తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం తొలి షాక్ ఇచ్చింది. తెలంగాణలో ఉన్న సింగరేణి బ్లాకులల్లో ఆరు బ్లాకులను ఈ నెల చివరాఖరి వరకు వేలం వేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం వేలం వేయకపోతే తామే వేస్తామని హుకుం జారీ చేసింది. మరోవైపు గత తొమ్మిదిన్నరేండ్లలో ముఖ్యమంత్రి గా ఉన్న కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క బ్లాకు […]Read More
Tags :amith shah
ప్రస్తుతం తెలంగాణ గవర్నర్‌గా విధులు నిర్వర్తిస్తున్న సీపీ రాధాకృష్ణన్‌ను త్వరలోనే తప్పించనున్నారా..? . సీపీ రాధాకృష్ణన్ స్థానంలో ఉమ్మడి ఏపీ చివరి ముఖ్యమంత్రిగా పని చేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని నియమించనున్నారా అంటే ప్రస్తుతం మీడియాలో వస్తున్న వార్తలను బట్టి నిజమే అన్పిస్తుంది. ప్రస్తుత గవర్నర్ గా ఉన్న సీపీ రాధాకృష్ణన్ తెలంగాణ రాష్ట్ర బాధ్యతలే కాకుండా మరోవైపు పుదుచ్చేరి లెప్టినెంట్ బాధ్యతలను చూస్తున్నారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్యే..ఎంపీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఎక్కువ స్థానాలు […]Read More
ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలో కొలువు దీరిన 72మంది కేంద్రమంత్రులకు ఆయా శాఖలు కేటాయిస్తున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగా నితిన్ గడ్కరికి గతంలో కేటాయించిన రోడ్లు, రవాణా శాఖ మంత్రిగా పని చేసిన మరోసారి అదే శాఖను కేటాయించారు. సహాయ మంత్రులుగా హర్ష్ మల్హోత్రా, అజయ్ టమ్లా ఉండనున్నారు.మరోవైపు అమిత్ షాకి కేంద్ర హోం శాఖ బాధ్యతలు..జైశంకర్ కు విదేశీ వ్యవహరాల శాఖ మంత్రిత్వ బాధ్యతను..రాజ్ నాథ్ కు రక్షణ శాఖను కేటాయించారు.Read More
ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలో 72మందితో కొలువుదీరిన మంత్రివర్గం ఈ రోజు సోమవారం సాయంత్రం ఐదు గంటలకి సమావేశం అయిన సంగతి తెల్సిందే. ప్రధానమంత్రిగా నరేందర్ మోదీ తన తొలి సంతకం పీఎం కిసాన్ నిధుల విడుదల పైల్ పై చేశారు. తాజాగా మంత్రివర్గ సమావేశంలో దేశంలో అర్హులైన పేదలకు ఇండ్లను నిర్మించాలనే తొలి నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో దాదాపు మూడు కోట్ల ఇండ్లను పీఎం అవాస్ యోజన పథకం కింద పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో […]Read More
ఇటీవల విడుదలైన పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో ఏపీలోని నరసాపురం పార్లమెంట్ నుండి గెలుపొందిన బీజేపీ ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కేంద్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. దేశ రాజధాని మహానగరం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము భూపతిరాజు శ్రీనివాస వర్మతో ప్రమాణం చేయించారు. మరోవైపు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తొలిసారిగా ఎంపీగా గెలిచి మంత్రి పదవి దక్కించుకోవడం విశేషం.Read More
కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కిషన్ రెడ్డి మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ “కేంద్రమంత్రి వర్గ కూర్పులో అన్ని రాష్ట్రాలకు సమన్యాయం చేశారు.. రాబోవు వందరోజుల ప్రణాళికల గురించి ప్రధానమంత్రి నరేందర్ మోదీ ఆలోచిస్తున్నారు. వచ్చే ఐదేండ్లలో పేదలకు మూడు కోట్ల ఇండ్లను నిర్మించి తీరుతాము. తెలంగాణలో సంస్థాగత మార్పులుంటాయి..బీజేపీ రాష్ట్ర అధ్యక్ష మార్పులుంటాయి..నన్ను కేంద్రమంత్రిగా నియమించిన ప్రధానమంత్రి నరేందర్ మోదీకి ధన్యవాదాలు” అని అన్నారు.Read More
భారత ప్రధానమంత్రిగా నరేందర్ మోదీ ప్రమాణ స్వీకారం చేశారు..ప్రధానమంత్రి నరేందర్ మోదీతో పాటు 72మంది కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో 30మందికి కేబినెట్ హోదా.. 5గురుకి సహాయక కేంద్ర మంత్రులు(స్వతంత్ర హోదా)..36మందికి సహాయక మంత్రులు ఉన్నారు. వీరిలో 43మందికి మూడు సార్లు మంత్రులుగా పని చేసిన అనుభవం ఉంది.ఇరవై ఆరు మందికి ఆయా రాష్ట్రాల మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉంది.Read More
తెలంగాణ రాష్ట్ర బీజేపీకి చెందిన మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు..మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు ఈరోజు కొలువుదీరుతున్న మోదీ కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కుతుందని అందరూ భావించారు. అయితే ఎవరూ ఊహించని విధంగా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి గెలుపొందిన జి కిషన్ రెడ్డి,కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి గెలుపొందిన బండి సంజయ్ లకు కేంద్ర మంత్రులుగా ఆ పార్టీ జాతీయ అధిష్టానం అవకాశం కల్పించింది. అయితే తాజాగా ఓ వార్త మీడియాలో చక్కర్లు కొడుతుంది. తెలంగాణ […]Read More
ఇటీవల విడుదలైన పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి కిషన్ రెడ్డి,కరీంనగర్ నుండి బండి సంజయ్ భారీ మెజార్టీతో గెలుపొందిన సంగతి తెల్సిందే. అయితే తాజాగా వీరిద్దరికి కేంద్ర క్యాబినెట్ లో బెర్తు దొరికింది. కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయాల్సిందిగా పీఎంఓ కార్యాలయం నుండి వీరికి ఫోన్ కాల్స్ వెళ్లాయి. దీంతో వీరిద్దరూ ప్రధానమంత్రి నరేందర్ మోదీ నివాసంకు బయలుదేరి వెళ్లారు.మరోవైపు ఏపీ నుండి టీడీపీకి ఇద్దరు కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు..Read More
ఇటీవల విడుదలైన లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో ప్రస్తుత అధికార పార్టీ అయిన బీజేపీకి సొంతంగా మెజార్టీ సీట్లు గెలవకపోవడంతో జేడీయూ పార్టీ కీలకంగా మారింది. మొత్తం12 మంది ఎంపీ సీట్లతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో కింగ్ మేకర్ స్థానంలో నిలిచింది. అయితే ఇవాళ ఎన్డీఏ పక్షాల భేటీలో బిహార్ సీఎం, జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ ప్రధాని మోదీ కాళ్లను మొక్కబోయారు. మోదీ వెంటనే అడ్డుకుని శుభాకాంక్షలు చెప్పారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. […]Read More