ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలో 72మందితో కొలువుదీరిన మంత్రివర్గం ఈ రోజు సోమవారం సాయంత్రం ఐదు గంటలకి సమావేశం అయిన సంగతి తెల్సిందే. ప్రధానమంత్రిగా నరేందర్ మోదీ తన తొలి సంతకం పీఎం కిసాన్ నిధుల విడుదల పైల్ పై చేశారు. తాజాగా మంత్రివర్గ సమావేశంలో దేశంలో అర్హులైన పేదలకు ఇండ్లను నిర్మించాలనే తొలి నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో దాదాపు మూడు కోట్ల ఇండ్లను పీఎం అవాస్ యోజన పథకం కింద పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో […]Read More
Tags :400paar
భారతప్రధానమంత్రిగా మూడోసారి పదవి బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోదీ తన తొలి సంతకం పీఎం కిసాన్ నిధుల విడుదలపై చేశారు. ఇందులో భాగంగా 17వ విడత కింద దేశంలోని 9.3 కోట్ల మందికి రూ.20,000 కోట్లు అకౌంట్లలో పడనున్నాయి. రైతుల సంక్షేమం కోసం తమ సర్కారు కట్టుబడి ఉందని ప్రధాని మోదీ ఈసందర్భంగా తెలిపారు. అందుకే తొలి సంతకం వారికి సంబంధించిన దస్త్రంపై చేశానని, రానున్న రోజుల్లో మరింత సాయం చేస్తామని ఆయన వివరించారు.Read More
ఇటీవల విడుదలైన పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో ఏపీలోని నరసాపురం పార్లమెంట్ నుండి గెలుపొందిన బీజేపీ ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కేంద్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. దేశ రాజధాని మహానగరం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము భూపతిరాజు శ్రీనివాస వర్మతో ప్రమాణం చేయించారు. మరోవైపు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తొలిసారిగా ఎంపీగా గెలిచి మంత్రి పదవి దక్కించుకోవడం విశేషం.Read More
కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కిషన్ రెడ్డి మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ “కేంద్రమంత్రి వర్గ కూర్పులో అన్ని రాష్ట్రాలకు సమన్యాయం చేశారు.. రాబోవు వందరోజుల ప్రణాళికల గురించి ప్రధానమంత్రి నరేందర్ మోదీ ఆలోచిస్తున్నారు. వచ్చే ఐదేండ్లలో పేదలకు మూడు కోట్ల ఇండ్లను నిర్మించి తీరుతాము. తెలంగాణలో సంస్థాగత మార్పులుంటాయి..బీజేపీ రాష్ట్ర అధ్యక్ష మార్పులుంటాయి..నన్ను కేంద్రమంత్రిగా నియమించిన ప్రధానమంత్రి నరేందర్ మోదీకి ధన్యవాదాలు” అని అన్నారు.Read More
సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఎంపీగా రెండో సారి గెలుపొందిన గంగాపురం కిషన్ రెడ్డి మోదీ క్యాబినెట్ లో కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.Read More
భారత ప్రధానమంత్రిగా నరేందర్ మోదీ ప్రమాణ స్వీకారం చేశారు..ప్రధానమంత్రి నరేందర్ మోదీతో పాటు 72మంది కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో 30మందికి కేబినెట్ హోదా.. 5గురుకి సహాయక కేంద్ర మంత్రులు(స్వతంత్ర హోదా)..36మందికి సహాయక మంత్రులు ఉన్నారు. వీరిలో 43మందికి మూడు సార్లు మంత్రులుగా పని చేసిన అనుభవం ఉంది.ఇరవై ఆరు మందికి ఆయా రాష్ట్రాల మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉంది.Read More
ఏపీ సార్వత్రిక ఎన్నికల ప్రచారం సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి తాను ఎమ్మెల్యేగా పూర్తి జీతం తీసుకుంటానని జనసేనాని చెప్పిన విషయం తెలిసిందే. భారీ మెజార్టీతో గెలుపొందిన జనసేనాని పవన్ కళ్యాణ్ జీతం ఎంతన్న చర్చ ప్రస్తుతం మీడియాలో జరుగుతోంది. ప్రస్తుతం ఏపీలోని ఒక్కో ఎమ్మెల్యేకు నెల జీతం రూ.3.35 లక్షలుగా ఉంది. ఇందులో నియోజకవర్గ అలవెన్స్ లతో పాటు ఇతర అలవెన్సులను అందులోనే కలిపారు. దీంతో పవన్ కూడా ఈ మొత్తాన్నే […]Read More
ఇటీవల విడుదలైన లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో ప్రస్తుత అధికార పార్టీ అయిన బీజేపీకి సొంతంగా మెజార్టీ సీట్లు గెలవకపోవడంతో జేడీయూ పార్టీ కీలకంగా మారింది. మొత్తం12 మంది ఎంపీ సీట్లతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో కింగ్ మేకర్ స్థానంలో నిలిచింది. అయితే ఇవాళ ఎన్డీఏ పక్షాల భేటీలో బిహార్ సీఎం, జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ ప్రధాని మోదీ కాళ్లను మొక్కబోయారు. మోదీ వెంటనే అడ్డుకుని శుభాకాంక్షలు చెప్పారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. […]Read More
తెలంగాణ రాష్ట్ర సీఎం..టీపీసీసీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డికి గట్టి దెబ్బ తగిలింది. గతంలో రేవంత్ రెడ్డి సిట్టింగ్ స్థానమైన మల్కాజిగిరి ఎంపీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి సునీతామహేందర్ రెడ్డిపై బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ భారీ మెజార్టీతో గెలుపొందారు. మల్కాజిగిరి స్థానంలో గెలవాలని సీఎం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినా కలిసిరాలేదు. ఇక సీఎం సొంత జిల్లా వికారాబాద్లోనూ బీజేపీ చేవెళ్ల అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి సత్తా చాటి గెలుపొందారు.Read More