Tags :break news

Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న పదో తరగతిలో ఇంటర్నల్‌ మార్కుల ఎత్తివేయనున్నది. అయితే ప్రస్తుతం వందశాతం మార్కులకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. గతంలో 20శాతం ఇంటర్నల్‌ మార్కుల విధానం ఉంది.. తాజాగా అమల్లో ఉన్న గ్రేడింగ్‌ విధానంలో ఫలితాల నేపథ్యంలో ఇంటర్నల్‌ మార్కులు అవసరం లేదని  ప్రభుత్వం భావించింది. ఈ విధానం 2024-25 అకడమిక్‌ ఇయర్‌ నుంచే […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల పదవి కాలం ముగిసిన గ్రామపంచాయితీలకు సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ఏడాది జనవరి 14న  విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది .. పంచాయితీ ఎన్నికలను మొత్తం మూడు విడతల్లో నిర్వహించనున్నట్లు తెలుస్తుంది ..వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ ఎన్నికలు మొదలు కానున్నాయి .. ఈసారి పంచాయతీ ఎన్నికల్లో ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తివేయనున్నట్లు సమాచారం .. రిజర్వేషన్లలో మార్పులు చేర్పులపై కూడా  తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది.Read More

Breaking News Slider Telangana Top News Of Today

మిష‌న్ భ‌గీర‌థపై ప్ర‌జ‌ల‌కు విశ్వాసం క‌లిగించాలి

మిషన్ భగీరథ ద్వారా స‌ర‌ఫ‌రా అవుతున్న తాగు నీటిపై ప్రజలకు విశ్వాసం, అవగాహన కల్పించేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని పంచాయ‌తీ రాజ్ గ్రామీణాభివృద్ది, గ్రామీణ మంచి నీటి స‌ర‌ఫ‌రా శాఖ మంత్రి డాక‌ర్ట్ ద‌న‌స‌రి అన‌సూయ సీత‌క్క అధికారుల‌ను ఆదేశించారు. వేల కోట్లు ఖర్చు చేసి మిష‌న్ భ‌గీర‌థ వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేసినా… ప్ర‌జ‌లు ఇంకా ఆర్వో ప్లాంట్లు, బోరు నీళ్ల పై ఆదార‌ప‌డ‌టం ప‌ట్ల ఆవేద‌న‌ వ్య‌క్తం చేసారు.తెలంగాణ స‌చివాల‌యంలో మంత్రి సీత‌క్క కార్యాల‌యంలో బుధ‌వారం నాడు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

మూసీ పునర్జీవంలో  సహకరించండి..!

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మూసీ పునరుజ్జీవంలో భాగంగా హైదరాబాద్ నగరంలోని ఈసా, మూసా నదుల సంగమ స్థలంలోని బాపూ ఘాట్ వద్ద గాంధీ సరోవర్ ప్రాజెక్టు అభివృద్ధి కోసం రక్షణ శాఖ పరిధిలోని 222.27 ఎకరాల భూమిని రాష్ట్రానికి బదిలీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ని విజ్ఞప్తి చేశారు. మ‌హాత్మాగాంధీ గారి చితాభ‌స్మాన్ని క‌లిపిన‌ చోట ఏర్పాటు చేసిన బాపూఘాట్‌ను ప్రపంచ స్థాయిలో గాంధీ తాత్విక‌త‌ను […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

వరంగల్‌లో విమానాశ్రయ ఏర్పాటుకు సహకరించండి.

తెలంగాణ రెండో రాజధాని నగరంగా అభివృద్ధి చెందుతున్న వరంగల్‌లో విమానాశ్రయ ఏర్పాటుకు అవసరమైన అనుమతులను మంజూరు చేయడంతో పాటు తక్షణం పనులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడుకి విజ్ఞప్తి చేశారు. ఆ విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన 253 ఎక‌రాల భూ సేక‌ర‌ణ‌ కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రూ.205 కోట్ల‌ను భార‌త విమాన‌యాన సంస్థ (AAI)కి అంద‌జేసినట్టు తెలిపారు.తెలంగాణలో విమానాశ్రయాల అభివృద్ధిపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

మహబూబ్ నగర్ లో రైతు పండగ..!

ఈనెల 28,29,30 తేదీల్లో మహబూబ్ నగర్ లో నిర్వహించే రైతు పండుగ విజయవంతంగా నిర్వహించడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు కలసి పనిచేయాలని రాష్ట్ర మంత్రులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు, శ్రీ జూపల్లి కృష్ణారావు, శ్రీ దామోదర్ రాజనర్సింహలు అన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఈనెల 28,29,30 తేదీలలో నిర్వహించే రైతు సదస్సు ఏర్పాట్లపై నేడు సచివాలయంలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఈ సంవత్సర కాలంలో రాష్ట్ర ప్రభుత్వం […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

చంద్రబాబు పాత్రలో నటించిన నటుడిపై కేసు నమోదు

ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన లక్ష్మీ s ఎన్టీఆర్ మూవీలో ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాత్రలో నటించిన ప్రముఖ నటుడు టాలీవుడ్ నటుడు శ్రీతేజ్ పై హైదరాబాద్ లోని కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ లో  కేసు నమోదైంది. తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఓ యువతి ఫిర్యాదు చేసింది. గతంలోనూ అతడిపై కేసు అదే పీఎస్ లో కేసు నమోదవ్వడం విశేషం . […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

వైసీపీ మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డిపై పోక్స్ కేసు..!

వైసీపీకి చెందిన సీనియర్ నేత.. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై పోక్స్ చట్టం కింద కేసు నమోదైంది. మైనర్ బాలికపై అత్యాచార యత్నం జరిగిందంటూ దుష్ప్రచార చేశారు. తమ పరువుకు భంగం కలిగించారంటూ వైసీపీ నేత.. చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై యర్రావారి పాలెం పోలీసులు పోక్స్ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ సంఘటనపై బాలిక తండ్రి ఆయనపై పోలీసులు ఫిర్యాదు చేశారు. బాలిక భవిష్యత్తును దెబ్బతీసే చర్యలకు పాల్పడ్డారని […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

యూట్యూబర్లకు హరీష్ రావు విన్నపం..!

యూసఫ్ గూడా పోలీసు పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన డిజిటల్ మీడియా ప్రీమియర్ లీగ్ జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పాల్గొన్నారు.. అనంతరం మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ డిజిటల్ యుగంలో ప్రతి రోజూ పోటీ ఉంటుంది. అందరూ కలిసి ఇక్కడ లీగ్ ప్రారంభించడం సంతోషంగా ఉంది. రాజకీయనాయకులు లాగానే మీరు ఎంతో శ్రమిస్తారు. ఇలాంటి గేమ్స్ వల్ల మీకు ఒత్తిడి తగ్గుతుంది. టెక్నాలజీ వల్ల పత్రికలు చదవటం, టీవీలు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డి పతనం మొదలయింది

చర్లపల్లి జైల్లో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కలిసి పరామర్శించిన కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ పేద, గిరిజన, బలహీన వర్గాల రైతుల తరఫున పోరాటం చేసిన పాపానికి జైలు పాలైన మా నరేందర్ రెడ్డి గారిని చర్లపల్లి జైల్లో పరామర్శించాం. రేవంత్ రెడ్డి కక్ష పూరిత వైఖరి కారణంగా చేయని తప్పుకు జైల్లో నరేందర్ రెడ్డి గారు శిక్ష అనుభవిస్తున్నారు.పట్నం నరేందర్ రెడ్డి గారిని కలిసినప్పుడు ఆయన […]Read More