సాయిపల్లవి చూడటానికి మన ఇంట్లో అమ్మాయిగా.. పక్కింట్లో యువతిగా… యువతరం కోరుకునే ఓ ప్రియురాలిగా.. పండు ముసలికి ముచ్చటైన మనవరాలిగా.. బ్రదర్ కి ఓ సిస్టర్ గా.. తల్లిదండ్రులకు ఓ కూతురుగా ఉండాలన్పించే చక్కని రూపం.. సినీ ప్రేక్షకులను మెప్పించే అభినయం ఉన్న సహాజ నటి. సాయిపల్లవి ఇప్పటివరకు ఫుల్ ఫ్లెడ్జెడ్ గా తన సినిమాలకు డబ్బింగ్ చెప్పలేదు. కానీ తొలిసారిగా సాయిపల్లవి నేరుగా రంగంలోకి దిగింది తాజా మూవీ అమరన్. మేజర్ ముకుందన్ బయోపిక్ ద్వారా […]Read More
ఎప్పుడెప్పుడా అని బన్నీ అభిమానులతో పాటు సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్న చిత్రం పుష్ప -2. ఈ చిత్రం డిసెంబర్ 05న ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌లో అదరగొడుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే అన్ని భాషల్లో కలిపి ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.1000 కోట్లకు పైగా జరిగినట్లు సమాచారం. తాజాగా ఈ చిత్రం విడుదల పరంగా మరో రికార్డును నమోదు చేయబోతుంది. ఆరు భాషల్లో కలిపి 11,500 స్క్రీన్స్‌లో విడుదల […]Read More
న్యూజిలాండ్ జట్టుతో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. మూడోందల యాబై తొమ్మిది పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రోహిత్ సేన 245పరుగులకే ఆలౌటైంది. దీంతో మూడు టెస్ట్ ల సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ కోల్పోయింది.Read More
హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లోని మంత్రుల నివాస సముదాయంలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇరు రాష్ట్రాల తాజా రాజకీయ పరిస్థితులతో పాటు, రెండు రాష్ట్రాల్లో అమలవుతున్న సంక్షేమ పథకాల తీరుతెన్నుల గురించి ఇరువురు నేతలు చర్చించుకున్నారు. ఆర్ఆర్ఆర్, మూసీ శుద్ధీకరణ గురించి మంత్రి వివరించారు.Read More
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు పరోక్షంగా విమర్శలు చేశారు. ‘నాడు జగనన్న వదిలిన బాణం! నేడు చంద్రన్న వదిలిన బాణం! విధి విచిత్రమైనది’ అని ఆయన ట్వీట్ చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ ను విమర్శిస్తూ షర్మిల మూడు పేజీల బహిరంగ లేఖ రాయడంతో ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరలవుతోంది.Read More
బౌరంపేటలో లైంగిక దాడికి గురై హైదర్ నగర్ లోని రెయిన్బో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నాలుగు సంవత్సరాల చిన్నారిని పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క పరామర్శించారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితిని, అందుతున్న వైద్యాన్ని డాక్టర్ల నుంచి అడిగి తెలుసుకున్నారు. మహిళా అభివృద్ధి సహకార కార్పొరేషన్ చైర్ పర్సన్ బండ్లు శోభారాణి, మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కాంతి వెస్లీ తో కలిసి చిన్నారిని, కుటుంబాన్ని మంత్రి సీతక్క […]Read More
తెలంగాణ ప్రభుత్వంపై.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి .. తన గురించి తనపై ట్రోలింగ్ చేసే వారిని, తన వ్యాఖ్యలను వక్రీకరించి తప్పుడు ప్రచారం చేసే వారిని బహిరంగంగా బట్టలూడదీసి కొడతానని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో తప్పుగా ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా బ్యాచ్ దండుపాళ్యం గ్యాంగ్ గా మారిందన్నారు. ఆ పార్టీ నేతలు.. మాజీ మంత్రులు హరీశ్ రావు, […]Read More
తెలంగాణ రాష్ట్ర బీఆర్ అంబేద్కర్ నూతన సచివాలయం వద్ద ఆందోళన చేస్తున్న బెటాలియన్ పోలీసుల కుటుంబీకులను పోలీసులు అరెస్ట్ చేసి ఠాణాలకు తరలిస్తున్నారు. ఈక్రమంలోనే ఓ మహిళను అదుపులోకి తీసుకొని వ్యాన్ ఎక్కించారు. దీంతో ఆమె ‘నాకు పాలు తాగే చిన్న బాబు ఉన్నాడు.. వదిలేయండి ప్లీజ్’ అని వేడుకున్నారు. అక్కడున్న మీడియా సిబ్బంది కూడా ఆమెను వదిలేయాలని కోరారు. అయినా పోలీసులు వినకుండా ఆమెను వ్యానులో తీసుకెళ్లారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.Read More
అధికార కాంగ్రెస్ కు చెందిన సీనియర్ నేత.. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్.. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి జిల్లా కు చెందిన మహిళ కలెక్టర్ పై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియో జగ్గారెడ్డి మాట్లాడుతూ ” నేను ఫోన్ చేస్తే కలెక్టర్ లిప్ట్ చేయలేదు. ఆఫీసు కెళ్తే అక్కడా కలెక్టర్ లేదు… నాకు కోపం వస్తే ఎలా తిడతానో తెలుసా..?. వెంటనే […]Read More
మాజీ ముఖ్యమంత్రి… వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి.. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మధ్య ఆస్తుల వివాదం కొనసాగుతున్న సంగతి తెల్సిందే..తాజాగా ఈ వివాదంలో జనసేన అధినేత.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంట్రీచ్చారు. పంచాయితీ రాజ్, అటవీ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ జగన్ కు చెందిన సరస్వతి పవర్ కంపెనీ ఆస్తులకు సంబంధించిన భూములపై ఆరా తీయమని సంబంధితాధికారులకు ఆదేశాలను జారీ చేసినట్లు తెలుస్తుంది. పల్నాడు జిల్లా దాచేపల్లి,మాచవరం మండలంలో […]Read More