తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల వారిని మోసం చేసింది.. రైతులు పండించే పంటలకు బోనస్ అన్నారు, బోగస్ చేశారు.. హామీ ఇచ్చిన మేరకు బోనస్ ఇచ్చే సత్తా ఈ ప్రభుత్వానికి లేదు. రైతులకు పదిహేను వేలు.రైతుకూలీలకు పన్నెండు వేలు ఇస్తామని మోసం చేశారు… హైదరాబాద్ లోని పేదల ఇళ్లు కూలగొట్టకుండానే మూసీ ప్రక్షాళన చేయొచ్చు.. తెలంగాణకు పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదు. రాష్ట్రంలో ఏడాదిలోనే పోలీస్ వ్యవస్థను కాంగ్రెస్ నిర్వీర్యం చేస్తోంది .. ఆలయాలపై […]Read More
Tags :central minister
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 7 ఎయిర్ పోర్టులు నిర్మించేందుకు అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఏడు ఎయిర్ పోర్ట్ లు ఉన్నాయని కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహాన్ నాయుడు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న విమానాశ్రయాల్లో టెర్నినల్ కెపాసిటీలను పెంచుతున్నాము. శ్రీకాకుళం,దగదర్తి,కుప్పం,నాగార్జున సాగర్,తుని-అన్నవరం,తాడేపల్లిగూడెం,ఒంగోలులో కొత్తగా ఎయిర్ పోర్టుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం తరపున కృషి చేస్తామని మంత్రి రామ్మోహాన్ నాయుడు తెలిపారు.Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ పథకాన్ని నిలిపివేస్తారంటూ జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఖండిస్తూ ‘రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ఇక లేనట్లేనా?’ అంటూ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు..ఆరోగ్య శ్రీ పథకానికి ఆయుష్మాన్ భారత్ రీప్లేస్మెంట్ కాదు.. ప్రజలకు ఆరోగ్య సేవలను విస్తరించేందుకు తీసుకొచ్చిన పథకం అని స్పష్టం చేసిన సంగతి తెల్సిందే.. ఈ వ్యాఖ్యలపై మాజీ మంత్రి విడదల రజని స్పందిస్తూ”ఆరోగ్యశ్రీపై టీడీపీ ప్రభుత్వ విధానమేంటో వెల్లడించాలని డిమాండ్ చేశారు. […]Read More
సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తారు అని వస్తున్న వార్తలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా కాంగ్రెస్ కు చెందిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ మాట్లాడుతూ” సింగరేణిని ప్రైవేటీకరిస్తారా..?.. లేదా ప్రభుత్వ నేతృత్వంలో నడిపిస్తారా..? అని ” కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ” సింగరేణిని అసలు ప్రైవేటీకరణ చేయబోము. ఒకవేళ చేయాలనుకుంటే యాబై ఒక్కటి శాతం ఉన్న రాష్ట్ర ప్రభుత్వం అనుమతి […]Read More
రైల్వే ప్రయాణికులకు కేంద్ర సర్కారు శుభవార్తను తెలిపింది.. అందులో భాగంగా రైల్వేల కోసం కేటాయించిన రూ.2.62 లక్షల కోట్ల రైల్వే బడ్జెట్ లో రూ.1.08 లక్షల కోట్లు భద్రత కోసం వినియోగిస్తామని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న డిమాండ్ దృష్ట్యా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2500 జనరల్ కోచ్లు తీసుకొస్తున్నామన్నారు. మరో 10వేల కోచ్లను తయారు చేస్తామన్నారు. బడ్జెట్లో వీటికి నిధులు కేటాయించామన్నారు. అటు ఒక్కో రైలులో మూడింట రెండొంతులు సాధారణ […]Read More
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పరీక్ష పేపర్ లీకేజీ పై చర్చకు ఈరోజు ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపక్షాలు పట్టుపట్టాయి.. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ పై సీబీఐ లాంటి సంస్థలతో విచారణ చేయించాలి..దోషులను కఠినంగా శిక్షించాలి అని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.. ఈ క్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ ” నీట్ పరీక్ష పేపర్ లీకేజీ సంఘటనపై సీబీఐతో విచారణ చేయించాలి.. డబ్బులున్నోళ్ళే విద్యావ్యవస్థను శాసిస్తున్నారు..విద్యవ్యవస్థలో ఉన్న సమస్యలను మూలాల నుండి పేకిలించాల్సి ఉంది […]Read More
సిరిసిల్లతో పాటు తెలంగాణలో ఉన్న నేతన్నలను ఆదుకోవాలని, సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్ తీసుకురావాలని కోరుతూ మాజీ మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రి బండి సంజయ్ కు లేఖ రాసిన సంగతి తెల్సిందే… తనకు మాజీ మంత్రి కేటీఆర్ రాసిన లేఖపై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందిస్తూ’కేటీఆర్ కు ఇన్నాళ్లకు చేనేతలు గుర్తొచ్చారా?.. వారి సమస్యలు ఇప్పుడు అర్ధమయ్యాయా..?సిరిసిల్లకు 15ఏళ్లుగా మీరే ప్రాతినిధ్యం వహించారు. బతుకమ్మ చీరల బకాయిలు చెల్లించకుండా పవర్ లూం సంస్థలు మూతపడేలా […]Read More
సార్వత్రిక లోక్ సభ ఎన్నికలు ముగిశాయి కాబట్టి తిట్లు ఆపి ఇక అభివృద్ధిపై దృష్టి పెడదామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీకి పిలుపునిచ్చారు. నిన్న సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటన సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు. ‘కేంద్రం, రాష్ట్రం మధ్య సమన్వయంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం. రాష్ట్రానికి కేంద్రం నుంచి పూర్తి సహకారం అందేలా కేంద్ర మంత్రిగా నేను చూస్తాను. కేంద్రమంత్రి పదవిని సద్వినియోగం చేసి జిల్లాను అభివృద్ధి చేస్తా’ […]Read More
కేంద్రమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డిని రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీలో కల్సి అభినందనలు తెలిపారు.. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా కిషన్ రెడ్డిని సత్కరించి సన్మానించాము.. తెలంగాణ అభివృద్ధికి సహాకరించాలని కోరినట్లు మంత్రులు తెలిపారు.Read More
హైదరాబాద్‌లో రహదారుల విస్తరణ, ఇతర అవసరాలకు రక్షణ శాఖ భూములు 2,500 ఎకరాలను తెలంగాణ ప్రభుత్వానికి బదలాయించాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గారిని ముఖ్యమంత్రి రేవంత్ అనుముల గారు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా రక్షణ శాఖ మంత్రి గారిని కలిసి అందుకు సంబంధించిన వివరాలను అందజేశారు. రావిరాల గ్రామంలో తెలంగాణ ప్రభుత్వానికి చెందిన 2,462 ఎకరాల భూములను ఇమారత్ పరిశోధన కేంద్రం (ఆర్‌సీఐ) ఉపయోగించుకుంటున్న విషయాన్ని సీఎం గారు రక్షణ […]Read More