తన గురించి వన్డేలపై రిటైర్మెంట్ గురించి వస్తున్నవార్తలపై కెప్టెన్ .. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కీలక ప్రకటన చేశారు. తాను వన్డే క్రికెట్ కు వీడ్కోలు పలకడం లేదని రోహిత్ శర్మ స్పష్టం చేశారు. తన కెరీర్ పై ఎవరూ ఎలాంటి రూమర్స్ ప్రచారం చేయొద్దని ఆయన కోరారు. కాగా ఛాంపియన్ ట్రోపీ తర్వాత రోహిత్ శర్మ వన్డేలకు వీడ్కోలు చెబుతారని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. మరోవైపు హిట్ మ్యాన్ 2027 వన్డే వరల్డ్ […]Read More
Tags :champions trophy 2025 Final
భారత్ మరో ఐసీసీ ట్రోఫీ సాధించింది. దుబాయిలోన్యూజీలాండ్ జట్టుతో జరిగిన ఫైనల్లో నాలుగు వికెట్ల తేడాతో గెలిచి ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విజేతగా నిలిచింది. 252 పరుగుల లక్ష్య ఛేదనలో కెప్టెన్ రోహిత్ శర్మ 76 పరుగులతో రాణించారు. శ్రేయస్ అయ్యర్ 48, అక్షర్ పటేల్ 29 రన్స్ చేశారు. ఆఖర్లో కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య, జడేజా టీమ్ ఇండియాను గెలిపించారు. మరో ఓవర్ మిగిలి ఉండగానే చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది.Read More
దుబాయి వేదికగా జరుగుతున్న ఛాంపియన్ ట్రోపీ ఫైనల్ మ్యాచులో టీమిండియా మూడో వికెట్ ను కోల్పోయింది. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ డెబ్బై ఆరు పరుగులకు స్టంపౌట్ అయ్యాడు.26.2 ఓవర్లకు టీమిండియా 122పరుగులు చేసింది. లక్ష్యానికి ఇంకా 130పరుగుల దూరంలో ఉంది. క్రీజులో అయ్యర్ 9*, అక్షర పటేల్ 0*లతో క్రీజులో ఉన్నారు.Read More
కివీస్ తో జరుగుతున్న ఛాంపియన్ ట్రోపీ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా రెండో వికెట్ ను కోల్పోయింది. టీమిండియా సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ రెండు పరుగులకే వెనుదిరిగాడు. ఇరవై ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్లను 108పరుగులు సాధించింది. రోహిత్ శర్మ డెబ్బై పరుగులతో క్రీజులో ఉన్నాడు.Read More
టీమిండియా కెప్టెన్..హిట్ మ్యాన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచురీ చేశాడు.. దుబాయి వేదికగా న్యూజిలాండ్ తో జరుగుతున్న ఛాంపియన్ ట్రోపీ ఫైనల్ మ్యాచులో కెప్టెన్ రోహిత్ శర్మ ఐదు ఫోర్లు..మూడు సిక్సర్ల సాయంతో నలబై ఒక్కబంతుల్లో యాబై పరుగులు సాధించాడు.. పదకొండు ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వికెట్ ఏమికోల్పోకుండా అరవై నాలుగు పరుగులు సాధించింది. మరోవైపు శుభమన్ గిల్ పదకొండు పరుగులతో క్రీజులో ఉన్నాడు.ఇంకా విజయానికి 135పరుగుల దూరంలో భారత్ ఉంది.Read More
