తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో అధికార కాంగ్రెస్ పార్టీ బలం పెరిగింది.. బీఆర్ఎస్ కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ప్రస్తుతమున్న అరవై నాలుగు సభ్యులు నుండి డెబ్బైకి చేరింది.. బీఆర్ఎస్ కు చెందిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు,ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ,స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ,బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి , జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పార్టీ మారారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 64, […]Read More
Tags :anumula revanth reddy
తెలంగాణ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీలోకి తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు చేరడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్..మాజీ మంత్రివర్యులు కేటీ రామారావు ఎక్స్ వేదికగా స్పందించారు.. ప్రస్తుతం అధికారంలో ఉన్న వ్యక్తుల కంటే ప్రజల శక్తి ఎప్పుడూ బలంగానే ఉంటుందని ఆయన పేర్కోన్నారు… ‘నాడు ఉమ్మడి రాష్ట్రంలో 2004-06లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేకసార్లు ఎమ్మెల్యేల ఫిరాయింపులను ఎదుర్కొన్నాము. ఆ తర్వాత తెలంగాణ ప్రజలు దీటుగా స్పందించారు. చివరికి కాంగ్రెస్ తల వంచాల్సి వచ్చింది. మరోసారి చరిత్ర […]Read More
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి మహిళకు నెలకు రూ.2500లు ఇస్తామని హామీచ్చిన సంగతి తెల్సిందే.. అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అవుతున్న కానీ ఈ పథకం అమలు గురించి అసలు ఊసే లేదు. తాజాగా ఈ హామీ అమలుపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు కన్పిస్తుంది.. అందులో భాగంగా ‘మహిళలకు రూ.2,500 ఆర్థికసాయం’ పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి పెన్షన్, ఎలాంటి ఆర్థిక […]Read More
తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలు అమల్లో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు.. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయింది. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఎకరానికి 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తానని మాట తప్పి.. ఇప్పుడు రైతు భరోసాపై క్యాబినెట్ సబ్ కమిటీ అంటూ మోసం చేస్తున్నాడని అన్నారు..Read More
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హాయాంలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు..మంత్రులు..నేతలు ఇసుక దందా చేస్తున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్న సంగతి తెల్సిందే.. తాజాగా రాష్ట్రంలోని సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో ఇసుక ట్రాక్టర్ల ఆగడాలు భరించలేక పట్టుకుని రాచర్లబొప్పాపూర్ గ్రామస్థుల పోలీసులకు పట్టించిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది..Read More
తెలంగాణ రాష్ట్రంలో నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఇసుక దందాకు అడ్డే లేకుండా పోయింది..స్థానికపోలీసులకు చెప్పి చెప్పి విసిగిపోయి స్వయంగా అక్రమ ఇసుక ట్రాక్టర్లను 30 మంది రైతులు పట్టుకున్న సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.. నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని అనుముల మండలంలోని పులిమామిడి, కుమ్మరి కుంట, కేకే కాలువ శివారులోని రైతుల పొలాలలో బోర్లను పైపులైన్ ధ్వంసం చేసి ట్రాక్టర్ల ద్వారా ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్నారు.. దీంతో గ్రామంలోని రైతులు గత రెండు నెలలుగా […]Read More
తెలంగాణ రాష్ట్రంలోని జీవో 46 బాధితులు ఈరోజు గురువారం తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి…బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిశారు. ఈసందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ జీవో 46 బాధితుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.Read More
తెలంగాణ రాష్ట్రంలో ఈ సారి నెలరోజులపాటు బోనాల పండుగ నిర్వహించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అంతేకాకుండా బోనాల పండుగ సందర్భంగా ఆలయాలకు ఇచ్చే నిధులు పెంచనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. రాజధాని మహానగరం ‘హైదరాబాద్ పరిధిలో 2400కుపైగా ఆలయాలు ఉన్నాయి. వాటన్నింటికీ నిధుల సహాయం చేస్తాము. అలాగే 28 ప్రముఖ ఆలయాలకు స్థానిక ప్రజాప్రతినిధులే పట్టు వస్త్రాలు సమర్పిస్తారు’ అని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు.Read More
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం కొల్చారం మండలంలో రాష్ట్ర దేవాదాయ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ పర్యటనలో ప్రోటోకాల్ వివాదం చోటు చేసుకుంది. కొల్చారం మండల కేంద్రంలో నూతన ఎంపీడీవో కార్యాలయాన్ని గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి ఆవుల రాజి రెడ్డితో ప్రారంభం చేయించాలని చూసిన మంత్రి కొండా సురేఖ.. స్థానిక ఎమ్మెల్యే తాను ఉండగా ప్రోటోకాల్ పాటించలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అడ్డుపడ్డారు.Read More
హైదరాబాద్‌ను ప్రపంచంలోనే పేరొందిన నగరాల సరసన నిలబెట్టాలనేది తమ సంకల్పమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఆయన సచివాలయంలో కుష్ మన్ అండ్ వేక్ ఫీల్డ్ సంస్థ ఆసియా పసిఫిక్ సీఈవో మ్యాథ్యూ భౌ ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. హైదరాబాద్ వివిధ రంగాల్లో విస్తరిస్తూ గ్లోబల్ సిటీగా వృద్ధి చెందుతున్న తీరును సమావేశంలో కుష్ మన్ అండ్ వేక్ ఫీల్డ్ సంస్థ తమ అధ్యయన వివరాలను వెల్లడించింది. గడిచిన ఆరు నెలల్లో హైదరాబాద్‌లో లీజింగ్, ఆఫీస్ […]Read More