ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఆరోపించారు. గత నాలుగు నెలలుగా ఇన్ని ఘోరాలు జరుగుతున్నా చేతకాని హోంమంత్రి అనిత ఎక్కడున్నారు? అని ఆమె ప్రశ్నించారు. ‘రాష్ట్రంలో ఆడపిల్లలపై అరాచకాలు పెరిగాయి. చిన్నారులు, యువతులు, అత్తాకోడళ్లపై అత్యాచారాలు జరుగుతున్నాయి. ప్రభుత్వానికి బాధితులకు ధైర్యం చెప్పే బాధ్యత కూడా లేకుండాపోయింది. దిశా యాప్ పునరుద్ధరించాలి’ అని ఆమె డిమాండ్ చేశారు.Read More
Tags :andhrapradesh home minister
ఏపీ హోం మంత్రి ..టీడీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలైన వంగలపూడి అనిత పై సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తున్నాయి.. గతంలో మంత్రి వంగలపూడి అనిత మీడియాతో మాట్లాడుతూ ” నేను క్రైస్తవరాల్ని.. నా హ్యాండ్ బ్యాగ్ లో ఎప్పుడు బైబిల్ ఉంటుంది. తాను ప్రయాణించే కారులో సైతం బైబిల్ ఉంటుంది అని వ్యాఖ్యానించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రత్యర్థి పార్టీలకు చెందిన అభిమానులు వైరల్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. తాజాగా తాను హిందువు నని […]Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి కి చెందిన రైతులపై గత వైసీపీ ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసులు ఎత్తివేయాలని హోం మంత్రి అనితకు రాజధాని ప్రాంత మహిళలు విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వ నిరంకుశతత్వానికి వ్యతిరేకంగా రాజధాని కోసం చేసిన ఉద్యమంలో తమపై అక్రమ కేసులు బనాయించారని మహిళలు ఈ సందర్భంగా దుయ్యబట్టారు. రైతులంతా ఐదేండ్లు ఓ నేరస్థుల్లా ప్రతినెలా కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ కేసులన్నింటిపై సమీక్షిస్తామని తెలిపిన […]Read More
ఏపీ హోం మంత్రిగా మహిళ ఎమ్మెల్యేకి అవకాశం ఇచ్చారు ముఖ్యమంత్రి…టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. ఇటీవల విడుదలైన ఏపీ ఎన్నికల ఫలితాల్లో గెలుపొందిన దళిత సామాజిక వర్గానికి చెందిన ఏపీ హోంమంత్రిగా వంగలపూడి అనితను ముఖ్యమంత్రి చంద్రబాబు నియమించారు . పాయకరావు పేట నుంచి గెలిచిన అనిత ప్రస్తుత కేబినెట్లో సీనియార్టీ, ఎస్సీ వర్గ సమీకరణాలతో మంత్రి పదవి పొందారు. కీలకమైన హోంశాఖను ఎవరూ ఊహించని విధంగా అనిత పొంది అందర్నీ ఆశ్చర్యపరిచారు.Read More