Tags :break news

Breaking News Slider Telangana Top News Of Today

చేవెళ్ల ఘటన పై సీఎం రేవంత్ రెడ్డి    దిగ్భ్రాంతి

తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరు స్టేజ్‌ వద్ద కూరగాయలు అమ్ముకునే వారిపైకి లారీ దూసుకెళ్లిన ఘటనపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు సీఎం సంతాపం తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.Read More

Breaking News Movies Slider Top News Of Today

పుష్ప -2 రన్ టైం ఎంతో తెలుసా..?

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ హీరోగా.. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించిన పుష్ప -2 డిసెంబర్ ఐదో తారీఖున ప్రేక్షకుల ముందుకు రానున్నది..ఈ చిత్రానికి చెందిన సెన్సార్ సర్టిఫికెట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 3గంటల 20 నిమిషాల 38 సెకన్ల నిడివి కలిగిన ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ లభించింది. కొన్ని చోట్ల అశ్లీల పదాల తొలగింపు, ఓ హింసాత్మక సన్నివేశంలో మార్పు జరిగింది.. దీంతో పాటు […]Read More

Breaking News Slider Sports Top News Of Today

ఆస్ట్రేలియా పార్లమెంట్ లో రోహిత్ శర్మ ప్రసంగం

ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ని కలిసిన అనంతరం టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆ దేశ పార్లమెంటులో ప్రసంగించారు. ‘భారత్, ఆస్ట్రేలియా బంధానికి చాలా చరిత్ర ఉంది. ఆస్ట్రేలియా ప్రజలకు క్రికెట్ మీద ప్రేమ, పోటీ తత్వం చాలా ఎక్కువ. అందువల్ల ఇక్కడ క్రికెట్ ఆడటం అంత సులువు కాదు. గతవారం ఉన్న ఊపునే కొనసాగించాలని భావిస్తున్నాం. ఇక్కడి సంస్కృతిని కూడా ఆస్వాదిస్తున్నాం. చక్కటి ఆటతో అభిమానుల్ని అలరిస్తాం’ అని పేర్కొన్నారు.Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

డిసెంబర్ 4న ఏపీ క్యాబినెట్ మీటింగ్..!

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో  క్యాబినెట్ సమావేశం డిసెంబర్ 4వ తేదీన జరగనుంది. వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు జరగనుంది. రాష్ట్రంలో తాజా పరిస్థితులు, ఇసుక పాలసీ, కొత్త పథకాలు, రేషన్కార్డులు, అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్ సహా పలు అంశాలపై క్యాబినెట్ సమావేశంలో చర్చించనున్నారు.Read More

Breaking News Movies Slider Top News Of Today

నేను పారిపోలేదు -రామ్ గోపాల్ వర్మ..!

సోషల్ మీడియా లో పోస్టుల గురించి ఏపీ ప్రభుత్వం  తనపై పెట్టిన కేసుల విషయంలో ప్రముఖ వివాదాస్పద దర్శకుడు అర్జీవి ట్విటర్లో పాయింట్ల రూపంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నేను ఎక్కడికీ పారిపోలేదు. ఏడాది క్రితం చేసిన ట్వీట్లపై 2 వారాల క్రితం 4 వేర్వేరు జిల్లాల్లో కేసు పెట్టడం వెనుక ఏదో కుట్ర ఉందనేది నా అనుమానం. మీమ్స్ పై కేసులు పెట్టాలంటే దేశంలో సగంమందిపై కేసులుంటాయి. మీడియా కాల్స్ భరించలేకే ఫోన్ ఆపేశాను. చట్టాన్ని […]Read More

Breaking News Hyderabad Slider Telangana Top News Of Today

తెలంగాణ సాధకుడు కేసీఆర్..!

