Tags :big news

Slider Telangana

తెలంగాణ లో మరో ఎన్నికల సమరం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో నిన్న శుక్రవారం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సమావేశంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే సర్పంచుల పదవీకాలం ముగిసి ఆరు నెలలు కావస్తున్నందున రిజర్వేషన్లలో ఎలాంటి మార్పు లేకుండా గత రిజర్వేషన్లలే కొనసాగించాలి. ఆగష్టు నెలలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో మంత్రి సీతక్కతో పాటు అధికారులు పాల్గొన్నారు.Read More

Slider Telangana Top News Of Today

మంత్రి పొంగులేటి కి నిరసన సెగ

ఖమ్మం జిల్లా నెలకొండపల్లి పర్యాటనలో ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. ఇందిరమ్మ ఇండ్లు ఎప్పుడు ఇస్తారని మంత్రి పొంగులేటిని ఓ మహిళా నీలదీసిన వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది..Read More

Andhra Pradesh Slider

మదనపల్లె సంఘటనలో బిగ్ ట్విస్ట్

మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దగ్ధంపై సంచలన విషయాలను  డీజీపీ ద్వారకా తిరుమలరావు బయటపెట్టారు. అయన మీడియా తో మాట్లాడుతూ “మదనపల్లె ఘటన ప్రమాదం కాదు. గత రాత్రి 11:30 గంటలకు అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదం పలు అనుమానాలకు తావిస్తోంది. ఘటన ప్రమాదవశాత్తు జరిగింది కాదు. రాత్రి ప్రమాదం జరిగితే వెంటనే కలెక్టర్‌కు సమాచారం ఇవ్వలేదు. ఆర్డీవో ఆఫీస్‌‌లో కీలక ఫైల్స్ ఉన్న విభాగంలో అగ్నిప్రమాదం జరిగింది. ఆర్డీవో కార్యాలయం కిటికీ బయట అగ్గిపుల్లలు కనిపించాయి. […]Read More

Andhra Pradesh Slider

మదనపల్లె ఘటనపై బాబు సమీక్ష

అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్‌లో అగ్నిప్రమాదం ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు .. ఈ సమావేశంలో అసైన్డ్ భూముల ఫైల్స్ దగ్ధం అయినట్లు ప్రాథమిక సమాచారం ముఖ్యమంత్రి కి అందజేశారు .. అసైన్డ్ 22-A, కోర్టు కేసుల ఫైల్స్, భూముల రీసర్వే ఫైల్స్ దగ్ధం అయినట్లు సీఎం చంద్రబాబుకు  అధికారులు వివరించారు .అయితే ఈ  ఘటనపై అధికారులు స్పందించకపోవడంపై సీఎం చంద్రబాబు ఆగ్రహన్ని వ్యక్తం చేశారు .. నిన్న రాత్రి 10.30 వరకు […]Read More

Crime News Slider

సొంత ఇంట్లో దొంగతనం కేసులో ట్విస్ట్

నిర్మల్ – మహాదేవపూర్ కాలనీలో అనితా రాణి, సావ్లా శివ దంపతులు ఉంటున్నారు.. స్కూల్ టీచర్ గా పనిచేస్తున్న భార్యను స్కూల్లో దింపిన శివ సాంబ్లే సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి తీసుకువచ్చాడు. అయితే, అప్పటికే ఇంటి తాళం పగల కొట్టి డోర్ ఓపెన్ చేసి ఉంది. బీరువాలో వస్తువులు చిందరవందరగా పడి ఉండి, ఎనిమిది తులాల బంగారు ఆభరణాలు, మరికొన్ని వెండి ఆభరణాలు, డబ్బులు కనిపించలేదు. దీంతో చోరీ జరిగినట్టు నిర్ధారించుకొని ఇద్దరూ కలిసి పోలీస్ […]Read More

Crime News Slider

ఇంటికి పిలిచి.. మహిళను…?

మంథని- ముత్తారం మండల కేంద్రానికి చెందిన పెరుక రాజేశ్వరి(60) ఈ నెల 5 నుంచి కనిపించకుండా పోయింది.ఇంట్లో ఒంటరిగా ఉంటుండటంతో ఈ విషయాన్ని ఎవరూ గుర్తించలేదు. 8న పారుపల్లి శివారులోని వ్యవసాయ బావిలో గోనె సంచిలో కట్టి పడేసిన గుర్తు తెలియని మహిళ శవాన్ని రైతు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఈ నెల 14న రాజేశ్వరి కనిపించడం లేదని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు చెప్పిన ఆనవాళ్ల ప్రకారం మృతురాలిని రాజేశ్వరిగా గుర్తించి […]Read More

Lifestyle Slider

లక్ష దాటిన వెండి

ఈరోజుల్లో బంగారం వెండి అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరూ ఉండరు . చేతికి లేదా మెడలో బంగారం లేదా వెండి ఆభరణాలను తప్పనిసరిగా ధరిస్తుంటారు . ఈరోజు వెండి ఏకంగా లక్ష రూపాయలు దాటింది. హైదరాబాద్ లో కేజీ వెండి లక్ష కు చేరింది..కేవలం మూడు రోజుల్లోనే వెండి ఐదు వేల రూపాయలకు చేరింది.Read More

Crime News Slider Telangana

గురుకుల ప్రిన్సిపాల్ పై సరస్వతి బంధువులు దాడి

సూర్యాపేట – పెన్ పహాడ్ మండలం దోసపహాడ్ బీసీ బాలికల గురుకుల పాఠశాల హాస్టల్లో అనుమానాస్పద  ఐదవ తరగతి విద్యార్థిని కొంపల్లి సరస్వతి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. తమ కూతురుకు జ్వరంగా ఉందని తీసుకెళ్ళమని చెప్పి అంతలోనే సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తున్నాము.. అక్కడికి రమ్మని స్కూల్ ప్రిన్సిపాల్ చెప్పారు. అక్కడికి వెళ్లే వరకే తమ కూతురూ చనిపోయి ఉందని కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు..ఈ క్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్‌పై దాడికి దిగారు .. […]Read More

Slider Telangana

2వేల కోట్లతో రైల్వే స్టేషన్లు అభివృద్ధి

మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్  మేడ్చల్ రైల్వే స్టేషన్, ఆర్వోబీ పనులను పరిశీలించారు. అనంతరం రైల్వే ఉన్నతాధికారులతో ఈటల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో అయన మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో రాష్ట్రంలో రూ.2 వేల కోట్లతో రైల్వే స్టేషన్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు.Read More

Slider Telangana Top News Of Today

ఆ ఎమ్మెల్యే మా పార్టీలోకి వస్తే దూకేస్తా- సెల్ టవర్ ఎక్కి కాంగ్రెస్

గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారనే ప్రచారం జోరందుకుంది. ఈ క్రమంలో నియోజకవర్గంలో జడ్పీ చైర్ పర్సన్ సరిత అభిమానులు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నిరసన చేపడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవొద్దంటూ ఆందోళన చేపట్టారు. సరితా తిరుపతయ్యకు ఆ పార్టీ నాయకులు వినతిపత్రాలు అందజేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని నల్లగుంట ప్రాంతంలో సరితాతిరుపతయ్య అభిమాని ప్రసాద్ (25) ఏకంగా సెల్ టవర్ ఎక్కి నిరసన వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశాడు. […]Read More