🔹అమల్లోకి వచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలుRead More
Tags :breaking news
ఏపీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ప్రారంభం తెలుగు రాష్ట్రాలకు మరో మూడు రోజులు వర్షాలు పోలవరంలో రెండోరోజు విదేశీ నిపుణుల బృందం పర్యటన హైదరాబాద్ లో పీవీ హైవేపై కారు బీభత్సం, ఒకరు మృతి 6 నుంచి 15 వరకు ఇంద్రకీలాద్రిపై వారాహి నవరాత్రులు నేటి నుంచి అమలులోకి కొత్త క్రిమినల్ చట్టాలు మథురలో కూలిన వాటర్ ట్యాంక్, ఇద్దరు మృతి దేశవ్యాప్తంగా స్మార్ట్‌సిటీ మిషన్ గడువు పొడిగింపు ముంబై: బాలీవుడ్ నటుడు శత్రుఘ్నసిన్హాకు అస్వస్థత […]Read More
మీరు మద్యం ప్రియులా..?. అయితే ఇది మీకు ఖచ్చితంగా బ్యాడ్ న్యూస్.. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏడాది సుమారు ముప్పై లక్షల మంది మద్యం తాగేవాళ్ళు చనిపోతున్నారని ఓ సర్వే తేల్చి చెప్పింది.. గత కొన్ని సంవత్సరాలుగా మరణాల రేటు కాస్త తగ్గినప్పటికీ అది ఆమోదించలేనిదని పేర్కొంది. ప్రతి 20 మరణాల్లో ఒకటి మద్యపానం కారణంగానే సంభవిస్తోందని చెప్పింది. 2019లో ఆల్కహాల్ వినియోగం వల్ల ప్రపంచవ్యాప్తంగా 2.6+ మిలియన్ల మంది చనిపోయారు..అందులో మూడొంతుల మంది పురుషులే ఉన్నారని […]Read More
ఏపీ ప్రతిపక్ష వైసీపీకి చెందిన నేత..మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పల్నాడు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఈవీఎంల ధ్వంసం, అడ్డుకున్న వారిపై దాడి కేసుల్లో అరెస్ట్ చేసి నర్సరావుపేట ఎస్పీ కార్యాలయానికి తరలించారు. అనంతరం మాచర్ల కోర్టుకు ఆయన్ను తీసుకెళ్లే అవకాశం ఉంది. 4 కేసుల్లో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను కొద్దిసేపటి క్రితమే కోర్టు కొట్టేయడంతో పోలీసులు అరెస్ట్ చేశారు.Read More
తీవ్ర అసంతృప్తిగా ఉన్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత..ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డికి ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు నుండి ఫోన్ కాల్ వచ్చింది.. జీవన్ రెడ్డిని తీసుకుని తక్షణమే ఢిల్లీ రావాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ ను ఏఐసీసీ ఆదేశించింది.. దీంతో లక్ష్మణ్ తో కల్సి కాసేపట్లో డిల్లీకి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వెళ్లనున్నారు..జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను చేర్చుకోవడంతో అలకబూనిన జీవన్ రెడ్డి..Read More
నిజామాబాద్ – పడగల్ గ్రామానికి చెందిన గాదెపల్లి రమేశ్ (56) అనే వ్యక్తి వేల్పూర్ మండలంలో కాలువ కట్టపై కారును రివర్స్ తీసే ప్రయత్నంలో కారు అదుపుతప్పి కట్టపై నుంచి మత్తడి వాగులో పడిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ వినయ్ కుమార్ అగ్నిమాపక సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. మత్స్యకారుల సహాయంతో కారును వెలికి తీయించి. కారులోని రమేశ్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.Read More
ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో శ్రీకాకుళం నుండి ఎంపీగా గెలుపొందిన టీడీపీ యువ నేత, కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈరోజు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. తన స్వీకారాన్ని ఆయన తెలుగులోనే పూర్తి చేయడం ఇక్కడ విశేషం. పార్లమెంటులో ఎంపీలు తమకు ఇష్టమైన భాషలో ప్రమాణం చేసేందుకు అవకాశం ఉంటుంది.Read More
తెలంగాణ రాష్ట్ర అధికార కాంగ్రెస్ పార్టీలో వలసల జోరు కొనసాగుతుంది.. మాజీ మంత్రి..మాజీ స్పీకర్ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన సంగతి తెల్సిందే.. తాజాగా ఆ సంఘటనను మరిచిపోకముందే జగిత్యాల అసెంబ్లీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.Read More
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం..జనసేనాని పవన్ కళ్యాణ్ తో విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సినీ నిర్మాతలు భేటీ కానున్నారు.. ఈ భేటీలో ఇండస్ట్రీలో నెలకొన్న పలు సమస్యలపై చర్చించనున్నారు..డిప్యూటీసీఎంగా..మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి సినీ నిర్మాతలు భేటీ కానుండటంతో ప్రాధాన్యత సంతరించుకున్నది. ఈ సమావేశంలో పాల్గొననున్న అగ్ర నిర్మాతలు దిల్ రాజు, డీవీవీ దానయ్య, అశ్వినీదత్, చినబాబు, నవీన్, రవిశంకర్, నాగవంశీ, విశ్వప్రసాద్, బోగవల్లి ప్రసాద్ తదితరులు..Read More
తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం జిల్లా మణుగూరు మండలం బావి కూనవరం గ్రామానికి చెందిన పద్మ శ్రీ అవార్డు గ్రహీత సకిని రాంచంద్రయ్య కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో స్వగ్రామంలోనే ఆయన ప్రాణాలు వదిలినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కంచుమేళం- కంచుతాళం వాయిస్తూ ఆదివాసీ తెగల కథలకు ఆయన దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చారు. మేడారం జాతర ప్రధాన ఘట్టం చిలకలగుట్ట నుంచి సమ్మక్కను గద్దెలపైకి తీసుకువెళ్లే సమయంలోనూ రాంచంద్రయ్య కీలక పాత్ర పోషించేవారు. ఈ కథలు చెప్పే కళాకారుల్లో చిట్టచివరి […]Read More