ఏపీ శాసనమండలిలో గందరగోళం నెలకొన్నది. ఈరోజు ఉదయం ప్రారంభమైన శాసనమండలి సమావేశాల్లో మెడికల్ కాలేజీల అంశంపై వైసీపీ,కూటమి పార్టీల మధ్య రగడ మొదలైంది. మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడానికి కూటమి ప్రభుత్వం సిద్ధమా..? అని వైసీపీ సభ్యులు ప్రశ్నించారు. దీనికి సమాధానంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ వంద ఎలుకలు తిన్న పిల్లి హాజ్ యాత్రకు వెళ్లినట్లు ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్నారు అని వ్యాఖ్యానించారు. దీంతో హాజ్ యాత్రను ప్రస్తావించడంపై వైసీపీ అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. దీంతో […]Read More
Tags :breakingnews
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఆరోపించారు. గత నాలుగు నెలలుగా ఇన్ని ఘోరాలు జరుగుతున్నా చేతకాని హోంమంత్రి అనిత ఎక్కడున్నారు? అని ఆమె ప్రశ్నించారు. ‘రాష్ట్రంలో ఆడపిల్లలపై అరాచకాలు పెరిగాయి. చిన్నారులు, యువతులు, అత్తాకోడళ్లపై అత్యాచారాలు జరుగుతున్నాయి. ప్రభుత్వానికి బాధితులకు ధైర్యం చెప్పే బాధ్యత కూడా లేకుండాపోయింది. దిశా యాప్ పునరుద్ధరించాలి’ అని ఆమె డిమాండ్ చేశారు.Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గా ఉన్న అనుముల రేవంత్ రెడ్డి స్థానంలో త్వరలో కొత్త సీఎం వస్తారని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఖండించారు. ‘కాంగ్రెస్ పార్టీలో జరిగే విషయాలు మహేశ్వర్ రెడ్డికి ఏం తెలుసు?..బీజేపీ లో ఆయనకు ఎలాంటి గౌరవం దక్కుతుందో ఒకసారి ఆలోచించుకోవాలి. మా పార్టీ గురించి వేరే వాళ్లు మాట్లాడితే ఊరుకోం. మాకు సీఎం ఎవరు అనేది ముఖ్యం కాదు. ప్రజాపాలన అందించడమే మా […]Read More
హిట్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా… బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా.. సైఫ్ ఆలీఖాన్ ప్రధాన పాత్రలో కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మితమై ఈ నెల ఇరవై ఏడో తారీఖున ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న మూవీ దేవర.. దేవర మూవీ ప్రమోషన్ కార్యక్రమాలతో హీరోహీరోయిన్లు.. చిత్రం మేకర్స్ ఫుల్ బిజీగా ఉన్నారు. తాజా చెన్నైలో జరిగిన […]Read More
తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆకేరు వాగు వరద ఉధృతి కారణంగా ఇళ్లల్లో నీరు చేరి పట్టాదారు పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులు, ఇతర సర్టిఫికేట్స్ తడిచిపోయిన, పాడైన పోయిన వాటి విషయంలో ఒకే ఎఫ్ఐఆర్ దాఖలు చేసి అందరికీ కొత్త కార్డులు, సర్టిఫికేట్స్ ఇవ్వాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను అదేశించారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం అందజేస్తామని చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యక్షంగా పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి […]Read More
తమిళ స్టార్ హీరో సూర్య ప్రైవేట్ జెట్ కొనుగోలు చేసినట్లు తమిళ ఇండస్ట్రీకి చెందిన సినీవర్గాలు తెలిపాయి. డసాల్ట్ ఫాల్కన్ కంపెనీకి చెందిన అత్యాధునిక సదుపాయాలు కలిగిన ఈ విమానం ధర రూ.120 కోట్లు ఉంటుందని పేర్కొన్నాయి. తమిళ ఇండస్ట్రీలో ఇప్పటికే లేడీ అమితాబ్ నయనతార, సూపర్ స్టార్ రజినీకాంత్, పవర్ స్టార్ విజయ్ సొంత విమానాన్ని కలిగి ఉన్నారు.. ఇప్పుడు ఆ జాబితాలో సూర్య చేరారు. సూర్య ప్రస్తుతం ‘కంగువా’ సినిమాలో నటిస్తున్నారు.Read More
KCR, హరీష్ రావు ఒత్తిడి వలనే కాళేశ్వరం ఫైల్స్ పై సంతకాలు
TS:- తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి ఇరిగేషన్ మంత్రి తన్నీరు హరీష్ రావు ల ఒత్తిడి వలనే కాళేశ్వరం ప్రాజెక్టు పైల్స్ పై సంతకాలు చేయాల్సి వచ్చింది అని సీడీవో మాజీ ఈఎన్సీ నరేందర్ రెడ్డి తెలిపారు.. వారి ఒత్తిడి వల్లే కాళేశ్వరం డిజైన్లు, డ్రాయింగ్ లో ఫైనల్ అప్రూవల్ కు తాను సంతకాలు చేసినట్లు . కాళేశ్వరం కమిషన్ ఎదుట ఆయన నిన్న గురువారం విచారణకు హాజరై కమిషన్ ముందు చెప్పారు… కాళేశ్వరం […]Read More
TS :- తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం ముందు మాజీ ప్రధానమంత్రి దివంగత రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెల్సిందే. ఈ నిర్ణయం పట్ల సర్వత్రా నిరసనలు వెల్లివెత్తుతున్నాయి.. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి.. BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ “తెలంగాణకు రాజీవ్ గాంధీ చేసిందేమీ లేదని అన్నారు. ‘రాహుల్ దగ్గర మార్కులు కొట్టేయడం కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ రాజీవ్ విగ్రహాన్ని పెడుతున్నారు. […]Read More
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు బీఆర్ఎస్ పార్టీకి కౌంటర్ ఇచ్చారు.. మీడియాతో డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ “ఎన్నికల్లో లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చారు.. ఐదేళ్లుగా రూ.లక్ష రుణమాఫీ చేయలేని బీఆర్ఎస్ నేతలు సిగ్గు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే రుణమాఫీ చేశామన్నారు. దేశంలో ఒకేసారి రూ.2లక్షల రుణం మాఫీ చేసిన దాఖలాలు మరెక్కడా లేవన్నారు. దీనిపై చాలామంది అవగాహన […]Read More