గంటలు పని చేస్తున్నారు. పనిలో పడి రోజు ఉదయం టిఫిన్ చేయట్లేదు.. మధ్యాహ్న చేయాల్సిన భోజనం కూడా సాయంత్రం 5 గంటలకు చేస్తున్నారు అని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అన్నారు..Read More
గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ ప్రకారం దివ్యాంగుల పెన్షన్ పెంచకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుడు కే. నాగేశ్వరరావు హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దివ్యాంగుల పెన్షన్ రూ. 6 వేలు పెంచుతామని హామీ ఇచ్చింది కానీ 6 నెలలైనా ఇంతవరకు అమలు చేయలేదు. వచ్చే మంత్రి మండలి సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు దేశంలోనే అత్యంత మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొంది చరిత్ర సృష్టించిన నాయకుడు…మాజీ మంత్రి హరీష్ రావు గారిపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి అన్నారు.. తెలంగాణ భవన్ లో మీడియాతో ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉండగా కాంగ్రెస్ నిరుద్యోగులకు ఇచ్చిన వాగ్ధానాలు అమలు చేయాలని మాత్రమే హరీష్ రావు గుర్తు చేశారు. […]Read More