Tags :breaking news

Crime News Slider Telangana

ప్రేమ జంట ఆత్మాహత్యాయత్నం

తమ ప్రేమ వివాహానికి ఇరువైపుల పెద్దలు ఒప్పుకోకపోవడంతో ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది..ఈ ఘటనలో  ప్రియురాలు మృతి చెందగా ప్రియుడి పరిస్థితి విషమంగా ఉంది. అసలు విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ – బయ్యారం మండలం కోటగడ్డ గ్రామానికి చెందిన రవీందర్, కొట్టెం రవళి ఇద్దరు ప్రేమించుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోయి శ్రీకాకుళం జిల్లాలో కాపురం పెట్టారు.రవళికి మూడేళ్ల క్రితం వేరే యువకుడితో పెళ్లి కాగా భర్తను వదిలేసి తల్లితండ్రుల వద్దే ఉంటుంది. […]Read More

Crime News Slider Telangana

కన్నతండ్రిని చంపిన కేసులో ట్విస్ట్

పెళ్లి చేసుకోమన్నాడని కన్నతండ్రిని చంపిన కూతురు ఘటనలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగాముగ్గురు యువకులతో  సదరు యువతి ప్రేమాయణం నడిపినట్లు తెలుస్తుంది. ఏపీలోని అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఈ నెల 13న జరిగిన హత్య కేసు వివరాలను పోలీసులు వెల్లడించారు. ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న దొర స్వామి (62) ఆయన భార్య లత ఏడాదిన్నర కిందట అనారోగ్యంతో మృతి చెందగా.. తమ ఏకైక కుమార్తె హరితతో కలిసి సొంతింట్లో ఉంటున్నారు. కుమార్తె […]Read More

Crime News Slider Telangana

ఇద్దరితో రోమాన్స్.!.కన్నతండ్రినే..?

ఫాదర్స్‌ డే నాడే దారుణమైన విషయం ఒకటి  వెలుగులోకి వచ్చింది. ఇద్దరు ప్రియులతో రొమాన్స్‌కు అలవాటు పడిన ఓ యువతి.. తనకు అడ్డుగా ఉన్నాడని కన్నతండ్రినే హత్య చేసింది.ఏపీలోని అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఈ దారుణమైన సంఘటన  చోటుచేసుకుంది. చివరకి దొరికిపోవడంతో కన్నతండ్రే తనపై లైంగికవేధింపులకు పాల్పడటంతో తట్టుకోలేక చంపేశానని అభాండం మోపింది. ఆమె మాటలు నమ్మకుండా పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపెట్టింది.Read More

Slider Telangana

TDPలోకి మాజీ మంత్రి మల్లారెడ్డి-క్లారిటీ

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి..మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి బీఆర్ఎస్ ను వీడి టీడీపీలో చేరనున్నారు. ఆ పార్టీ యొక్క తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వనున్నారు అని వార్తలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై మాజీమంత్రి మల్లారెడ్డి స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను తిరిగి టీడీపీలో చేరతాను.టీటీడీపీ అధ్యక్ష పదవి నాకు ఇస్తున్నట్లు వార్తల్లో ఎలాంటి నిజం లేదు. టీడీపీలో చేరమని నన్ను ఎవరూ సంప్రదించలేదని ఆయన అన్నారు.ఇలా ఫేక్ వార్తలను […]Read More

Andhra Pradesh Slider Videos

మద్యం ప్రియులకు శుభవార్త

మద్యం ప్రియులకు ఇది నిజంగా శుభవార్తనే. ఏపీ రాష్ట్రానికి కింగ్ ఫిషర్ బీర్ల స్టాక్ తీసుకొచ్చి గోదాముల్లో నిల్వ ఉంచినట్లు తెలుస్తోంది. ఈమేరకు ప్రస్తుత అధికార పార్టీ టీడీపీకి చెందిన  సీనియర్ నేత ఆనం వెంకటరమణారెడ్డి ఓ వీడియో ట్వీట్ చేశారు. ‘ఇట్స్ బ్యాక్ ఆల్ ఓవర్ ఏపీ. కింగ్ ది ఫిషర్ చీర్స్’ అని రాసుకొచ్చారు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం నాణ్యతలేని మద్యం అమ్ముతోందని అప్పటి ప్రతిపక్ష టీడీపీ […]Read More

Slider Telangana

మాజీ మంత్రి తలసానికి మాజీ మంత్రి హారీష్ రావు పరామర్శ

తెలంగాణ రాష్ట్రమాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి సోదరులు తలసాని శంకర్ యాదవ్ గారు అనారోగ్యంతో బాధపడుతూ ఈరోజు ఉదయం మరణించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు వారి భౌతిక కాయానికి నివాళి అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. బోయిన్ పల్లి మార్కెట్ అధ్యక్షుడిగా శంకర్ యాదవ్ గారు అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.Read More

Andhra Pradesh Slider

కేంద్ర మంత్రి రామ్మోహాన్ నాయుడు ఏమోషనల్ వీడియో

ఆదివారం కేంద్రమంత్రిగా ప్రమాణం చేసిన శ్రీకాకుళం  టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు తన తండ్రి ఎర్రన్నాయుడిని ఈసందర్భంగా గుర్తు చేసుకున్నారు. ‘నాన్న గారి ఆశయ సాధన కోసం కృషి చేస్తాను. వారి దీవెనలు ఎల్లప్పుడూ మాపై ఉంటాయి. నా కథకి నువ్వే హీరో నాన్న. పై నుండి నన్ను ఎప్పుడూ మీరు చూస్తుంటారని నాకు తెలుసు’ అని ఓ వీడియోను తన Xలో షేర్ చేశారు. కాగా, తండ్రి మరణంతో రాజకీయాల్లోకి వచ్చిన రామ్మోహాన్ నాయుడు వరుసగా […]Read More

National Slider Telangana

కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కిషన్ రెడ్డి మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ “కేంద్రమంత్రి వర్గ కూర్పులో అన్ని రాష్ట్రాలకు సమన్యాయం చేశారు.. రాబోవు వందరోజుల ప్రణాళికల గురించి ప్రధానమంత్రి నరేందర్ మోదీ ఆలోచిస్తున్నారు. వచ్చే ఐదేండ్లలో పేదలకు మూడు కోట్ల ఇండ్లను నిర్మించి తీరుతాము. తెలంగాణలో సంస్థాగత మార్పులుంటాయి..బీజేపీ రాష్ట్ర అధ్యక్ష మార్పులుంటాయి..నన్ను కేంద్రమంత్రిగా నియమించిన ప్రధానమంత్రి నరేందర్ మోదీకి ధన్యవాదాలు” అని అన్నారు.Read More

Slider Sports

భారత్ ఆలౌట్

టీ20 వరల్డ్ కప్ లో న్యూయార్క్ వేదికగా పాకిస్థాన్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా 119పరుగులకు అలౌట్ అయింది. పాకిస్థాన్ బౌలర్ల దాటికి టీమిండియా ఆటగాళ్లు నిలబడలేకపోయారు..టీమిండియా జట్టులో పంత్42,అక్షర 20,రోహిత్ 13పరుగులు చేశారు. పాకిస్థాన్ బౌలర్లలో నసీమ్ షా,రవూఫ్ మూడేసి వికెట్లను తీశారు..ఆమీర్ 2, అప్రిది 1 వికెట్లను తీశారు.పాకిస్థాన్ 20ఓవర్లలో 120పరుగులను సాధించాలి.Read More