Breaking News Business Slider Top News Of Today

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ మార్కెట్లో ఈ రోజు వెండి,బంగారం ధరలు బాగా పెరిగాయి. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.550లు పెరిగి రూ.73,310 కి చేరింది. పది గ్రాముల 22క్యారెట్ల బంగారం రూ.510 లు పెరిగి రూ.67,200లు పలుకుతుంది. మరోవైపు వెండి ధర ఏకంగా కేజీ రూ.2000లు పెరిగి రూ.92,000లకు చేరింది.Read More

Breaking News Slider Telangana Top News Of Today

జిట్టా బాలకృష్ణారెడ్డి మృతి

తెలంగాణ ఉద్యమ నాయకుడు.. బీఆర్ఎస్ నాయకుడు జిట్టా బాలకృష్ణారెడ్డి ఈ రోజు ఉదయం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన బ్రెయిన్ క్యాన్సర్ తో బాధపడుతూ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భువనగిరి జిల్లా బొమ్మాయిపల్లి గ్రామంలో 1972 డిసెంబర్ 14న జన్మించిన జిట్టా తెలంగాణ ఉద్యమంలో.. సాధనలో ఆయన పాత్ర అమోఘం.. ఎక్కడ ఏ చిన్న ఉద్యమం జరిగిన కానీ అక్కడ ప్రత్యేక్షమై తెలంగాణ వాదాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. నిత్యం ప్రజల్లో […]Read More

Breaking News Hyderabad Slider Top News Of Today

వ్యాయామం ద్వారానే ఆరోగ్య వికాసం

వ్యాయామం ద్వారా వ్యక్తిగత ఆరోగ్యం కాపాడుకోవచ్చునని, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు వ్యాయామాన్ని అలవరచుకోవాలని సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. వారసిగూడ లో కొత్తగా ఏర్పాటైన ‘హల్క్ జిమ్’ ను పద్మారావు గౌడ్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేవలం సరసమైన ధరలకే జిమ్ లను నిర్వహించడం ద్వారా లాభాపేక్ష రహిత కార్యకలాపాలను నిర్వహించాలని సూచించారు. కార్పొరేటర్ సామల హేమ, నిర్వాహకుడు కిషోర్, నాయకులు పాల్గొన్నారు.Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

ఎమ్మెల్యే ఆదిమూలం పై కేసు నమోదు

ఆంధ్రప్రదేశ్ అధికార టీడీపీకి చెందిన తిరుపతి జిల్లా సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పై ఓ మహిళ లైంగిక వేధింపుల ఆరోపణ చేసిన సంగతి తెల్సిందే. దీంతో టీడీపీ జాతీయ ఆధిష్టానం సదరు ఎమ్మెల్యే పై సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెల్సిందే. బాధితురాలి పిర్యాదు మేరకు ఎమ్మెల్యే ఆదిమూలంపై తిరుపతి తూర్పు పీఎస్ లో పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, నేను ఎలాంటి తప్పు చేయలేదు. నేను ఎవర్ని వేధించలేదు. అని […]Read More

Business Slider Top News Of Today

JIO యూజర్లకు Good News

జియో యూజర్లకు ఆ సంస్థ శుభవార్తను తెలిపింది. రిలయన్స్ జియో సంస్థ ఎనిమిదో వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల ఐదో తారీఖు నుండి పదో తారీఖు వరకు ఓ బంఫర్ ను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ఈ తారీఖుల మధ్య కొన్న రీఛార్జ్ ఫ్లాన్లపై స్పెషల్ ఆపర్లను ప్రకటించింది. ఈ ఆఫర్ల్ లో భాగంగా రూ.899 (90Days),రూ.999(98Days), రూ.3,599(365Days) లతో రీఛార్జ్ చేసుకుంటే రూ. 700లు విలువైన ప్రయోజనాలు లభిస్తాయని ఆ సంస్థ ప్రకటించింది. ఇందులో 10 […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

నేడే ఖాతాల్లో రూ.10,000లు జమ

తెలంగాణలో ఇటీవల వరద ముంపుకు గురైన ఖమ్మం పట్టణ కేంద్రంతో పాటు పలు ప్రాంతాల్లో ప్రజల ఖాతాల్లో రూ. 10,000లు నేడే జమ చేయనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. వరద బాధితులకు తక్షణ ఉపశమనం కింద వీటిని అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటాము.. వరద మృతులకు ఒక్కొక్కరికి ఐదు లక్షలు.. ప్రతి ఇంటికి పదివేలు.. ఇండ్లు కొల్పోయిన వారికి ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి మరి ఇస్తామని మొన్న ఖమ్మంలో […]Read More

Breaking News Health Lifestyle Slider Top News Of Today

బరువు తగ్గాలనుకుంటున్నారా..?

ఈరోజుల్లో ఉన్న ఆహారపు అలవాట్లతో… జీవిన శైలీతో మన శరీర బరువులనేది మన చేతుల్లో లేకుండా పోయింది. వయసుకు తగ్గ బరువు కంటే అధికంగా బరువు పెరుగుతున్నారు. దీంతో అనేక అనారోగ్య సమస్యలతో పాటు పలు ఇబ్బందులను ప్రస్తుత రోజుల్లో ఎదుర్కుంటున్నాము. అయితే మీరు వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా..?. అయితే ఇది మీకోసమే..! వేగంగా బరువు తగ్గాలనుకునేవాళ్లు కొన్ని అలవాట్లను పాటిస్తే తగ్గుతారని వైద్యనిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ పరగడపున గ్లాసు నీరు తప్పనిసరిగా తాగాలి. యోగా ,ఏరోబిక్ […]Read More

Breaking News Health Slider Telangana Top News Of Today

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఈ నిర్ణయంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పీడియాట్రిక్స్ , గైనకాలజీ , ఆర్థోపెడిక్స్ , జనరల్ మెడిషన్ వంటి ఇలా తొమ్మిది రకాల వైద్య సేవలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆయా ఆసుపత్రుల్లో డాక్టర్ల లభ్యత ఆధారంగా ఒక్కొక్క రోజు ఒకటి లేదా రెండు రకాల వైద్యసేవలను ప్రజలకు అందుబాటులో ఉండేలా ఈ నిర్ణయం అమల్లో […]Read More

Breaking News Lifestyle Slider Top News Of Today

ఉదయాన్నే కాఫీ తాగుతున్నారా..?

ఈరోజుల్లో కాఫీనో.. టీ నో తాగని వారు ఉండరంటేనే అతిశయోక్తి కాదేమో..?. కాఫీ లేనిది రోజు గడవదు.. టీ లేనిది రోజు ముగియదు. అయితే ఉదయాన్నే కాఫీ తాగితే చాలా లాభాలున్నాయని అంటున్నారు వైద్య నిపుణులు. ప్రతి రోజూ ఉదయం 9.30 నుండి 11.30గంటల లోపు ఈ సమయంలో కాఫీ తాగితే ఆరోగ్యానికి మంచిదంటున్నారు. ఇలా తీసుకోవడం వల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అధికంగా ఉండే కార్టిసాల్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. మన శరీరంలోని సహజ […]Read More