Tags :andhrapradeshassembly elections

Andhra Pradesh Slider

కేశినేని నాని సంచలనం నిర్ణయం

ఏపీ సార్వత్రిక ఎన్నికలకు ముందు టీడీపీ నుండి వైసీపీ లో చేరిన మాజీ ఎంపీ… సీనియర్ నేత కేశినేని నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు. విజయవాడ నుండి రెండు సార్లు ఎంపీ గా గెలుపొందిన కేశినేని నాని ప్రత్యేక్ష రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తను రాజకీయాల నుండి తప్పుకున్న కానీ విజయవాడ ప్రజలందరికి అందుబాటులో ఉంటాను అని తెలిపారు. ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికల్లో వైసీపీ తరపున బరిలోకి దిగి తన తమ్ముడు టీడీపీ ఎంపీ […]Read More

Andhra Pradesh National Slider

ఈ నెల 12న ఏపీ కి అమిత్ షా

కేంద్ర మంత్రి అమిత్ షా ఈ నెల 12న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం మహోత్సవ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఇటీవల విడుదలైన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన కూటమి 164స్థానాల్లో, వైసీపీ 11స్థానాల్లో గెలుపొందిన సంగతి తెల్సిందే. మరోవైపు 21ఎంపీ స్థానాల్లో టీడీపీ కూటమి, 4ఎంపీ స్థానాల్లో వైసీపీ గెలుపొందిన సంగతి కూడా తెల్సిందే.Read More

Andhra Pradesh Slider

వైసీపీ గెలుస్తుందని 30కోట్లు బెట్టింగ్ పెట్టి..కట్టలేక…?

ఇటీవల విడుదలైన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ గెలుస్తుందని రాష్ట్రంలోని ఏలూరు జిల్లా తూర్పుదిగవల్లి సర్పంచి భర్త జగ్గవరపు వేణుగోపాల్ రెడ్డి అన్ వ్యక్తి పలువురితో దాదాపు ముప్పై కోట్ల రూపాయలు బెట్టింగ్ కట్టాడు. అయితే ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమి 164స్థానాలు.. వైసీపీ పదకొండు స్థానాల్లోనే మాత్రమే గెలుపొందింది. దీంతో వైసీపీ ఓడిపోవడంతో వేణు గోపాల్ రెడ్డి తన ఊరు.. ఇల్లు విడిచి వెళ్లిపోయాడు.. అతనికి ఎంతగా  ఫోన్ చేసినా స్పందించకపోవడంతో పందెం వేసినవారు […]Read More

Slider Telangana

MLA గా పవన్ జీతం ఎంతో తెలుసా..?

ఏపీ సార్వత్రిక ఎన్నికల ప్రచారం సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి తాను ఎమ్మెల్యేగా పూర్తి జీతం తీసుకుంటానని జనసేనాని  చెప్పిన విషయం తెలిసిందే. భారీ మెజార్టీతో గెలుపొందిన జనసేనాని పవన్ కళ్యాణ్ జీతం ఎంతన్న చర్చ ప్రస్తుతం మీడియాలో జరుగుతోంది. ప్రస్తుతం ఏపీలోని ఒక్కో ఎమ్మెల్యేకు నెల జీతం రూ.3.35 లక్షలుగా ఉంది. ఇందులో నియోజకవర్గ అలవెన్స్ లతో పాటు ఇతర అలవెన్సులను అందులోనే కలిపారు. దీంతో పవన్ కూడా ఈ మొత్తాన్నే […]Read More

Andhra Pradesh Slider

భావోద్వేగానికి గురైన సీఎం జగన్

ఏపీలో ఈరోజు విడుదలైన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఘోర ఓటమిని కట్టబెట్టడంపై వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి తీవ్ర భావోద్వేగానికి గురయ్యా రు. గత ఐదేండ్లలో తమ ప్రభుత్వం తరపున అమ్మఒడి డబ్బులు ఇచ్చి చిన్న పిల్లలకు మంచి చేసినా, అవ్వాతాతలకు ఇంటివద్దకే పెన్షన్ పంపినా ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదన్నారు. కోటి మందికి పైగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించినా వారు ఆప్యాయత చూపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల […]Read More

