నేడు అమరావతిలోని సచివాలయంలో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీతో టీడీపీ చీఫ్ సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం జరగనున్నది… బాబు అధ్యక్షతన సచివాలయంలో 12 గంటలకు ఈ సమావేశం జరుగుతుంది .. ఈ సమావేశంలో వ్యవసాయ రుణాలు, సంక్షేమ పథకాల అమలు, రుణ లక్ష్యాలపై చర్చించనున్నారు .. గృహ నిర్మాణం కోసం గతంలో తీసుకున్న రుణాలపై చర్చించే అవకాశం ఉందని సమాచారం..Read More
Tags :aptdp
తెలంగాణ గడ్డపై టీడీపీ కి పూర్వ వైభవం వస్తుందా…?
హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వేదికగా ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ “గత ఎన్నికల్లో టీడీపీ గెలుపులో తెలంగాణ ప్రాంత టీడీపీ కి చెందిన నాయకులు… కార్యకర్తలు.. అభిమానుల పాత్ర మరువలేనిది.. తెలంగాణలో పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తాను.. ఈ గడ్డపై పుట్టిన పార్టీ.. తెలుగు రాష్ట్రాలున్నంత కాలం ఉంటుంది.. నాకు ఏపీ తెలంగాణ రెండు కండ్లు ” అని వ్యాఖ్యానించిన సంగతి తెల్సిందే… మరి తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం […]Read More
హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఏపీ ముఖ్యమంత్రి… టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ అభివృద్ధి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.. అయన మాట్లాడుతూ తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ మొదటిస్థానంలో ఉంది.పెద్ద రాష్ట్రాలు గుజరాత్, మధ్యప్రదేశ్‌ను దాటుకొని తెలంగాణ అగ్రభాగాన ఉందని అన్నారు.Read More
ఇటీవల జరిగిన ఏపీ సార్వత్రికా ఎన్నికలలో ఉండి నియోజకవర్గం నుంచి గెలుపొందిన రఘురామ కృష్ణం రాజు తన నియోజకవర్గ అభివృద్ధి కోసం Drainage Maintenance Infrastructure Fund, పేరిట ఏర్పాటు చేసిన సంస్థకు రావు రమేష్ రూ. 3 లక్షలు విరాళంగా అందచేశారు. తన సంపాదనలో కొంత సమాజ సేవకు వినియోగించే రావు రమేష్.. ఆయన చేసే సేవ గురించి బయటకు తెలియనివ్వరు. ఇది ఇండస్ట్రీలో ఆయనకు దగ్గరకు ఉండేవారికి మాత్రమే తెలిసిన విషయం. ఇప్పుడు కూడా […]Read More
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని గుంటూరు జిల్లా పెనుమాకలో రేపు సోమవారం పర్యటించనున్నారు. రేపు ఉ.5.45 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయల్దేరి 6 గంటలకు పెనుమాక చేరుకుంటారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఎస్టీ కాలనీలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి నేరుగా సీఎం పెన్షన్లు పంపిణీ చేస్తారు. తదనంతరం పెనుమాక మసీదు సెంటర్లో ప్రజావేదిక కార్యక్రమంలో లబ్ధిదారులు, ప్రజలతో బాబు ముచ్చటించనున్నారు. ఆ తర్వాత ఉండవల్లిలోని నివాసానికి అయన చేరుకుంటారు.Read More
లోక్ సభ స్పీకర్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమ పార్టీకి చెందిన ఎంపీలంతా పాల్గోనాలని టీడీపీ విప్ జారీ చేసింది.. ఈరోజు ఉదయం బుధవారం పదకొండు గంటల నుండి సభలో ఉండాలి..ఎన్డీయే సూచించిన అభ్యర్థికి ఓటు వేయాలి అని సూచిస్తూ మంగళవారం పార్టీ చీఫ్ విప్ హారీష్ బాలయోగి విప్ జారీ చేశారు.. మరోవైపు బుధవారం ఉదయం తొమ్మిదిన్నరకు పార్లమెంటరీ సమావేశంలో ఎంపీలకు ఓటింగ్ పై అవగాహన కల్పించనున్నారు టీడీపీ నేత శ్రీకృష్ణదేవరాయలు..Read More
ఏపీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం పింఛన్ లబ్ధిదారులకు శుభవార్త తెలిపింది.. ఇందులో భాగంగా గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పెంచిన మొత్తంతో జులై 1న రూ.7,000 పింఛన్ అందజేయనున్నట్లు టీడీపీ తన అధికారక ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. రూ.వెయ్యి పెంచగా అయిన రూ.4000, గత 3 నెలల పెంపు రూ.3000 కలిపి లబ్ధిదారుల ఇంటివద్దకే వెళ్లి ఇవ్వనున్నట్లు ఎక్స్ లో పేర్కొంది. కొత్త పాసు పుస్తకాలతో పింఛన్ […]Read More
ఏపీ రాష్ట్ర డిప్యూటీ సీఎం..పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ..అటవీశాఖ మంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నుముఖ్యమంత్రి .. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నియమించిన సంగతి తెల్సిందే. ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబుతో కల్సి కేసరపల్లిలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు జనసేనాని. అయితే ఈ నెల 19న రాష్ట్ర డిప్యూటీ సీఎంగా.. గ్రామీణాభివృద్ధి ,పర్యావరణ అటవీశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు పవన్ కళ్యాణ్Read More
ఇటీవల జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ అధినేత… మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ఎన్నికల తర్వాత వైసీపీ శ్రేణులపై రాష్ట్ర వ్యాప్తంగా దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ.. మాజీ ఎమ్మెల్యే.. ఎమ్మెల్సీ.. ఎంపీ.. స్థానిక ప్రజాప్రతినిధులతో కల్సి కమీటీలు వేసిన జగన్ తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అధికార టీడీపీ పార్టీ శ్రేణుల […]Read More
ఏపీ మంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. కేసరపల్లిలో గవర్నర్ అబ్దుల్ నజీర్ జనసేనానితో పదవీ ప్రమాణం చేయించారు. ఈ సమయంలో సభా ప్రాంగణం జై పవన్ నినాదాలతో మార్మోగింది. ప్రమాణం అనంతరం ప్రధాని, అమిత్ షా సహా వేదికపై ఉన్న అతిథులకు నమస్కరించారు. అనంతరం పవన్ తన అన్నయ్య చిరంజీవి ఆశీర్వాదం తీసుకుని ఆయన పట్ల తనకున్న అభిమానం మరోసారి చాటుకున్నారు.Read More