వైసీపీ అధినేత.మాజీ సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది.. ఐదేళ్ల గడువుతో ఆయనకు పాస్ పోర్టును మంజూరు చేయాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. గత ఏడాది సెప్టెంబరు 20న జగన్ పాస్ పోర్టుకి సంబంధించిన గడువు ముగిసింది. తన కుమార్తె డిగ్రీ ప్రదానోత్సవ కార్యక్రమానికి విదేశాలకు వెళ్లే కార్యక్రమం ఉంది. దీంతో పాస్ పోర్టుకు ఎన్ఓసీ ఇచ్చేలా ఆదేశించాలన్న ఆయన విజ్ఞప్తిని ప్రజాప్రతినిధుల కోర్టు తోసిపుచ్చింది. దీంతో హైకోర్టును ఆశ్రయించగా జగన్ కు […]Read More
Tags :bignews
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఓటర్ల జాబితా ను తాజాగా ప్రకటించారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,35,27,925 గా ఉండగా అందులో పురుషు ఓటర్ల సంఖ్య 1,66,41,489 గా ఉంది.ఆలాగే రాష్ట్రంలో మహిళా ఓటర్లు 1,68,67,735 మంది ఉన్నారు .. థర్డ్ జండర్ ఓటర్లు మాత్రం 2,829 మంది ఉన్నారు.అదే విధంగా రాష్ట్రంలో యువ ఓటర్లు అంటే 18 నుండి 19 సంవత్సరాల వయస్సు ఉన్న ఓటర్లు 5,45,026 మంది […]Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన సీఎస్ గా విజయానంద్ పేరు ఖరారైంది. ఆయన్ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతమున్న సీఎస్ నీరభ్ కుమార్ పదవీ కాలం ఈ నెల 31తో ముగియనుండటంతో ప్రభుత్వం కొత్త సీఎసన్ను నియమించింది. కాగా 1992 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారి అయిన విజయానంద్ ప్రస్తుతం ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.Read More
ఈ ఏడాది చివరి ‘మన్ కీ బాత్’ లో ప్రధాని నరేంద్ర మోదీ దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు పేరును ప్రస్తావించారు. తెలుగు సినిమాకు ఆయన చేసిన కృషిని కొనియాడారు. తన సినిమాలలో భారతీయ సంప్రదాయాలు, విలువలను చూపిస్తూ టాలీవుడ్ ను మరో స్థాయికి తీసుకెళ్లారని ప్రశంసించారు. ప్రతి నెలా చివరి ఆదివారం ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమం నిర్వహిస్తారనే విషయం తెలిసిందే. తాజా ఎపిసోడ్ లో మోదీ సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడారు. […]Read More
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో చదువుతోన్న విద్యార్థినీ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సాఫ్ట్ స్కిల్స్ నేర్పించే దిశగా కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని కన్హా గ్రామంలోని కన్హా శాంతివనాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి అక్కడ చిన్నారులు, విద్యార్థులకు నేర్పించే సాఫ్ట్ స్కిల్స్ కు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కళ్లకు గంతలు కట్టుకుని రంగులను గుర్తించడం, పదాలను చదవడం వంటి స్కిల్స్ ను ప్రదర్శించిన అక్కడి […]Read More
ఏపీ మాజీ మంత్రి, వైసీపీ పార్టీ సీనియర్ నేత ఆళ్ల నాని అధికార తెలుగుదేశం పార్టీలోకి రావడానికి లైన్ క్లియర్ అయ్యింది. తెలుగు తమ్ముళ్లు బహిరంగంగా ఎంత వ్యతిరేకించిన చివరికి అధిష్టానం నిర్ణయానికి తలవంచక తప్పలేదు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొంత కాలానికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పిన ఆయన.. టీడీపీలో చేరేందుకు సిద్ధం అయ్యారు.. అయితే, స్థానిక నేతలు తీవ్రంగా వ్యతిరేకించడంతో.. అప్పుడు తాత్కాలికంగా వాయిదా పడినా.. ఇప్పుడు టీడీపీ గ్రీన్ సిగ్నల్ […]Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి అయిన బహుళార్థక సాధక పోలవరం ప్రాజెక్టును గత ప్రభుత్వం అసమర్థ నిర్ణయాలు, అహంకారం, నిర్లక్ష్యంతో జీవశ్చవంగా మార్చింది. పోలవరానికి మళ్లీ జీవం పోసేందుకు కూటమి ప్రభుత్వ ఏర్పాటు తరువాత సిఎంగా నా తొలి పర్యటన లో ప్రాజెక్టు వద్దకే వెళ్లాను. నాటి నుంచి గత 6 నెలలుగా పోలవరం చుట్టూ ముసురుకున్న సమస్యలు పరిష్కరించేందుకు పెద్ద ఎత్తున కృషి చేశామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. సోమవారం ఆయన పోలవరం ప్రాజెక్టును […]Read More
రాబోయే మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయని, 2 నుంచి 8 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గిపోయినట్టు తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలతో పాటు కామారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, నిజామాబాద్, సిద్ధిపేట, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలో లోపు నమోదైనట్టు పేర్కొంది. జైనద్, భీంపూర్ […]Read More