ఈవీఎంల పనితీరుపై దేశవ్యాప్తంగా అనుమానాలు వ్యక్తమవుతున్నందున మెజార్టీ దేశాల్లో ఉన్నట్టుగా బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలకు ఎందుకెళ్లకూడదని వైసీపీ అధినేత.. ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ప్రజాస్వామ్యం గొప్పగా కనిపించడమే కాదు విజయవంతంగా కూడా ఉండాలని ట్వీట్ చేశారు. ప్రాథమిక హక్కయిన వాక్స్వాతంత్ర్యాన్ని అణచివేయడానికి జరుగుతున్న ప్రయత్నాలు ఆందోళనకరమన్నారు. 75వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేడ్కర్ దార్శనికతను ఆయన కొనియాడారు.ఈ వ్యాఖ్యలపై కూటమి నేతలు స్పందిస్తూ వైసీపీ 151సీట్లు గెలిచినప్పుడు ఈవీఎంలపై అనుమానం లేదా..?.గతం మరిచి […]Read More
Tags :BJP
మహారాష్ట్ర లో కాంగ్రెస్ కూటమి ఓటమిపై కంగనా సంచలన వ్యాఖ్యలు
శనివారం విడుదలైన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి 233స్థానాల్లో గెలుపొందిన సంగతి తెల్సిందే. మరోవైపు విపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ కూటమి కేవలం 51 స్థానాల్లోనే విజయభేరి మ్రోగించింది. ఈ విషయం గురించి ప్రముఖ నటి.. బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మట్లాడుతూ మహారాష్ట్రలో మహిళలను అగౌరవపరిచినందుకే మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) ఓటమి పాలైందని ఆరోపించారు. ఉద్ధవ్ ఠాక్రే దారుణమైన పరాజయాన్ని పొందుతారని తాను ముందే ఊహించినట్లు తెలిపారు. […]Read More
ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ పోటి చేసిన అన్ని ఎమ్మెల్యే.. ఎంపీ స్థానాల్లో గెలుపొంది పోటి చేసిన అన్ని స్థానాల్లో విజయంతో వందకు వందశాతం సక్సెస్ రేటును సాధించిన పార్టీగా అవతరించిన సంగతి తెల్సిందే.. తాజాగా విడుదలైన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి తరపున ప్రచారం చేసిన పదకొండు స్థానాల్లో ఆ కూటమి అభ్యర్థులే […]Read More
ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత అధికార కూటమి అయిన టీడీపీ కూటమికి 164, వైసీపీకి పదకొండు స్థానాలను ఓటర్లు కట్టబెట్టిన సంగతి తెల్సిందే. దీంతో అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ ఇప్పటివరకు చేయని ప్రయత్నం లేదు. అఖరికి కోర్టు మెట్లు కూడా వైసీపీ ఎక్కింది. ఇదే పరిస్థితి తాజాగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో చోటు చేసుకుంది. మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా దక్కాలంటే అసెంబ్లీలో ఉన్న మొత్తం సీట్లలో 10% గెలుచుకోవాలి. […]Read More
కర్ణాటక ఉపఎన్నికలో కాంగ్రెస్ రెండు చోట్ల విజయం సాధించింది. శిగ్గావ్లో బీజేపీ అభ్యర్థి భరత్ బొమ్మైపై కాంగ్రెస్ అభ్యర్థి యాసిర్ పఠాన్ గెలుపొందారు. మరోవైపు సందూర్లో కాంగ్రెస్ క్యాండిడేట్ అన్నపూర్ణ ఘన విజయం సాధించారు. దీనిపై ఈసీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మొత్తం మూడుచోట్ల ఉపఎన్నిక జరగ్గా చన్నపట్నలోనూ కాంగ్రెస్ అభ్యర్థి యోగీశ్వర ముందంజలో ఉన్నారు.Read More
కేరళలోని వయనాడ్ పార్లమెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంకా గాంధీ ఘన విజయం సాధించారు. ఆమె ఇప్పటికే 4,03,966 ఓట్ల మెజారిటీ సాధించారు. దీంతో ఆమె గెలుపు లాంఛనంగా మారింది. తర్వాతి స్థానాల్లో CPI, BJP ఉన్నాయి. గత ఎన్నికల్లో 3.64 లక్షల ఓట్ల మెజారిటీతో రాహుల్ MPగా గెలిచిన విషయం తెలిసిందే. ఆయన రాజీనామా చేయడంతో ఇక్కడ జరిగిన ఉప ఎన్నికలో తాజాగా ప్రియాంక గెలిచారు.మరోవైపు రెండో స్థానంలో సీపీఐ అభ్యర్థి సత్యవన్ నిలిచారు.Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైన ఆడబిడ్డల జోలికి వస్తే ఖబర్దార్..వదిలే ప్రసక్తేలేదుఆడబిడ్డల జోలికి వస్తే ఏం చేయాలో అది చేస్తామని అసెంబ్లీ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ఇంకా మాట్లాడుతూ రాష్ట్రంలోని గత ప్రభుత్వం వైపల్యంతోనే ప్రస్తుతం గంజాయి, డ్రగ్స్ కారణంగానే అఘాయిత్యాలు జరుగుతున్నాయి. తమ కూటమి ప్రభుత్వం గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకుంటుంది. రాష్ట్రంలో కరడుగట్టిన నేరస్తులకు స్థానం లేదు. ఎవరైన నేరాలు చేస్తే తాట తీస్తాము.. […]Read More
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి రక్షణగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ దళం మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్… మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. లగచర్ల ఘటన డైవర్శన్ కోసమే ఆ పార్టీకి చెందిన కేంద్ర మంత్రులు.. ఎంపీలు మూసీ నిద్ర అనే డ్రామాలకు తెర తీశారు. హైడ్రాను మొదట స్వాగతించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇప్పుడు మూసీ బాధితుల తరపున మాట్లాడటం విడ్డూరం. ఇప్పుడు ఆయనకు మూసీ బాధితుల ఆక్రందనలు ,ఆవేదన గుర్తుకు వచ్చాయా అని […]Read More
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులందరికీ సంక్రాంతి పండుగ నుండి సన్నబియ్యం పంపిణీ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ ” సన్నాలకు ఐదోందల రూపాయలు బోనస్ ప్రకటించడంతోనే సన్నాల సాగు ఎక్కువయింది. గతేడాది ఇరవై ఐదు లక్షల ఎకరాల్లో సాగు అయింది. ఈ సారి నలబై లక్షల ఎకరాల్లో సాగైంది. సంక్షేమ హాస్టల్లో […]Read More
గత సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీ నుండి టీడీపీలో చేరిన రఘురామ కృష్ణం రాజుకు కూటమి ప్రభుత్వం ప్రమోషన్ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఉండి నియోజకవర్గం నుండి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన్ని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా నియమిస్తున్నట్లు కూటమి ప్రభుత్వాధినేత.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. డిప్యూటీ స్పీకర్ పదవికోసం పలువురి ఎమ్మెల్యేల పేర్లను పరిశీలించిన అఖరికి ఆర్ఆర్ఆర్ ను చంద్రబాబు ఖరారు చేశారు. మరోవైపు ఈ పోస్టుకు ఎవరూ నామినేషన్లు […]Read More