దుబాయి వేదికగా జరుగుతున్న ఛాంపియన్ ట్రోపీ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 స్కోర్ చేసింది. కివీస్ ఆటగాళ్లల్లో మిచెల్ 63 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచారు. వరుస విరామాల్లో భారత బౌలర్లు వికెట్లు తీయడంతో కివీస్ జట్టు స్కోర్ చేసేందుకు కష్టాలు పడింది. భారత్ బౌలర్లల్లో వరుణ్, కుల్దీప్ తలో రెండు వికెట్లు, జడేజా, షమీ చెరో వికెట్ తీశారు. చివర్లో బ్రేస్వెల్(53) అర్ధ సెంచరీతో […]Read More
టీమిండియా జట్టుతో జరుగుతున్న ఛాంపియన్ ట్రోపీ ఫైనల్ మ్యాచులో నాలుగో వికెట్ ను కోల్పోయింది న్యూజిలాండ్. రవీంద్ర జడేజా బౌలింగ్ లో లేథమ్ ఎల్బీడబ్ల్యూ అవుటయ్యాడు. ముప్పై బంతులాడి లేథమ్ పద్నాలుగు పరుగులు చేశాడు.. ఇరవై నాలుగు ఓవర్లు పూర్తయ్యే సరికి నాలుగు వికెట్లను కోల్పోయి 104పరుగులు చేసింది.భారత్ బౌలర్లలో కుల్దీప్ సింగ్ యాదవ్ రెండు ,వరుణ్ ఒకటి,జడేజా ఒక వికెట్లను తీశాడు..Read More
ఛాంపియన్ ట్రోపీ ఫైనల్ మ్యాచులో టీమిండియా టాస్ ఓడిన సంగతి తెల్సిందే.టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన కివీస్ ఆచూతూచి ఆడుతుంది. ఇరవై ఒక్క ఓవర్లు పూర్తయి సరికే మూడు వికెట్లను కోల్పోయి 102పరుగులు సాధించింది . టీమిండియా బౌలర్లలో కుల్దీప్ యాదవ్‌కు 2, వరుణ్ చక్రవర్తికి 1 వికెట్ పడింది. కివీస్ ఓపెనర్లు యంగ్ 15, రవీంద్ర 37, కేన్ విలియమన్స్ 11పరుగులకు ఔటయ్యారు.. క్రీజులో మిచెల్ 14* ,లథమ్ 18పరుగులతో ఉన్నారు..Read More
దుబాయి వేదికగా జరుగుతున్న ఛాంపియన్ ట్రోపీ ఫైనల్ మ్యాచ్ లో భారత్ స్పిన్నర్ కుల్దీప్ సింగ్ యాదవ్ చెలరేగిపోయి ఆడుతున్నాడు..కుల్దీప్ సింగ్ యాదవ్ 1.2ఓవర్లు వేసి నాలుగు పరుగులిచ్చి రెండు వికెట్లను తీశాడు.. కివీస్ డేంజరస్ ఓపెనర్ రచిన్ రవీంద్ర (37)ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. బౌలింగ్‌కు (10.1వ ఓవర్) వచ్చిన తొలి బంతికే రచిన్‌ను ఔట్ చేశాడు.. ఆ తర్వాత కేన్స్ విలియమన్స్ 11పరుగులకు క్యాచ్ అవుట్ చేశాడు..ఇప్పటివరకూ 13ఓవర్లకు మూడు వికెట్లను కోల్పోయి 77పరుగులు చేసింది.Read More
దుబాయి వేదికగా జరుగుతున్న ఛాంపియన్ ట్రోపీ ఫైనల్ మ్యాచులో న్యూజిలాండ్ ఆటగాళ్లు చెలరేగి ఆడుతున్నారు.. కివీస్ ఓపెనర్లైన యంగ్ (15) రవీంద్ర తొలివికెట్ కు 57పరుగులను జోడించగా యంగ్ పదిహేను పరుగులకు ఔటయ్యాడు. ఆతర్వాత రవీంద్ర 37పరుగులకు ఔటయ్యాడు. సీనియర్ ఆటగాడు కేన్స్ విలియమన్స్ తొమ్మిది పరుగులతో క్రీజులో ఉన్నాడు.. పది ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్లకు 67పరుగులు సాధించింది కివీస్.Read More