Tags :BJP

Andhra Pradesh Slider

డిప్యూటీ సీఎంగా జనసేనాని

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి 164స్థానాల్లో.. అధికార వైసీపీ పార్టీ పదకొండు స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెల్సిందే. అయితే ఏపీ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఖరారు అయ్యారు. మరోవైపు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వంలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు ఇండియా టుడే వెల్లడించింది. అయితే రాష్ట్ర డిప్యూటీ సీఎం పదవిని తీసుకునేందుకు జనసేనాని తన సంసిద్ధత వ్యక్తం చేశారని తెలిపింది. నిన్న  ఆదివారం […]Read More

Andhra Pradesh Slider Videos

కేంద్రమంత్రిగా బీజేపీ వర్మ ప్రమాణ స్వీకారం

ఇటీవల విడుదలైన పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో ఏపీలోని నరసాపురం పార్లమెంట్ నుండి గెలుపొందిన బీజేపీ ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కేంద్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. దేశ రాజధాని మహానగరం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము భూపతిరాజు శ్రీనివాస వర్మతో ప్రమాణం చేయించారు. మరోవైపు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తొలిసారిగా ఎంపీగా గెలిచి మంత్రి పదవి దక్కించుకోవడం విశేషం.Read More

National Slider Telangana

కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కిషన్ రెడ్డి మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ “కేంద్రమంత్రి వర్గ కూర్పులో అన్ని రాష్ట్రాలకు సమన్యాయం చేశారు.. రాబోవు వందరోజుల ప్రణాళికల గురించి ప్రధానమంత్రి నరేందర్ మోదీ ఆలోచిస్తున్నారు. వచ్చే ఐదేండ్లలో పేదలకు మూడు కోట్ల ఇండ్లను నిర్మించి తీరుతాము. తెలంగాణలో సంస్థాగత మార్పులుంటాయి..బీజేపీ రాష్ట్ర అధ్యక్ష మార్పులుంటాయి..నన్ను కేంద్రమంత్రిగా నియమించిన ప్రధానమంత్రి నరేందర్ మోదీకి ధన్యవాదాలు” అని అన్నారు.Read More

National Slider Videos

మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం

భారత ప్రధానమంత్రిగా నరేందర్ మోదీ ప్రమాణ స్వీకారం చేశారు..ప్రధానమంత్రి నరేందర్ మోదీతో పాటు 72మంది కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో 30మందికి కేబినెట్ హోదా.. 5గురుకి సహాయక కేంద్ర మంత్రులు(స్వతంత్ర హోదా)..36మందికి సహాయక మంత్రులు ఉన్నారు. వీరిలో 43మందికి మూడు సార్లు మంత్రులుగా పని చేసిన అనుభవం ఉంది.ఇరవై ఆరు మందికి ఆయా రాష్ట్రాల మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉంది.Read More

Slider Telangana

కేంద్ర మంత్రులుగా బండి సంజయ్,కిషన్ రెడ్డి

ఇటీవల విడుదలైన పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి కిషన్ రెడ్డి,కరీంనగర్ నుండి బండి సంజయ్ భారీ మెజార్టీతో గెలుపొందిన సంగతి తెల్సిందే. అయితే తాజాగా వీరిద్దరికి కేంద్ర క్యాబినెట్ లో బెర్తు దొరికింది. కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయాల్సిందిగా పీఎంఓ కార్యాలయం నుండి వీరికి ఫోన్ కాల్స్ వెళ్లాయి. దీంతో వీరిద్దరూ ప్రధానమంత్రి నరేందర్ మోదీ నివాసంకు బయలుదేరి వెళ్లారు.మరోవైపు ఏపీ నుండి టీడీపీకి ఇద్దరు కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు..Read More

Slider Telangana

MLA గా పవన్ జీతం ఎంతో తెలుసా..?

