Tags :bignews

Breaking News Slider Telangana Top News Of Today

నాణ్యమైన విద్యతో పాటు స్కిల్స్..!

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో చదువుతోన్న విద్యార్థినీ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సాఫ్ట్ స్కిల్స్ నేర్పించే దిశగా కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  అధికారులకు సూచించారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని కన్హా గ్రామంలోని కన్హా శాంతివనాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి అక్కడ చిన్నారులు, విద్యార్థులకు నేర్పించే సాఫ్ట్ స్కిల్స్ కు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కళ్లకు గంతలు కట్టుకుని రంగులను గుర్తించడం, పదాలను చదవడం వంటి స్కిల్స్ ను ప్రదర్శించిన అక్కడి […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

టీడీపీ లోకి మాజీ డిప్యూటీ సీఎం..?

ఏపీ మాజీ మంత్రి, వైసీపీ  పార్టీ సీనియర్‌ నేత ఆళ్ల నాని అధికార తెలుగుదేశం పార్టీలోకి రావడానికి లైన్ క్లియర్ అయ్యింది. తెలుగు తమ్ముళ్లు బహిరంగంగా ఎంత వ్యతిరేకించిన చివరికి అధిష్టానం నిర్ణయానికి తలవంచక తప్పలేదు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొంత కాలానికే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పిన ఆయన.. టీడీపీలో చేరేందుకు సిద్ధం అయ్యారు.. అయితే, స్థానిక నేతలు తీవ్రంగా వ్యతిరేకించడంతో.. అప్పుడు తాత్కాలికంగా వాయిదా పడినా.. ఇప్పుడు టీడీపీ గ్రీన్‌ సిగ్నల్‌ […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

ఏపీ కి జీవనాడి పోలవరం..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి అయిన బహుళార్థక సాధక పోలవరం ప్రాజెక్టును గత ప్రభుత్వం అసమర్థ నిర్ణయాలు, అహంకారం, నిర్లక్ష్యంతో జీవశ్చవంగా మార్చింది. పోలవరానికి మళ్లీ జీవం పోసేందుకు కూటమి ప్రభుత్వ ఏర్పాటు తరువాత సిఎంగా నా తొలి పర్యటన లో ప్రాజెక్టు వద్దకే వెళ్లాను. నాటి నుంచి గత 6 నెలలుగా పోలవరం చుట్టూ ముసురుకున్న సమస్యలు పరిష్కరించేందుకు పెద్ద ఎత్తున కృషి చేశామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. సోమవారం ఆయన పోలవరం ప్రాజెక్టును […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రాబోయే 3 రోజులు జాగ్రత్త..!!

రాబోయే మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయని, 2 నుంచి 8 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గిపోయినట్టు తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్‌, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలతో పాటు కామారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి, నిజామాబాద్‌, సిద్ధిపేట, రంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలో లోపు నమోదైనట్టు పేర్కొంది. జైనద్, భీంపూర్ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో ఒకటే డైట్..!

తెలంగాణ వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులందరికీ ఒక విధమైన ఆహారం అందించాలన్న సంకల్పంలో చేపట్టిన కామన్ డైట్ మెనూ నేటి నుంచి ప్రారంభమైంది. చేవెళ్ల నియోజకవర్గం చిలుకూరు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కామన్ డైట్‌ను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.రాష్ట్ర వ్యాప్తంగా కామన్ మెనూ డైట్ కార్యక్రమం జరగ్గా, చిలుకూరులో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి  అక్కడ పలువురు విద్యార్థులతో ముచ్చటించారు. ఈ స్కూల్ నుంచి ప్రతిభ కనబరిచి ఐఐటీ […]Read More

Breaking News Movies Slider Telangana Top News Of Today

మోహన్ బాబు చేసిన తప్పు అదే..!

తమను అమితంగా ప్రేమించడమే తన తండ్రి మోహన్ బాబు చేసిన తప్పు అని మంచు విష్ణు అన్నారు. ‘ప్రతి ఇంటిలోనూ సమస్యలు ఉంటాయి. మా సమస్యను పరిష్కరించేందుకు పెద్దలు ప్రయత్నిస్తున్నారు. మా ఇంటి గొడవను మీడియా సెన్సేషన్ చేస్తోంది. అలా చేయొద్దని వేడుకుంటున్నా. మా నాన్న ఉద్దేశపూర్వకంగా జర్నలిస్టును కొట్టలేదు. ఆ జర్నలిస్టు కుటుంబంతో మేం టచ్లో ఉన్నాం. వారికి చెప్పాల్సింది చెప్పేశాం’ అని ఆయన వ్యాఖ్యానించారు.Read More

Breaking News Slider Telangana Top News Of Today

రైతుభరోసాపై కీలక నిర్ణయం..!

గత సార్వత్రిక ఎన్నికల్లో రైతులకిచ్చిన హామీల అమల్లో భాగంగా రైతు భరోసా కోసం అవసరమైన నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి సమకూరినట్లు తెలుస్తోంది. రూ.10 వేల కోట్లు ఇచ్చేందుకు ఐసీఐసీఐ బ్యాంకు అంగీకరించినట్లు సమాచారం. కోకాపేట, రాయదుర్గంలోని TGIICకి చెందిన 400 ఎకరాల భూములను తాకట్టు పెట్టినట్లు తెలుస్తోంది. ఆడిటింగ్ పూర్తి చేసి ఆర్బీఐ ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. ఇందులో రూ.8 వేల కోట్లు రైతుభరోసాకు, రూ.2 వేల కోట్లు పదవీ విరమణ ఉద్యోగుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం […]Read More

Breaking News National Slider Top News Of Today

మాజీ సీఎం కన్నుమూత..!

కర్ణాటక మాజీ సీఎం, కేంద్ర మాజీ మంత్రి SM కృష్ణ (92) కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తెల్లవారుజామున బెంగళూరులోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. కృష్ణ 1989-1993 మధ్య అసెంబ్లీ స్పీకర్, 1993-94లో కర్ణాటక మొదటి డిప్యూటీ సీఎం, 1999 నుంచి 2004 వరకు సీఎంగా పని చేశారు.. ఆ తర్వాత 2004 నుంచి 2008 వరకు మహారాష్ట్ర గవర్నర్, 2009 నుంచి 2012 వరకు విదేశాంగ మంత్రిగా ఆయన పనిచేశారు.Read More