Tags :anumula revanth reddy

Breaking News Slider Telangana Top News Of Today

సంక్షేమం..అభివృద్ధి ప్రభుత్వానికి రెండు కళ్లు..!

సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వానికి రెండు కళ్ల లాంటివని, ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇండ్ల వంటి కీలకమైన నాలుగు సంక్షేమ పథకాల అమలులో జిల్లా కలెక్టర్లు క్రియాశీల పాత్రను పోషించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  చెప్పారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో ముఖ్యమంత్రి  అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం జరిగింది. తెలంగాణలోని వ్యవసాయ యోగ్యమైన భూములకు ఎకరాకు రూ.12 వేల చొప్పున రైతు భరోసా […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

స్మృతి వనంగా ఇంద్రవెల్లి అమరుల స్తూపం..!

డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో ఆదివాసీ సంఘాలు, ప్రజా ప్రతినిధులతో ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు..ఈ సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ “నేను పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పుడు మొట్టమొదటి సభ ఇంద్రవెల్లిలోనే పెట్టాము..ఇంద్రవెల్లి అమరుల స్తూపాన్ని స్మృతి వనంగా మార్చాలని, అమరుల కుటుంబాలకు ఇండ్లు మంజూరు చేయాలని చర్చించుకున్నాము.. అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని పూర్తి చేసుకున్నాము..రాజకీయంగానూ ఆదివాసీలకు న్యాయం చేస్తూ ముందుకు వెళుతున్నాము.. ఆదివాసీల విద్య, ఉద్యోగ, ఆర్ధిక […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

పర్మిషన్ సీఎం..!.మళ్లీ సరెండర్..?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన నేపద్యంలో కొత్త అంశం తెరపైకి వచ్చింది.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్పీఫెన్ సన్ ను 50 లక్షల కు ఓటును కొనుగోలు చేస్తూ బ్యాగుతో దొరికి ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి ఇరుక్కోవటం,దాని వెనక చంద్రబాబు నాయుడు ఉన్నాడు అని చర్చ జరగడం తెలిసిందే. రెండు రాష్ట్రాలను షేక్ చేసిన సంఘటన అది..ఓటుకు నోటు కేసులో రేవంత్ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ఆధునీక సాంకేతిక పద్ధతుల్లో వరంగల్ విమానాశ్రయం.!

వ‌రంగ‌ల్ మ‌హాన‌గ‌రంగా ఎదగడానికి వీలుగా విమానాశ్ర‌యానికి రూప‌క‌ల్ప‌న చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి  సూచించారు. వ‌రంగ‌ల్ (మామునూరు) విమానాశ్ర‌య భూ సేక‌ర‌ణ‌, ఇత‌ర ప్ర‌ణాళిక‌ల‌పై ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (ICCC)లో ముఖ్య‌మంత్రి  స‌మీక్ష నిర్వ‌హించారు.ఆయా దేశాల పెట్టుబ‌డులు ఆక‌ర్షించేలా వ‌రంగ‌ల్ విమానాశ్ర‌యం ఉండాల‌ని, ద‌క్షిణ కొరియాతో పాటు ప‌లు దేశాలు త‌మ పెట్టుబ‌డుల‌కు విమానాశ్ర‌యాలను ప్రాధాన్యంగా ఎంచుకుంటున్నాయ‌ని ముఖ్య‌మంత్రి గారు వివరించారు. కొచ్చి విమానాశ్ర‌యం అన్ని వ‌స‌తుల‌తో ఉంటుంద‌ని, దానిని ప‌రిశీలించాల‌ని ముఖ్య‌మంత్రి అధికారుల‌కు […]Read More

Breaking News Hyderabad Slider Top News Of Today

ఫ్యూచర్ సిటీతో ఓ గొప్ప నగరానికి శ్రీకారం..!

ఫ్యూచర్ సిటీ పేరుతో దేశంలోనే ఒక గొప్ప నగరాన్ని నిర్మించాలన్నది తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. న్యూయార్క్, లండన్, టోక్యో, సియోల్, దుబాయ్ లాంటి ప్రపంచ నగరాలతో పోటీ పడాలన్న ప్రభుత్వ ఆకాంక్షకు అనుగుణంగా పెట్టుబడులతో ముందుకు రావాలని పారిశ్రామిక వేత్తలకు ఆహ్వానం పలికారు. హైదరాబాద్‌లోని గ్రీన్ బిజినెస్ సెంటర్‌లో జరిగిన భారత పరిశ్రమల సమాఖ్య (CII) జాతీయ కౌన్సిల్ సమావేశంలో ముఖ్యమంత్రి  ప్రసంగిస్తూ, పారిశ్రామికాభివృద్ధిలో తెలంగాణ ప్రభుత్వ లక్ష్యాలను వివరించారు. తెలంగాణలో […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

డిపెన్స్ లోకి సీఎం రేవంత్ రెడ్డి..?

