తాము ఎవరికీ భయపడేది లేదు.. ఎస్సీ వర్గీకరణ అగే ప్రసక్తే లేదని తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహా అన్నారు. మాదిగ మాదిగ ఉప కులాల నాయకులు నిన్న గురువారం మంత్రి దామోదర రాజనరసింహాను కలిశారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర మాట్లాడుతూ మాదిగల సమిష్టి కృషి.. సమాజంలో అందరికీ సమాన హక్కులు కల్పించాలన్న కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఉన్న కమిట్మెంట్ వల్లనే వర్గీకరణ సాధ్యమవుతుందని అన్నారు. గత […]Read More
Tags :anumula revanth reddy
తెలంగాణలో నిర్మితమవుతున్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదా గురించి లోక్ సభలో మహబూబాబాద్ కాంగ్రెస్ ఎంపీ బలరాం నాయక్ అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం లేదని తేల్చి చెప్పింది. దీంతో గత సార్వత్రిక ఎన్నికల ముందు మేము అధికారంలోకి రాగానే పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్ కు జాతీయ హోదా సాధిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీకి […]Read More
వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి, ప్రజలను ముప్పు తిప్పలు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పాలిట అభయహస్తం కాదు, భస్మాసుర హస్తమని మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు..లబ్ధిదారుల జాబితాలో తన పేరు లేదని గ్రామసభలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ములుగు జిల్లా, బుట్టాయిగూడెంకు చెందిన కుమ్మరి నాగయ్య (నాగేశ్వర్ రావు) గారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు..పట్టించుకోవాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తుంటే, కాంగ్రెస్ పార్టీ […]Read More
స్థానిక ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..!
మర్రి చెన్నారెడ్డి భవన్ లో జరుగుతున్న సీఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవం చేయాలి. అత్యధిక గ్రామ పంచాయితీలను ఏకగ్రీవం చేయాలి. గ్రామాల్లో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన .. తాగునీటి వసతులు.. సీసీ బీటీ రోడ్ల నిర్మాణం..ఆలయ నిర్మాణాలను సహాకరించాలి. నిధుల కోసం స్థానిక సంబంధిత మంత్రులను కలవాలి.. ప్రజలకు అందుబాటులో ఉండాలి.. పార్టీ నేతలను.. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకోవాలని […]Read More
తెలంగాణ వ్యాప్తంగా ఒక ఎకరం వరకు సాగులో ఉన్న భూములకు రైతుభరోసా నిధులు జమ చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఒక ఎకరం ఉన్న దాదాపు 17.03లక్షల రైతుల అకౌంట్లలో నిధులు జమ చేశాము. రైతులకిచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా నిధులను నిర్ణీత కాల వ్యవధిలో చెల్లించుటకు కృతనిశ్చయంతో ఉంది.. ఇప్పటికే రైతుబంధుకు రూ.7,625 కోట్లు, రుణమాఫీకి రూ.20,616.89 కోట్లు చెల్లించాము. […]Read More
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ కాంగ్రెస్ లో ఇంకా అసమ్మతి సెగలు చల్లారినట్లు లేదు. ఇప్పటికే పదిమంది ఎమ్మెల్యేల భేటీ వ్యవహారం ఢిల్లీకి చేరింది. తాజాగా మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఓ మంత్రి నేతృత్వంలోని ఎమ్మెల్యేలు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడైన మల్లిఖార్జున ఖర్గేను కలిసినట్లు వార్తలు వస్తున్నాయి. అసలు విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి సెగలు ఇంకా చల్లారినట్లులేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా బెంగుళూరులో ఏఐసీసీ అధ్యక్షుడైన ఖర్గేను మంత్రి జూపల్లి […]Read More
ఆయనో ముఖ్యమంత్రి.. ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే అధికారంలోకి వచ్చాడు. అయిన కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో.. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అలానే ఉన్నాడు. అదే వాక్ చాతుర్యం.. అదే శైలీ.. ఏ మాత్రం తీరు మార్చుకోకుండా నోటికి ఎంత వస్తే అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమి మాట్లాడిన నడుస్తుంది. తీరా అధికారంలోకి వచ్చాక కొన్ని నియమనిబంధనలు ఉన్నాయనే సంగతి మరిచినట్లు వ్యవహరిస్తున్నాడు. ఇంతకూ ఎవరిగురించి ఈ ఉపోద్ఘాతం అనుకుంటున్నారా.. ఇంకా […]Read More
టీమిండియా అండర్ 19 మహిళల వరల్డ్ కప్ లో గెలవడానికి ప్రధాన పాత్ర పోషించిన తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాచలానికి చెందిన క్రికెటర్ గొంగడి త్రిష ఈరోజు హైదరాబాద్ మహానగరంలోని జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండర్-19 ప్రపంచ కప్ లో అద్భుతంగా రాణించిన త్రిషను అభినందించారు. అంతేకాకుండా ఆమెకు ప్రభుత్వం తరపున కోటి రూపాయల నజరానా ప్రకటించారు. మరోవైపు వరల్డ్ […]Read More
తెలంగాణలో చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల గణన (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే 2024) దేశంలోనే ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం. సమాజ అభివృద్ధికి ఈ నివేదిక ఒక దిక్సూచిలా, ఒక మాడల్ డాక్యుమెంట్‌లా మారుతుంది. సమాజంలో మా లెక్కలు తేల్చాలని ఏడు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న బలహీన వర్గాలు, మైనారిటీల ఆకాంక్షలకు అనుగుణంగా పకడ్బందీ ప్రణాళికతో ఏడాది కాలంలో సర్వేను విజయవంతంగా పూర్తి చేశాం. రాష్ట్రంలో అమలు చేయబోయే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, […]Read More
ఎస్సీ కమిషన్ నివేదికకు తెలంగాణ శాసనమండలి ఆమోదం తెలిపింది. మొత్తం ఎస్సీలకు చెందిన 59 కులాలను గుర్తించింది. ఈ కులాలన్నీంటిని మూడు గ్రూపులుగా విభజించాలని కమిషన్ సిఫార్సు చేసింది. గ్రూప్-1లో సామాజిక, ఆర్థిక, విద్యాపరంగా అత్యంత వెనుకబడ్డ 15 షెడ్యూల్డ్ కులాలను చేర్చింది. గ్రూప్-2లో 18 షెడ్యూల్డ్ కులాలను చేర్చింది. చివరగా గ్రూప్-3లో 26 షెడ్యూల్డ్ కులాలను చేర్చింది. ఏ గ్రూపులో ఏ కులం ఉందో మీరు ఓ లుక్ వేయండి..!Read More