తెలంగాణ రాష్ట్రమాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి సోదరులు తలసాని శంకర్ యాదవ్ గారు అనారోగ్యంతో బాధపడుతూ ఈరోజు ఉదయం మరణించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు వారి భౌతిక కాయానికి నివాళి అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. బోయిన్ పల్లి మార్కెట్ అధ్యక్షుడిగా శంకర్ యాదవ్ గారు అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.Read More
Tags :BRS
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు..సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంట విషాదం నెలకొన్నది. రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని మోండా మార్కెట్ వ్యాపారుల సంఘం అధ్యక్షులు, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు, తలసాని శంకర్ యాదవ్ మృతి చెందారు.Read More
తెలంగాణలో ఫించన్ దారులకు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బిగ్ షాకిచ్చింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వంలో పైరవీలు చేసి అక్రమంగా పొందిన పింఛన్లను రద్దు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. వచ్చే మూడేళ్లలో అర్హులందరికీ పింఛన్లు, ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని తెలిపారు. సిఫార్సులకు తావు ఉండదని ఆయన స్పష్టం చేశారు. గ్రామసభలు ఏర్పాటు చేసి భూసమస్యలు పరిష్కరించాలని అధికారులను […]Read More
తెలంగాణ రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సొంత అసెంబ్లీ నియోజకవర్గమైన మంథని నియోజకవర్గం మల్హర్రావు మండలం ఎడ్లపల్లి గ్రామంలో నెలన్నర రోజులు అయినా ప్రభుత్వం వడ్లు కొనట్లెదని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఆ వీడియోలో రైతులు మాట్లాడుతూ మళ్ళీ పంటలు వేసుకునే కాలం వచ్చింది.. ప్రభుత్వం ఇంకా వడ్లు కొనలేదు.. ఈ పంట డబ్బులు ఎప్పుడు రావాలి, మేము ఎలా పెట్టుబడి పెట్టి పంట వేసుకోవాలని బాధలు […]Read More
రామోజీ ఫిల్మ్ సిటీలో ఈనాడు గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు గారి పార్థివ దేహానికి హరీష్ రావు గారు నివాళులు అర్పించారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూరామోజీ రావు గారి మృతి దిగ్బ్రాంతికి గురి చేసింది. తెలుగు ప్రజలకే కాదు దేశానికి తీరని లోటు.సాధారణ వ్యక్తిగా ప్రారంభమైన ఆయన జీవితం అందరికీ ఆదర్శం. నిరంతర శ్రమ, నిత్యం కొత్తదనం కోసం తపన, చెదరని ఆత్మస్థైర్యం, నిబద్ధత, క్రమశిక్షణ కలగలిసిన గొప్ప వ్యక్తి ఆయన. తెలుగు వాడి […]Read More
తెలంగాణ రాష్ట్ర సీఎం..టీపీసీసీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డికి గట్టి దెబ్బ తగిలింది. గతంలో రేవంత్ రెడ్డి సిట్టింగ్ స్థానమైన మల్కాజిగిరి ఎంపీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి సునీతామహేందర్ రెడ్డిపై బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ భారీ మెజార్టీతో గెలుపొందారు. మల్కాజిగిరి స్థానంలో గెలవాలని సీఎం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినా కలిసిరాలేదు. ఇక సీఎం సొంత జిల్లా వికారాబాద్లోనూ బీజేపీ చేవెళ్ల అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి సత్తా చాటి గెలుపొందారు.Read More
తెలంగాణలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఇప్పటివరకు ఎనిమిది స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న సంగతి తెల్సిందే. అయితే దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ బీజేపీ కలిసి వచ్చిందా? అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కవిత అరెస్టుతో బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒకటి కాదని సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయి. దీనికితోడు ప్రధానమంత్రి నరేందర్ మోదీ ప్రచారం ఆ పార్టీకి బూస్ట్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో […]Read More
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 17స్థానాల్లో జరిగిన లోక్ సభ ఎన్నికల ఫలితాలు ఈరోజు వెలువడుతున్నాయి.. ఇందులో భాగంగా మల్కాజిగిరి పార్లమెంట్ ఓట్ల మూడో రౌండ్ కౌంటింగ్ పూర్తయింది. భారత రాష్ట్ర సమితి పార్టీకి 79,756, భారతీయ జనతా పార్టీకి 2,50,252, కాంగ్రెస్ పార్టీకి 1,57,810 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 92,442 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. ప్రస్తుతం ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది.Read More
దేశ వ్యాప్తంగా ఈ రోజు లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఉదయం ఎనిమిది గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుతో మొదలైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. తెలంగాణలో ఉన్న పదిహేడు ఎంపీ స్థానాల ఓట్ల లెక్కింపులో పోస్టల్ బ్యాలెట్ లో బీజేపీ,కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. మల్కాజిగిరి పార్లమెంట్ నుండి బరిలోకి దిగిన బీజేపీ అభ్యర్థి..మాజీ మంత్రి ఈటల రాజేందర్ పోస్టల్ బ్యాలెట్ లో దూసుకెళ్తున్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధి ఎల్ బి నగర్ […]Read More