దుబాయి వేదికగా జరుగుతున్న ఛాంపియన్ ట్రోపీ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా టాస్ ఓడింది..దీంతో కివీస్ బ్యాటింగ్ ను ఎంచుకుంది. న్యూజిలాండ్ తో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టాస్ ఓడిన భారత్ తొలుత బౌలింగ్ చేయనుంది. గత మ్యాచులోని టీంతోనే బరిలోకి దిగనుంది. భారత జట్టు: రోహిత్(కెప్టెన్), గిల్, కోహ్లి, అయ్యర్, అక్షర్, రాహుల్, హార్దిక్, జడేజా, షమీ, కుల్దేప్, వరుణ్.Read More
Tags :champions trophy 2025
ఛాంపియన్ ట్రోఫీలో భాగంగా న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న దుబాయ్ లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచులో న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో ఇండియా తొలుత బౌలింగ్ చేయనుంది. భారత్ వరుసగా టాస్ ఓడిపోవడం ఇది 15వ సారి కావడం గమనార్హం.Read More
ఐసీసీ టోర్నీలలో భారత్ ఇప్పటి వరకూ చాలా ఫైనల్స్ ఆడింది. అయితే అందులో సెంచరీ చేసింది మాత్రం మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఒక్కరే. సరిగ్గా ఇరవై నాలుగేండ్ల కిందట 2000లో జరిగిన ఛాంఫియన్స్ ట్రోఫీ ఫైనల్లో దాదా 117 పరుగులు చేశాడు. భారత్ 264 పరుగులు చేసింది. అయితే మరో రెండు బంతులు మిగిలి ఉండగానే కివీస్ లక్ష్యాన్ని ఛేదించింది. ఈసారి కూడా ఛాంపియన్ ట్రోపీ ఫైనల్లో ప్రత్యర్థి న్యూజిలాండే కావడంతో ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా […]Read More
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వరుసగా 14 మ్యాచుల్లో టాస్ ఓడిన సంగతి మనకు తెల్సిందే. హిట్ మ్యాన్ జట్టు కెప్టెన్ గా వరుసగా 11 సార్లు టాస్ ఓడిపోయాడు. ఈ రోజు దుబాయి వేదికగా జరగనున్న ఛాంపియన్ ట్రోపీ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ తో తలపడనున్నది. కనీసం కీవిస్ తో జరగనున్న ఈ మ్యాచ్ లో ఈరోజైన టాస్ గెలుస్తాడా రోహిత్ శర్మ అని అభిమానులు ఆశపడుతున్నారు. ఇక, పూర్తిస్థాయిలో ఫాంలోకి రోహిత్ శర్మ […]Read More
చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో ఇండియా, న్యూజీలాండ్ తలపడబోతున్నాయి. సరిగ్గా పాతికేళ్ల కింద కూడా ఇదే చాంపియన్స్ ట్రోఫీ (అప్పట్లో ఐసీసీ నాకౌట్ ట్రోఫీ) ఫైనల్‌లో ఇండియా-న్యూజీలాండ్ తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో న్యూజీలాండ్ గెలిచి కప్పు ఎగరేసుకొని పోయింది. ఆ మ్యాచ్‌లో హీరో క్రిస్ కెయిన్స్. ఇప్పుడంటే 300+ స్కోర్లను కూడా ఈజీగా ఛేస్ చేస్తున్నారు. కానీ ఒకప్పుడు వన్డేల్లో 250+ స్కోర్‌ను ఛేజ్ చేయడం అంటే చాలా గొప్ప విషయమే. 2000లో కెన్యాలోని నైరోబీలో నాకౌట్ ట్రోఫీ […]Read More
టీమిండియా స్టార్ ఆటగాడు.. వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ తన ఆవేదనను మరోసారి వ్యక్తం చేశారు టీమిండియా ఆడబోయే ప్రతి సిరీస్ ఆరంభానికి ముందు జట్టులో తన చోటు గురించి చర్చ జరగడంపై రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆడిన ‘ఒక సిరీస్ లో సైతం అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిన తర్వాత కూడా మరో సిరీస్ మొదలయ్యే ముందు జట్టులో నా చోటు గురించి చర్చ జరుగుతుంటుంది. బ్యాటింగ్ ఆర్డర్ లో జట్టు అవసరాల మేరకు […]Read More
దుబాయి ఇంటర్నేషనల్ గ్రౌండ్ వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో టీమిండియా మ్యాచ్ లో ఆస్ట్రేలియా 264 పరుగులకు ఆలౌట్ అయింది. ముందుగా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ జట్టులో స్మిత్ 73, అలెక్స్ కేరీ 61 పరుగులతో రాణించారు. ట్రావిస్ హెడ్ 39, లబుషేన్ 29 రన్స్ చేశారు. భారత బౌలర్లలో షమీ 3, వరుణ్, జడేజా చెరో 2 వికెట్లు తీశారు. టీమ్ ఇండియా విజయానికి 265 రన్స్ అవసరం.Read More
టీమిండియా కెప్టెన్.. హిట్ మ్యాన్ రోహిత్ శర్మపై కాంగ్రెస్ పార్టీకి చెందిన అధికార ప్రతినిధి డా. షామా చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం తీవ్ర విమర్శలు వెలువడుతున్నాయి.. తన అధికారక సోషల్ మీడియా అకౌంటులో డా. షామా “రోహిత్ శర్మ యావరేజ్ ప్లేయర్. అత్యంత ఆకట్టుకోని కెప్టెన్.. ‘రోహిత్ ఫ్యాట్ గా ఉన్నాడు. బరువు తగ్గాలి. ఏదో లక్కీగా కెప్టెన్ అయ్యాడు. లెజండ్రీ ఆటగాళ్లైన గంగూలీ, సచిన్, కోహ్లితో పోలిస్తే అతనో సాధారణ ప్లేయర్’ అని షామా పేర్కొన్నారు. […]Read More
ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ జట్టు ఓ చెత్త రికార్డును నమోదు చేసింది. గత 23 ఏళ్లలో ఒక ఐసీసీ టోర్నీకి ఆతిథ్య మిస్తూ ఒక్క మ్యాచ్లోనూ గెలవని జట్టుగా నిలిచింది. చివరిసారిగా 2000లో కెన్యా ఈ అపఖ్యాతిని మూటగట్టుకుంది. 1996 తర్వాత పాకిస్థాన్ జట్టుకు ఐసీసీ టోర్నమెంట్ నిర్వహించే అవకాశం వచ్చింది. దీంతో తమ జట్టు ప్రదర్శనపై ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులకు నిరాశ ఎదురైంది. ఆ టీమ్ పరిస్థితి దిగజారిపోయిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.Read More
దుబాయి వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లో ఫస్ట్ ఇన్నింగ్స్ ముగిసింది. 50 ఓవర్లు పూర్తిగా ఆడకుండానే పాకిస్తాన్ ఆలౌట్ అయింది. 49.4 ఓవర్లకు పాకిస్తాన్ 241 పరుగులు చేసింది. 242 పరుగుల విజయలక్ష్యంతో భారత్ బ్యాటింగ్ కి దిగి రెండు వికెట్లను కోల్పోయి 38.3ఓవర్లలో 214పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో టీం ఇండియా ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ 56(67)పరుగులు చేసి ఔటాయ్యడు.మరోవైపు విరాట్ కోహ్లీ 85(99)*పరుగులతో క్రీజులో ఉన్నారు..Read More