Tags :breaking news

Breaking News Slider Telangana Top News Of Today

ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ జాక్వెలిన్ హ్యూతో  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ

తెలంగాణ రాష్ట్రంలో వివిధ రకాల పంటలకు సంబంధించి అధిక దిగుబడినిచ్చే కొత్త వంగడాలపై పరిశోధనలను ముమ్మరం చేయాలని ప్రతిష్టాత్మక ఇక్రిశాట్ ICRISAT సంస్థకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సూచించారు. తెలంగాణలో వ్యవసాయ రంగం మరింత అభివృద్ధి చెందేలా పరిశోధనలు సాగాలన్నారు. అంతర్జాతీయ పంటల పరిశోధన సంస్థ ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జాక్వెలిన్ హ్యూ (Dr. Jacqueline Hughe)  బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర వ్యవసాయ రంగం అభివృద్ధి, కొత్త […]Read More

Breaking News Movies Slider Top News Of Today

విశ్వంభర సర్ ప్రైజ్ వచ్చేసింది…!

తెలుగు సినిమా ఇండస్ట్రీ సీనియర్ స్టార్ హీరో…మెగాస్టార్ చిరంజీవి, వశిష్ఠ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘విశ్వంభర’. ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్ ను చిత్ర యూనిట్ పంచుకుంది. చేతిలో త్రిశూలంతో యాంగ్రీ లుక్ లో ఉన్న చిరు పోస్టర్ ఆకట్టుకుంటోంది. మెగాస్టార్ కు ఈ చిత్ర యూనిట్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. కాగా టీజర్ ను త్వరలోనే విడుదల చేస్తామని దర్శకుడు తెలిపారు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 10న థియేటర్లలో […]Read More

Andhra Pradesh Breaking News Crime News Slider Top News Of Today

ఫార్మా కంపెనీ పేలుడు మృతులకు కోటి రూపాయలు పరిహారం

ఏపీలో అచ్యుతాపురం లో ఎసెన్షియా ఫార్మా కంపెనీలో మ.2.15 గంటలు. బీ షిప్ట్ కు వచ్చినవారు, ఏ షిఫ్ట్ నుంచి వెళ్లిపోయేవారితో కంపెనీ రద్దీగా ఉంది. మూడో ఫ్లోర్లో ఉన్న రియాక్టర్ ఒక్కసారిగా పేలింది. ఆ ధాటికి అక్కడున్న వారి మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. అంతలోనే ఫస్ట్ ఫ్లోర్ శ్లాబ్ కుప్పకూలింది. శిథిలాల కింద చిక్కుకున్న ఉద్యోగుల్లో పద్దెనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది చికిత్స పొందుతున్నారు..  ఈ పేలుడులోపేలుడు ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

ఫ్రీ బస్సు ప్రయాణంపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, పంజాబ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలవుతున్న తీరుపై అధ్యయనం చేయాలని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులతో కూడిన కమిటీ ఆయా రాష్ట్రాల్లో పర్యటించి నివేదిక రూపొందించాలని సూచించారు. కొంత ఆలస్యమైనా లోపాలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కాగా ఈ నెల 15 నుంచే ఈ స్కీమ్ అమలు చేస్తామని మంత్రులు గతంలో చెప్పిన విషయం మనకు తెలిసిందే.Read More

Andhra Pradesh Slider Top News Of Today

నేడు అచ్యుతాపురం కు చంద్రబాబు

TDP జాతీయ అధ్యక్షుడు… ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈరోజు గురువారం అచ్యుతాపురం వెళ్లనున్నారు. ఎసెన్షియా కంపెనీలో రియాక్టర్ పేలిన స్థలాన్ని ఆయన పరిశీలిస్తారు. అనంతరం ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను పరామర్శిస్తారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారితో ఆయన మాట్లాడనున్నారు. ఇక ఘటనపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్న సీఎం క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం వైజాగ్ లేదా హైదరాబాద్ కు తరలించాలని చంద్రబాబు ఆదేశించారు. ఘటనలో ఇప్పటివరకు 14 మంది ప్రాణాలు కోల్పోయారు.Read More

Movies Slider Top News Of Today

మెగాస్టార్ గొప్ప మనసు

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో.. మెగాస్టార్ చిరంజీవి ఐ బ్యాంకు, బ్లడ్ బ్యాంకుల ద్వారా ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తున్న సంగతి తెల్సిందే.. ఆపదల్లో ఉన్నవారికి ఆర్థికంగా సాయం చేసి అండగా కూడా నిలబడతారు.. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.. ప్రముఖ టాలీవుడ్ సీనియర్ విలన్… నటుడు పొన్నాంబళం చిరు పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొని మాట్లాడుతూ “నా జీవితం మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిందేనని  అన్నారు.  ‘ఆ రోజుల్లో ఫైటర్స్ రెమ్యునరేషన్ రోజుకు రూ.350 […]Read More

Lifestyle Movies Slider Top News Of Today

మెగా ఫ్యాన్స్ కు బిగ్ సర్ ప్రైజ్

ఈరోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ కు ‘విశ్వంభర’ టీమ్ తీపి కబురు చెప్పింది. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఉదయం 10.08 గంటలకు అప్డేట్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈమేరకు ఓ పోస్టర్ను విడుదల చేసింది. చేతిలో శూలంతో ఓ పోర్టల్ ఎదుట చిరు నిల్చున్నట్లుగా అందులో కనిపిస్తోంది. వశిష్ఠ డైరెక్షన్లో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో త్రిష, ఆషికా రంగనాథ్ చిరు సరసన కనిపించనున్నారు..Read More

Slider Sports Top News Of Today

నా కల అదే

మున్ముందు టీమ్ ఇండియాను రికార్డులు, ఫలితాల గురించి ఆలోచించని జట్టుగా మార్చడమే తన కల అని కెప్టెన్ రోహిత్ శర్మ వ్యాఖ్యానించారు. సియట్ అవార్డ్స్ ఆయన ఈ మేరకు మాట్లాడారు. ‘ఆటగాళ్లు స్వేచ్ఛగా ఆడే వాతావరణాన్ని కల్పించాలని నేను అనుకుంటాను. జట్టులో వారు స్వతంత్రంగా తమను తాము వ్యక్తీకరించుకునే పరిస్థితి ఉండాలి’ అని స్పష్టం చేశారు. సియట్ ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారాన్ని ఆయన గెలుచుకున్నారు.Read More

Movies Slider Top News Of Today

విడుదలకు ముందే ఇంద్ర రికార్డు

టాలీవుడ్ స్టార్ సీనియర్ హీరో…మెగాస్టార్ చిరంజీవిది నేడు పుట్టినరోజు.. ఈ సందర్భంగా ఆయన హిట్ మూవీల్లో ఒకటైన ‘ఇంద్ర’ నేడు రీరిలీజ్ కానుంది. అయితే రీరిలీజ్ పరంగా ఈ మూవీ రికార్డు సృష్టించిందని నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో మొత్తంగా 385కు పైగా థియేటర్లలో విడుదల అవుతున్నాయి .. ఇది ‘బిగ్గెస్ట్ ఎవర్ రీరిలీజ్ మూవీ’ అని పేర్కొంది.ఇప్పటికే పలు చిత్రాలు రిరిలీజ్ అయిన నేపథ్యంలో ఈ మూవీ పై […]Read More