తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డితో జరిగిన భేటీలో టీటీడీలో వాటా, కోస్టల్ లైన్ గురించి చర్చ జరగలేదు.. అది మీడియా ఊహాగానం మాత్రమే అని మీడియా సమావేశంలో ఇరు రాష్ట్రాల మంత్రుల బృందం క్లారిటీ ఇచ్చారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశంలో డ్రగ్స్ & సైబర్ నేరాల గురించి మాత్రమే చర్చలు జరిగాయి. టీటీడీలో వాటా, కోస్టల్ లైన్ గురించి చర్చ జరగలేదు. రెండు రాష్ట్రాల […]Read More
Tags :congress governament
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డికి ఈరోజు(ఆదివారం) హరీశ్‌రావు బహిరంగ లేఖ రాశారు. టీచర్లు, పుస్తకాలు, దుస్తుల కొరత, వేతనాల చెల్లింపుల ఆలస్యం వంటి సమస్యలు విద్యా వ్యవస్థను పట్టి పీడిస్తున్నాయని అన్నారు. విద్యాశాఖ కూడా సీఎం వద్దే ఉన్న సమస్యల మీద ఎందుకు దృష్టి పెట్టడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలన టీచర్లకు, విద్యార్థులకు […]Read More
ఇటీవల జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో భారీ విజయంతో సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌కు చంద్రబాబు వచ్చారు. జూబ్లిహిల్స్‌లోని తన నివాసం నుంచి భారీ ర్యాలీగా ఆయన తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న టీడీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. కార్యకర్తలను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ గడ్డపై ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ మళ్లీ ఇక్కడ పూర్వ వైభవాన్ని సాధిస్తుందన్నారు. పక్క రాష్ట్రంతో […]Read More
నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలం నాచినపల్లిలో అశ్వరావుపేట ఎస్సై శ్రీ రాముల శ్రీనివాస్ మరణ వార్త విని గుండె పోటుతో అతని మేనత్త రాజమ్మ మృతిచెందారు.. ఈ వార్త తెల్సి వారి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించిన నర్సంపేట నియోజక వర్గ మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి… ఈసందర్బంగా అయన మాట్లాడుతూ ప్రభుత్వ తీవ్ర పని ఒత్తిడి, ఉన్నతాధికారుల వేధింపులు తట్టుకోలేకనే ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ మృతి చెందారు.. దీనికి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలి రాష్ట్రంలో […]Read More
హైదరాబాద్ భౌగోళిక పరిధిని పెంచనున్న దృష్ట్యా విపత్తుల నిర్వహణ విభాగం పరిధిని, దాని బాధ్యతలను విస్తరించాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఆదేశించారు. జీహెచ్ఎంసీ, దాని చుట్టూ ఉన్న 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, 33 గ్రామ పంచాయతీల వరకు విపత్తుల విభాగం సేవలు అందించేందుకు అనుగుణంగా వ్యవస్థాపరమైన మార్పులు చేయాలని చెప్పారు. ఇకనుంచి ఈ విభాగాన్ని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ (హైడ్రా) అని పేరు మార్చాలని ఈ సందర్భంగా ప్రాథమికంగా నిర్ణయించారు. […]Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి మరోకసారి ఢిల్లీకి వెళ్లనున్నారు.. త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణ…నూతన పీసీసీ అధ్యక్ష నియామకాల గురించి చర్చించడానికి వెళ్లనున్నారు అని గాంధీ భవన్ వర్గాల ఇన్నర్ టాక్.. అదే విధంగా ఈ నెల 22 తారీఖున కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో తెలంగాణకు ఎక్కువగా నిధులు కేటాయించాలని కోరనున్నట్లు కూడా సమాచారం..Read More
గ్రూప్-2 & 3, డీఎస్సీ పోస్టులను పెంచాలని, గ్రూప్-1 మెయిన్స్ కు 1:100 నిష్పత్తిలో అనుమతించాలని, జీవో 46 పై స్పష్టత ఇవ్వాలని తదితర డిమాండ్లతో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఉస్మానియా విద్యార్థి మోతిలాల్ నాయక్ గాంధీ ఆసుపత్రిలో కూడా దీక్ష చేస్తున్న సంగతి తెల్సిందే.. ఆయన కు మద్ధతుగా ఆసుపత్రి ప్రాంగాణంలో ఉన్న నిరుద్యోగ యువత..విద్యార్థులను పోలీసులు తరిమికొట్టారు.. దీంతో వాళ్లంతా దగ్గర ఉన్న మెట్రో స్టేషన్ లోకి పరుగులు తీశారు..Read More
తెలంగాణ లోని గ్రూప్స్ అభ్యర్థుల డిమాండ్లు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కాంగ్రెస్ బల్మూరి వెంకట్ అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ నేతల ట్రాప్ లో నిరుద్యోగులు పడొద్దని సూచించారు. నిరుద్యోగుల ఆశలు నెరవేర్చేందుకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని వెంకట్ తెలిపారు. నిన్న నిరుద్యోగ జేఏసీ నాయకుడు మోతీలాల్తో బల్మూరి చర్చలు విఫలమయ్యాయి. ప్రభుత్వం తమ సమస్యలపై స్పందించకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని జేఏసీ హెచ్చరించింది.Read More
నిన్న శనివారం ఇల్లందు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరగగా బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు, వైస్ చైర్మన్ జాని పాషాల మధ్య విభేదాలు బైటపడ్డాయి. జీతాలు రావట్లేదని మున్సిపల్ కార్మికులు 3 రోజులుగా కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్నా పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.. దీంతో చైర్మన్, వైస్ చైర్మన్ ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి ఎమ్మెల్యే కోరం కనకయ్య ముందే జాని పాషా మీద చేయి చేసుకున్న చైర్మన్ […]Read More
తెలంగాణ వ్యాప్తంగా వచ్చే నెల నుండి మొదలు కానున్న రైతు రుణమాఫీ గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. అయన మాట్లాడుతూ కేవలం రుణమాఫీ కింద పంట రుణాలు మాత్రమే మాఫీ అవుతాయి… రుణాల కోసం బంగారం తాకట్టు రుణాలు దీని పరిధిలోకి రావని అయన స్పష్టం చేశారు. రేషన్ కార్డు కాకుండా కేవలం పట్టా పాస్ బుక్ ఆధారంగానే మాఫీ ఉంటుంది.. రానున్న మూడు, నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేస్తామని తెలిపారు. […]Read More