న్యూయార్క్ నగరంతో పోటీ పడేలా హైదరాబాద్ లోఒ మరో కొత్త నగరం నిర్మిస్తాను అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.. ఈరోజు నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ సైబరాబాద్ తరహాలో హైదరాబాద్లో మరో కొత్త నగరాన్ని నిర్మిస్తాను. న్యూయార్క్ నగరంతో పోటీ పడేలా మహేశ్వరంలో ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మిస్తాను.. రాచకొండ ప్రాంతంలో మరో ఫిల్మ్ సిటీని కూడా అందుబాటులోకి తెస్తా. బాలీవుడ్ నటులు కూడా ఇక్కడకు వచ్చి షూటింగులు చేసేలా ఏర్పాట్లు చేస్తామని ఆయన […]Read More
Tags :anumula revanth reddy
నాడు వరమైంది..నేడు శాపమవుతుంది…రేవంత్ రెడ్డిపై సీనియర్లు గుస్సా..?
ఎనుముల రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ గా ఎన్నికల ప్రచారంలో చేసిన హంగామా అంతా ఇంతా కాదు.. ముఖ్యంగా కేసీఆర్…కేటీఆర్..హారీష్ రావులే లక్ష్యంగా చేసిన విమర్శలు..విసిరిన సవాళ్లు ఇటు కాంగ్రెస్ శ్రేణులకు..అటు ఆ పార్టీ అనుకూల యూట్యూబర్స్ తో పాటు మెయిన్ మీడియాకు టీఆర్పీ రేటింగ్ మాములుగా పెంచలేదు… అంతేకాకుండా పదేండ్లు కేసీఆర్ & టీమ్ చేసిన సంక్షేమాభివృద్ధి కంటే ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ వాళ్లు చేసిన ప్రచారం తెలంగాణ ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించారు..అయితే […]Read More
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ జిల్లాకు చెందిన పోచారం గ్రామంలో ఉండే ఎం. యాదగిరి రెడ్డికి రైతుబంధు ద్వారా పొందిన రూ.16 లక్షలను తిరిగి చెల్లించాలని అధికారులు నోటీసులు పంపారు. యాదగిరి రెడ్డి తన 33 ఎకరాల వ్యవసాయ భూమిని ప్లాట్లుగా మార్చి విక్రయించినప్పటికీ రెవెన్యూ అధికారులు వ్యవసాయ భూమి నుండి NALA (Non Agriculture Land)గా మార్చకపోవడంతో ఆయన రైతుబంధు పొందారు. ఈ తరహాలో రైతు బంధు తీసుకున్న వారందరికీ ఆ డబ్బులు అన్ని తిరిగి చెల్లించాలని […]Read More
కాంగ్రెస్ పార్టీలోకి ఇప్పటికే ఏడుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. ఎనిమిది మంది ఎమ్మెల్సీలు చేరిన సంగతి తెల్సిందే.. తాజాగా మరో బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే కాంగ్రెస్ గూటికి చేరడం ఖాయం అనే వార్తలు వస్తున్నాయి … హైదరాబాద్ లోని రాజేంద్ర నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ రేపు శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు అని టాక్. ఇప్పటికే ఒకసారి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డిని కల్సిన […]Read More
బీఆర్ఎస్ అయిన అప్పటి టీఆర్ఎస్ అయిన ముందుగా గుర్తుకు వచ్చేది ఉద్యమ పార్టీ.. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా జలవిహార్ లో పురుడుపోసుకున్న పార్టీ అని ఠక్కున అందరి మదిలో మెదులుతుంది. అంతటి మహోత్తర చరిత్ర .. మూలాలు ఉన్న బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తనమూలాలను మరిచిపోయి అధికారమే పరామవదిగా కాంగ్రెస్ టీడీపీ లకు చెందిన ఎమ్మెల్యేలను.. నేతలను చేర్చుకుని ఉద్యమ పార్టీ కాస్తా పక్క పొలిటికల్ పార్టీగా అవతరించింది. పదేండ్లలో డెబ్బై ఐదేండ్ల స్వతంత్ర […]Read More
కేవలం పది ఎకరాల్లోపే ఉన్న రైతులకు మాత్రమే రైతుభరోసా పథకం అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తుంది. ఈ రోజు ఖమ్మంలో జరిగిన రైతుభరోసా పథకం పై ఖమ్మం ఉమ్మడి జిల్లా స్థాయి సమావేశంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతుల నుండి మంత్రులు పొంగులేటి ,తుమ్మల,భట్టి విక్రమార్క బృందం పలు అభిప్రాయాలను సేకరించింది. ఈ అభిప్రాయాల మేరకు కేవలం పది ఎకరాల్లోపు ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా అందించాలి.. కౌలు రైతులకు సబ్సిడీపై వ్యవసాయానికి సంబంధించిన […]Read More
తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ నియామకం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఈమేరకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ రోజు బుధవారం ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ కానున్నట్లు తెలియవచ్చింది. వాస్తవానికి మంగళవారమే ఉత్తర్వులు వెలువడాల్సి ఉన్నా కానీ నిన్న మంగళవారం సీఎం మహబూబ్నగర్ జిల్లా పర్యటన కారణంగా వాయిదా పడినట్లు తెలిసింది. ఈ ఉత్తర్వులు వెలువడితే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం నియమించిన తొలి డీజీపీ జితేందర్ […]Read More
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత.. రాజ్యసభ మాజీ సభ్యులు వి హన్మంత్ రావు ఆ పార్టీ ఎన్నికల వ్యూహా కర్త అయిన సునీల్ కనుగోలు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ” ఎంపీ ఎన్నికల్లో ఏమి జరిగిందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాదు ఆయన ఎవరో ఉండే కొనుగోలు .. సునీల్ కొనుగోలు అంటే అక్కడున్న జర్నలిస్టు మిత్రులు సునీల్ కొనుగోలు కాదు సునీల్ కనుగోలు అని అన్నారు.. మీరు […]Read More
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ పథకం అమలుకు సన్నద్ధమవుతోన్నట్లు తెలుస్తుంది. గత ఎన్నికల్లో ఇచ్చిన ఎన్నికల హామీ అమల్లో భాగంగా ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించిన సంగతి తెల్సిందే. దీంతో దీనికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటోంది. మార్కెట్ నుంచి సేకరించే బడ్జెట్ అప్పులను జూలై, ఆగస్టు నెలల్లో ఎక్కువ మొత్తంలో తీసుకునేందుకు అవకాశం కల్పించాలని కేంద్రాన్ని కోరుతూనే.. భూములను హామీగా పెట్టి తీసుకునే రుణాలను ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోకి […]Read More
మాజీ మంత్రి.. ఎమ్మెల్యే మల్లారెడ్డికి భారీ షాక్ తగలనున్నది. తన నియోజకవర్గంలోని ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కి చెందిన దాదాపు 15 మంది కార్పొరేటర్లు బీఆర్ఎస్ పార్టీని వీడారు . వీరి చేరికతో కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ బలం మరింత పెరిగింది. త్వరలోనే ఫిర్జాదిగూడ కార్పొరేషన్ హస్తగతం కానుంది. అయితే, ఈ 15 మంది కార్పొరేటర్లతో డిప్యూటీ మేయర్ శివకుమార్ ఆధ్వర్యంలో గోవాలో క్యాంప్ రాజకీయం నడుపుతున్నారు. మొన్న జవహర్ నగర్, నిన్న బోడుప్పల్ కాంగ్రెస్ కైసవం […]Read More