తెలంగాణ ముఖ్యమంత్రి ఏడాది పాలన ముగిసింది. ఏడాది పాలనలో పూర్తి దూకుడుగా కనిపించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రతిపక్షమే టార్గెట్ గా అరెస్ట్ లు,కేసులతో ఏడాది పాలన సాగింది. దూకుడు స్వభావంతో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వాడకూడని భాషను సైతం గత ఏడాది కాలంలో ప్రయోగించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వం చేపట్టి హైడ్రా,లగచర్ల భూసేకరణ,రైతులను జైల్లో పెట్టడం,ఏక్ పోలీస్ ఏక్ విధానం కోసం కోట్లాడిన కానిస్టేబుల్స్ కుటుంబసభ్యులను సైతం నడిరోడ్డుపైకి లాగడం లాంటి విషయాల్లో తీవ్ర […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ ఏడాది పాలన- పథకాల కోతలు. కాదంటే కేసులు..!

హైదరాబాద్ తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీ డైరీ 2025 ఆవిష్కరణ కార్యక్రమం సందర్బంగా మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ ” డైరీ ఆవిష్కరణ కార్యక్రమాలు తెలంగాణ ఉద్యమ సభలుగా విలసిల్లినయి, ఉద్యమానికి గొప్ప ఊతమిచ్చాయి. ఈ డైరీ తిరగేస్తుంటే 14 ఏండ్ల ఉద్యమ ప్రస్థానం, మన పార్టీ సాధించిన విజయాలు కళ్లముందు కనిపిస్తున్నాయి. ప్రతి పార్టీ నాయకుడు, కార్యకర్తలు ఈ డైరీని తమ దగ్గర ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆనాటి డైరీ ఆవిష్కరణ […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

ఫార్ములా ఈ” రేసు “లో గెలిచింది కేటీఆరా.?. రేవంతా..?

ఫార్ములా ఈ రేసు కారు వివాదం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలతో పాటు యావత్తు దేశ రాజకీయాలనే తమవైపు తిప్పుకున్న హాట్ టాఫిక్. ప్రస్తుతం ఈ కేసు ఏసీబీ విచారణలో ఉంది కాబట్టి కాసేపు ఆ అంశాన్ని పక్కనెడదాము. అసలు ఈ వివాదంలో పైచేయి ఎవరిది మాజీ మంత్రి కేటీఆర్ దా..?. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదా..?. ఇప్పుడు చూద్దాము. ఈ అంశం తెరపైకి వచ్చిన దగ్గర నుండి ముఖ్యమంత్రి దగ్గర నుండి అధికార పార్టీ నేతలందరూ ముక్తకంఠంగా […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణలో ఆరోగ్య శ్రీ సేవలు బంద్..!

తెలంగాణ రాష్ట్రంలో ఎల్లుండి శుక్రవారం పదో తారీఖు నుండి ఆరోగ్య శ్రీ సేవలు బంద్ కానున్నట్లు తెలుస్తోంది. తమకు పెండింగ్ లో ఉన్న బకాయిలను చెల్లించకపోతే ఈ సేవలను నిలిపేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్య సంఘం తేల్చి చెప్పినట్లు సమాచారం. గత ఏడాదిగా ఆరోగ్య శ్రీ,ఈహెచ్ఎస్ ,జేహెచ్ఎస్ కింద రూ.100కోట్ల బకాయిలు పెండింగ్ లో ఉన్నట్లు వాళ్లు తెలిపారు. దీంతో ఏడాదిగా ఆసుపత్రులు నడిపే పరిస్థుతులు లేకుండా పోయాయని వారు వాపోతున్నారు. ఇప్పటికైన ప్రభుత్వం […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

నువ్వు మగాడివైతే..?- రేవంత్ కి కేటీఆర్ సవాల్..!

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. హైకోర్టులో తన క్వాష్ పిటిషన్ ను కొట్టివేయడంతో నందినగర్ లో బీఆర్ఎస్ నేతలతో.. తన లీగల్ టీమ్ తో ఆయన సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ” ఈ కేసు లొట్ట పీసు కేసు. ఫార్ములా ఈ రేసు కారు వ్యవహారంలో అవినీతి జరిగింది అని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశంపై […]Read More