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను త్యాగం చేసేందుకు సిద్దపడ్డ గొప్ప నాయకుడు KCR అని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం దీక్షా దివస్ సందర్బంగా తెలంగాణ భవన్ లో నిర్వహించే కార్యక్రమం ఏర్పాట్లను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR, తలసాని శ్రీనివాస్ యాదవ్ శాసనమండలి లో ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారి, దీక్ష దివస్ హైదరాబాద్ జిల్లా ఇంచార్జి ఇంచార్జి పొన్నాల లక్ష్మయ్య, సికింద్రాబాద్, అంబర్ పేట, ముషీరాబాద్ MLA లు పద్మారావు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

మంత్రి సీతక్క బీఆర్ఎస్ పై ఆగ్రహం

“అబద్దాల పునాదులతో అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంది” అని దిలావార్ పూర్ లో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు అధికారులపై ఎదురుతిరిగిన నేపథ్యంలో మంత్రి ధనసరి అనసూయ బీఆర్ఎస్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు.. మీడియా తో మంత్రి సీతక్క మాట్లాడుతూ “దిలావార్ పూర్, గుండంపల్లి మధ్యలో ఇథానాల్ ఫ్యాక్టరీ పై కుట్ర జరుగుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం హాయాంలోనే ఇథానాల్ ఫ్యాక్టరీ కి అన్ని రకాల అనుమతులు వచ్చాయి. మా ప్రభుత్వం వచ్చాక మేము […]Read More

Breaking News National Slider Top News Of Today

లోక్ సభలో ఓ అరుదైన సంఘటన..!

గురువారం పార్లమెంట్ లో ఓ అరుదైన సంఘటన చోటుచేసుకోనుంది. ఒకే ఫ్యామిలీ నుంచి ముగ్గురు సభకు హాజరుకానున్నారు. ఇప్పటికే ఇద్దరు సభలో కొనసాగుతుండగా.. మరో సభ్యురాలు నేడు వచ్చి చేరనుంది. నెహ్రూ- గాంధీ ఫ్యామిలీ నుంచి ముగ్గురు పార్లమెంట్ లో అధికారికంగా ఆసీనులు కానున్నారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు తోడుగా వయనాడ్ ఉప ఎన్నికల్లో గెలిచిన ప్రియాంక గాంధీ గురువారం ప్రమాణ స్వీకారం చేసారు. సోనియా గాంధీ పెద్దల సభలో ఉండగా.. […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ఫుడ్ పాయిజన్ సంఘటనపై రేవంత్ రెడ్డి ఆగ్రహం

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు, వ‌స‌తిగృహాలు, గురుకుల విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్ధినీ విద్యార్థుల‌ను సొంత బిడ్డ‌ల్లా చూడాల‌ని, వారికి ప‌రిశుభ్ర‌మైన వాతావ‌ర‌ణంలో పౌష్టికాహారం అందించే విషయంలో ఎటువంటి అల‌క్ష్యానికి తావు ఇయ్యరాదని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి  అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్ల‌కు సూచించారు. బడి పిల్లలకు అందించే ఆహారానికి సంబంధించి ఘటనలు పునరావృతం కావడం పట్ల ఆగ్రహం వ్య‌క్తం చేసిన ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో ఉదాసీనంగా వ్య‌వ‌హ‌రించే అధికారులు, సిబ్బందిపై చ‌ర్య‌లు తీసుకుంటామని హెచ్చ‌రించారు. నిర్ల‌క్ష్యంగా […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

కుల సర్వేలో సీఎం రేవంత్ రెడ్డి..!

యావత్ దేశానికి మార్గాన్ని నిర్దేశిస్తూ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వేలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వివరాలు నమోదు చేయించుకున్నారు. హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ గారు, జీహెచ్ఎంసీ కమీషనర్ ఇలంబర్తి గారు, ఇతర అధికారులు, ఎన్యుమరేటర్లు, సిబ్బందితో కూడిన సర్వే బృందం జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ వివరాలను నమోదు చేసుకున్నారు. సర్వే పురోగతి వివరాలను, సర్వేలో పాల్గొన్న ప్రజల స్పందన గురించి […]Read More