ఏపీ సార్వత్రిక ఎన్నికల ప్రచారం సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి తాను ఎమ్మెల్యేగా పూర్తి జీతం తీసుకుంటానని జనసేనాని  చెప్పిన విషయం తెలిసిందే. భారీ మెజార్టీతో గెలుపొందిన జనసేనాని పవన్ కళ్యాణ్ జీతం ఎంతన్న చర్చ ప్రస్తుతం మీడియాలో జరుగుతోంది. ప్రస్తుతం ఏపీలోని ఒక్కో ఎమ్మెల్యేకు నెల జీతం రూ.3.35 లక్షలుగా ఉంది. ఇందులో నియోజకవర్గ అలవెన్స్ లతో పాటు ఇతర అలవెన్సులను అందులోనే కలిపారు. దీంతో పవన్ కూడా ఈ మొత్తాన్నే […]Read More

National Slider Videos

మోదీ కాళ్లను మొక్కబోయిన నితీష్ కుమార్-వీడియో

ఇటీవల విడుదలైన లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో ప్రస్తుత అధికార పార్టీ అయిన బీజేపీకి  సొంతంగా మెజార్టీ సీట్లు గెలవకపోవడంతో జేడీయూ పార్టీ కీలకంగా మారింది. మొత్తం12 మంది ఎంపీ సీట్లతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో కింగ్ మేకర్ స్థానంలో నిలిచింది. అయితే ఇవాళ ఎన్డీఏ పక్షాల భేటీలో బిహార్ సీఎం, జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ ప్రధాని మోదీ కాళ్లను మొక్కబోయారు. మోదీ వెంటనే అడ్డుకుని శుభాకాంక్షలు చెప్పారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. […]Read More

Andhra Pradesh Slider

వైసీపీపై వైరల్ అవుతున్న సెటైర్లు

ఈరోజు విడుదలైన ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో  కనివినీ ఎరుగని రీతిలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభంజనం సృష్టించింది. ఎంతలా అంటే ఫ్యాన్ సునామీనే.. వైనాట్ 175 దగ్గర్నుంచి ఘోరాతి ఘోరంగా ఓడిపోతున్న పరిస్థితి. కేవలం సింగిల్ డిజిట్‌లోనే అభ్యర్థులు గెలుస్తున్న పరిస్థితి. ఇప్పటి వరకూ పట్టుమని పది మంది కూడా గెలవని దుస్థితి వైసీపీకి రావడం గమనార్హం. ఆఖరికి వైఎస్ జగన్ రెడ్డి కంచుకోటగా ఉన్న వైఎస్సార్ కడప జిల్లాలో కూడా కూటమి దెబ్బకు వైసీపీ […]Read More

Andhra Pradesh Slider

బూతుల మంత్రులకు గట్టి షాకిచ్చిన ఏపీ ఓటర్లు

పదవిలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అణిగిమణిగి ఉంటూ నిత్యం ప్రజల్లో ఉంటూ సేవ చేసేవాళ్లనే ఓటర్లు ఓడించే రోజులు ఇవి. అలాంటిది పదవుల్లో ఉన్నామనో.. అధికారంలో ఉన్నామనో.. లేదా తాము మంత్రులమనో విర్రవీగుతూ బూతుల పురాణం చదివితే టైం వచ్చినప్పుడు బుద్ధి చెబుతారనడానికి ఏపీలో తాజాగా విడుదలైన సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన మంత్రుల సంఘటనలను చూస్తే ఆర్ధమవుతుంది. గత ఐదేండ్లలో మంత్రిగా పని చేసిన ఆర్కే రోజా, అంబటి రాంబాబు,సీదిరి అప్పలరాజు,జోగి రమేష్ లతో పాటు అనిల్ […]Read More

Andhra Pradesh Slider

చరిత్రకెక్కిన పవన్

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కూటమి హవా కొనసాగుతుంది.ఇప్పటివరకు కూటమి 163స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తుంది. మరోవైపు 19ఎంపీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నరు. రాష్ట్రంలో పిఠాపురం అసెంబ్లీ నుండి బరిలోకి దిగిన జనసేన అధినేత పవర్ స్టార్  పవన్‌కల్యాణ్‌ ఘన విజయం  సాధించారు. వైసీపీ అభ్యర్థి వంగా గీతపై 70,354 ఓట్ల మెజారిటీతో పవన్‌కల్యాణ్‌ గెలుపొందారుRead More