మంథని- ముత్తారం మండల కేంద్రానికి చెందిన పెరుక రాజేశ్వరి(60) ఈ నెల 5 నుంచి కనిపించకుండా పోయింది.ఇంట్లో ఒంటరిగా ఉంటుండటంతో ఈ విషయాన్ని ఎవరూ గుర్తించలేదు. 8న పారుపల్లి శివారులోని వ్యవసాయ బావిలో గోనె సంచిలో కట్టి పడేసిన గుర్తు తెలియని మహిళ శవాన్ని రైతు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఈ నెల 14న రాజేశ్వరి కనిపించడం లేదని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు చెప్పిన ఆనవాళ్ల ప్రకారం మృతురాలిని రాజేశ్వరిగా గుర్తించి […]Read More
హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి అవసరమైన ప్రణాళికలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యాన్ని తమ ప్రభుత్వం ఆహ్వానిస్తుందని, ఇందులో ఎవరి పట్లా వివక్ష చూపబోదని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి చెప్పారు. హెచ్ఐసీసీలో కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ (KGF) ఆధ్వర్యంలో జరిగిన గ్లోబల్ సమ్మిట్‌లో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తెలంగాణలో ఎవరి పట్ల వివక్ష ఉండదని, అది ప్రజా ప్రభుత్వ విధానం కూడా కాదని సీఎం అన్నారు. అన్ని కులాల పట్ల అపారమైన గౌరవం ఉందని, కమ్మ ప్రతినిధుల నైపుణ్యాలను […]Read More
ఆషాఢ మాసం బోనాల ఉత్సవాల సందర్బంగా ముఖ్యమంత్రి శ్రీ ఏ.రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రజలందరిపై అమ్మవారి చల్లని చూపు ఉండాలని ప్రార్థించారు. ముఖ్యమంత్రి తోపాటు పూజలో మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్, రాజ్యసభ ఎంపీ శ్రీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు శ్రీ దానం నాగేందర్, శ్రీ శ్రీగణేష్, ఎమ్మెల్సీ శ్రీ బల్మూర్ వెంకట్, పలువురు ముఖ్యులు పాల్గొన్నారు.Read More
ఢిల్లీలో తన అధికారిక నివాసంలో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఆ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జ, రాష్ట్ర నీటి పారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులు, పరీక్షలు, కమిషన్ విచారణ తదితర అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు.ఢిల్లీలో శనివారం జరిగిన నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్ఏ) సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలను మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, […]Read More
సికింద్రాబాద్ స్టేషన్ లో పునరాభివృద్ధి పనుల కారణంగా దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్‌లో శని, ఆదివారాల్లో కొన్ని సర్వీసులను రద్దు చేసింది. రద్దు చేయబడిన ఎంఎంటీఎస్ రైళ్లలో .47177 (రామచంద్రపురం-ఫలక్‌నుమా), 47156 (ఫలక్‌నుమా – సికింద్రాబాద్), 47185 (సికింద్రాబాద్ – ఫలక్‌నుమా), 47252 (ఫలక్‌నుమా – సికింద్రాబాద్), 47243 (సికింద్రాబాద్ – మేడ్చల్), 47241 (మేడ్చల్) , 47250 (సికింద్రాబాద్ – ఫలక్ నుమా), 47201 (ఫలక్ నుమా – హైదరాబాద్), 47119 (హైదరాబాద్ – లింగంపల్లి), […]Read More
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో A1గా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా అమెరికాలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్న నేపథ్యంలో పర్చువల్ గా విచారణకు హాజరవుతానని కోర్టుకు తెలిపారు. అయితే కేసులో ఏ1 గా ఉన్న ప్రభాకర్ రావు పర్చువల్ వీడియో కాన్ఫరెన్స్ లో విచారణ చేయడం అసాధ్యం .. తప్పనిసరిగా ప్రతేక్ష విచారణకు హాజరు కావాల్సిందే అని […]Read More
టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి నెట్స్ ప్రాక్టీస్ లో తన బౌలింగ్ ను ఎదుర్కొనేందుకు ఇష్టపడరని బౌలర్ మహ్మద్ షమీ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘నేను చాలా ఇంటర్వ్యూల్లో కూడా విన్నాను. వారిద్దరికీ నెట్స్ ప్రాక్టీస్ లో నా బౌలింగ్ ఆడటం ఇష్టం ఉండదు. రోహిత్ అయితే డైరెక్ట్ గానే ఆడనని అనేస్తారు అని చెప్పారు . విరాట్ కూడా అంతే. అవుట్ అవగానే తనకు కోపం వచ్చేస్తుంది’ అని అందుకే […]Read More
వన్డే,టీ20 సిరీస్ కోసం ఈ నెల ఇరవై రెండో తారీఖున టీమిండియా శ్రీలంకకు వెళ్లనున్నట్లు తెలుస్తుంది. అదే రోజు టీమిండియా లెజండ్రీ మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ టీమిండియా జట్టుకు నూతన కోచ్ గా బాధ్యతలు స్వీకరించనున్నాడు. అయితే గంభీర్ ప్రతిపాదించిన అభిషేక్ నాయర్,ర్యాన్ టెన్ డెస్కాటే ను భారత్ కోచింగ్ సిబ్బందిలోకి బీసీసీఐ తీసుకోనున్నట్లు తెలుస్తుంది. ఫీల్డింగ్ కోచ్ గా ప్రతిపాదించిన జాంటీ రోడ్స్ ను మాత్రం ఎంపిక చేయలేదు.టి దిలీప్ నే కొనసాగించనున్నది అని […]Read More
తనకు గుర్తింపు వచ్చాక టీమిండియా మాజీ కెప్టెన్.. పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ మారిపోయాడని మాజీ క్రికెటర్ అమిత్ మిశ్రా చేసిన వ్యాఖ్యలకు మహమ్మద్ షమీ అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి మాట్లాడితే తర్వాత రోజు న్యూస్ పేపర్లో తమ పేరు ఫ్రంట్ ఫేజీలో కన్పిస్తుందని చాలా మంది భావిస్తారు. అలా భావించే కొంతమంది విరాట్ కోహ్లీ గురించి అలాంటి కామెంట్లు చేస్తారు అని ఓ ప్రముఖ ఛానెల్ కిచ్చిన […]Read More
టీమిండియా మాజీ లెజండ్రీ ఆటగాడు హర్భజన్ సింగ్ టీమిండియా సెలెక్టర్లపై తీవ్ర అసహానాన్ని వ్యక్తం చేశారు.ఎల్లుండి శ్రీలంకకు వెళ్లనున్న టీమిండియా జట్టులో అభిషేక్ శర్మ,చాహల్ కు ఎందుకు అసలు చోటు కల్పించడంలేదని భజ్జీ ప్రశ్నించాడు. అయితే మరోవైపు టీ20లకు సంజూ శాంసన్ ను మాత్రమే ఎంపిక చేయడం పట్ల కూడా భజ్జీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చాహల్ ,అభిషేక్ శర్మ,సంజూ శాంసన్ ఎందుకు లేరు..?. నాకసలు ఆర్ధం కావడం లేదు..! అని ట్వీట్ చేశాడు. తన రెండో […]Read More