Tags :congress governament
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంతూరు కొండారెడ్డిపల్లి గ్రామంలో ఓ మహిళా జర్నలిస్ట్ పై జరిగిన దాడిని సంబంధిత శాఖ మంత్రిగా నా తరపున..ప్రభుత్వం తరపున తీవ్రంగా ఖండిస్తున్నాను.. ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరం..ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుకున్నాము..ఒకవేళ ఈ సంఘటన జరిగి ఉంటే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాము.. మాది ప్రజాప్రభుత్వం..అందరికి స్వేఛ్చ ఉంటుంది..ఎవరైన ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు..ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇవ్వోచ్చు..ఇలాంటి దాడులకు పాల్పడటం హేయమైన చర్య ..దాడి […]Read More
తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ మరియు ఐఎన్ పీఆర్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం గాంధీ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో రుణమాఫీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 22లక్షల మంది రైతులకు రూ.18000వేల కోట్ల రుణమాఫీ చేశాము.. కొంతమందికి కొన్ని టెక్నికల్ సమస్యల వల్ల రుణమాఫీ కాలేదు.. బీఆర్ఎస్ చెబుతున్నట్లుగా కొంతమందికి రుణమాఫీ కాలేదు..త్వరలోనే వాళ్ల సమస్యలను సైతం పరిష్కరించి రుణమాఫీ చేస్తాము..మేము చేసింది […]Read More
తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లోని 63 లక్షల గృహాలు, పట్టణ ప్రాంతాల్లోని 30 లక్షల గృహాలకు నెలకు రూ.300కే ఫైబర్ కనెక్షన్ కల్పించాలని లక్ష్యంగా పెట్టకున్నట్లు కేంద్ర టెలికం, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేశారు. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఢిల్లీలో శుక్రవారం సాయంత్రం కలిశారు. టీ-ఫైబర్ ద్వారా రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు, మండలాలు, జిల్లాలకు ఆప్టికల్ ఫైబర్ ప్రాజెక్టు […]Read More
TS:- తెలంగాణలో రేషన్ కార్డులు ఉన్న వారికి జనవరి నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. నిన్న గురువారం డా.. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో అధికారులతో ఆయన విజిలెన్స్ సమావేశం నిర్వహించారు. గత ఎన్నికల్లో తాము ‘ఇచ్చిన మాట ప్రకారం సన్న బియ్యం ఇస్తాము . రేషన్ బియ్యం దారి తప్పితే కఠిన చర్యలు ఉంటాయి. రేషన్ బియ్యం పట్టుబడితే తక్షణమే డీలర్ షిప్ రద్దు చేస్తాము […]Read More
TS:- ఇటీవల గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన జనసమితి పార్టీ అధ్యక్షులు ప్రో. కోదండరాం కీలక నిర్ణయం తీసుకున్నారు.. ఈ నిర్ణయంలో భాగంగా నియమనిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్సీకి కేటాయించిన వ్యక్తిగత భద్రత సిబ్బంది వద్దు అని.. తిరిగి ప్రభుత్వానికి పంపిస్తున్నట్లు ఎమ్మెల్సీ కోదండరాం ప్రకటించారు.. తాను ప్రజల మనిషిని.. ప్రజల కోసం పరితపించే వ్యక్తిని… ప్రజలే దైవంగా ప్రజాసేవాలో ఉంటున్నాను.. భద్రతా సిబ్బంది వల్ల నామధ్య ప్రజల మధ్య గ్యాఫ్ రావొద్దు అనే ఈ […]Read More
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు… ప్రజలు నిరసనలు తెలిపినా లాభం లేదని, వాటర్ టారిఫ్ పెంచక తప్పదని ఆయన స్పష్టం చేశారు. ‘బెంగళూరు వాటర్ బోర్డు కనీసం కరెంటు బిల్లులు, వేతనాలూ చెల్లించలేకపోతోంది. నీటి సరఫరా పెరగాలంటే నెట్వర్క్ విస్తరించాలి. రుణాలు తీసుకుంటేనే ఇది సాధ్యం. టారిఫ్ పెంచకపోతే బోర్డు మనుగడ కష్టం. ప్రజలకు కృతజ్ఞత లేదు. నీరు రాకుంటే ఫోన్లు, వాట్సాపుల్లో తిడతారు. ఇదెంత కష్టమో వారికి తెలీదు’ అని […]Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి నాంపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది.. ఇటీవల మే నెలలో జరిగిన ఎంపీ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తొలగిస్తుంది… ఆర్ఎస్ఎస్ సహకారంతో బీజేపీ 2025లో భారతదేశాన్ని హిందూ దేశంగా మారుస్తుంది అంటూ బీజేపీ పరువు ప్రతిష్టలకి భంగం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేశారు అని తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ముఖ్యమంత్రి […]Read More
తెలంగాణ రాష్ట్రంలో వివిధ రకాల పంటలకు సంబంధించి అధిక దిగుబడినిచ్చే కొత్త వంగడాలపై పరిశోధనలను ముమ్మరం చేయాలని ప్రతిష్టాత్మక ఇక్రిశాట్ ICRISAT సంస్థకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సూచించారు. తెలంగాణలో వ్యవసాయ రంగం మరింత అభివృద్ధి చెందేలా పరిశోధనలు సాగాలన్నారు. అంతర్జాతీయ పంటల పరిశోధన సంస్థ ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జాక్వెలిన్ హ్యూ (Dr. Jacqueline Hughe) బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర వ్యవసాయ రంగం అభివృద్ధి, కొత్త […]Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రూ. 2లక్షల రుణమాఫీ చేసిన సంగతి తెల్సిందే.. రెండు లక్షల రుణమాఫీపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ “”ఇప్పటివరకు 22 లక్షల మంది రైతుల ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు జమ చేశామని తెలిపారు. ఆధార్, బ్యాంక్ ఖాతాల్లో తప్పులున్న వారికి మాత్రమే రుణమాఫీ ఆగిందని మంత్రి తుమ్మల అన్నారు. దీనికి సంబంధించి రైతులు వ్యవసాయాధికారులకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. వాటిని సరిదిద్ది మాఫీ […]Read More
తెలంగాణ రాష్ట్రంలోని మహాబూబాబాద్ జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి… జిల్లాలోని కురవి మండలం బాల్య తాండలో గిరిజనులందరూ మంచాన పడ్డారు. దీంతో తాండవాసులు తమ తాండకు ఏదో కీడు పట్టుకుంది. అందుకే అందరూ మంచాన పడుతున్నారు. విషజ్వరాలతో అందరూ సతమతవుతున్నారు. తమకు ఏదో కీడు పట్టిందని భూతవైద్యులు, మాంత్రికుల దగ్గరకు పరుగులు పెడుతున్నారు. నిన్నటి నుండి తాండలో విషజ్వరాలు విజృంభిస్తున్న కానీ ఇంతవరకు అక్కడ వైద్య సేవలు అందలేదు. దీంతో తాండవాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు. తక్షణమే ప్రభుత్వం […]Read More