Andhra Pradesh Slider

పల్నాడులో దుమ్ము లేపిన టీడీపీ

ఏపీలో ఈ రోజు విడుదలైన సార్వత్రిక ఎన్నికల్లో పల్నాడు జిల్లాలో టీడీపీపార్టీకి చెందిన సీనియర్ నేతలంతా దుమ్ములేపారు. ఇందులో భాగంగా చిలకలూరిపేట నుండి పోటికి దిగిన ఎమ్మెల్యే అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు 32,795 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.. మొత్తం 1,09,885 ఓట్లు పుల్లారావు కు నమోదయ్యాయి.మరోవైపు వినుకొండ నుండి బరిలోకి దిగిన మరో సీనియర్ నేత జీవీ ఆంజనేయులుకి 1,29,813 ఓట్లు పోలయ్యాయి.. మొత్తం అంజనేయులుకు 29,683 మెజార్టీ దక్కింది. గురజాల నుండి బరిలోకి దిగిన  యరపతినేని […]Read More

Andhra Pradesh Slider

ఓటమిపై వైసీపీ రియాక్షన్ ఇది

ఈరోజు విడుదలైన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమిపై నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈరోజు విడుదలైన ఎన్నికల ఫలితాల్లో రాష్ట్ర ప్రజలు కూటమికి అనుకూలంగా తీర్పు ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును శిరసావహించాల్సిందే. ఓటమికి కారణాలను సమీక్షించుకుంటాం. ఎక్కడ పొరపాట్లు జరిగాయి? ఎలా సరిదిద్దుకోవాలి? ప్రజలను నచ్చని పనులు ఏం చేశాం? అనేది సమగ్రంగా సమీక్ష నిర్వహిస్తాం’ అని ఆయన తెలిపారు.Read More

Andhra Pradesh Slider

వైసీపీపై వైరల్ అవుతున్న సెటైర్లు

ఈరోజు విడుదలైన ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో  కనివినీ ఎరుగని రీతిలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభంజనం సృష్టించింది. ఎంతలా అంటే ఫ్యాన్ సునామీనే.. వైనాట్ 175 దగ్గర్నుంచి ఘోరాతి ఘోరంగా ఓడిపోతున్న పరిస్థితి. కేవలం సింగిల్ డిజిట్‌లోనే అభ్యర్థులు గెలుస్తున్న పరిస్థితి. ఇప్పటి వరకూ పట్టుమని పది మంది కూడా గెలవని దుస్థితి వైసీపీకి రావడం గమనార్హం. ఆఖరికి వైఎస్ జగన్ రెడ్డి కంచుకోటగా ఉన్న వైఎస్సార్ కడప జిల్లాలో కూడా కూటమి దెబ్బకు వైసీపీ […]Read More

Andhra Pradesh Slider

చరిత్రకెక్కిన పవన్

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కూటమి హవా కొనసాగుతుంది.ఇప్పటివరకు కూటమి 163స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తుంది. మరోవైపు 19ఎంపీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నరు. రాష్ట్రంలో పిఠాపురం అసెంబ్లీ నుండి బరిలోకి దిగిన జనసేన అధినేత పవర్ స్టార్  పవన్‌కల్యాణ్‌ ఘన విజయం  సాధించారు. వైసీపీ అభ్యర్థి వంగా గీతపై 70,354 ఓట్ల మెజారిటీతో పవన్‌కల్యాణ్‌ గెలుపొందారుRead More

Slider Telangana

కడపలో వైఎస్ షర్మిలకి షాక్

ఏపీ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల కడప పార్లమెంట్ నుండి బరిలో దిగుతున్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో ఈరోజు వెలువడుతున్న ఎన్నికల ఫలితాల్లో కడప పార్లమెంట్ స్థానంలో వైసీపీ అభ్యర్థి అవినాశ్ రెడ్డి 22,674 ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయనకు 1,04,227 ఓట్లు పోలయ్యాయి. టీడీపీ అభ్యర్థి భూపేశ్ రెడ్డికి 81,553 ఓట్లు వచ్చాయి.. మరోవైపు  షర్మిల కేవలం 14,532 ఓట్లతో డిపాజిట్ కోల్పోయే దిశగా సాగుతున్నారు.Read More